చెన్నై: నేటి యువత కొన్ని విషయాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. చదువుపై దృష్టిపెట్టాల్సిన వారు ప్రేమ పేరుతో పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇద్దరు టీనేజ్ విద్యార్థులు ఏకంగా బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద మైనర్ బాలుడు పక్కన యూనిఫాం ధరించి కూర్చొని ఉన్న బాలిక మెడలో మంగళసూత్రం కట్టాడు.
చుట్టూ ఉన్న స్నేహితులు వారిని పెళ్లి చేసుకునే విధంగా ప్రోత్సహించడం వీడియోలో వినిపిస్తుంది. కాగా వీడియోలోని యువతి ఇంటర్ చదువుతున్నట్లు, ఆమెను పెళ్లి చేసుకున్న అబ్బాయి పాలిటెక్నిక్ విద్యార్థిగా తెలుస్తోంది. సరదా కోసం చేశారో, ఉద్ధేశ్యపూర్వకంగా ఇలా చేశారో తెలియదు కానీ వీరి ప్రవర్తన చట్టపరమైన చర్యలకు దారితీసింది. నెట్టింట్లో వీడియో చక్కర్లు కొట్టడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిదంబరం జిల్లా పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’
అంతేగాక ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. టీనేజ్‌లో ఇలాంటి చర్యకు పాల్పడటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఊరికే వదిలిపెట్టవద్దని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘అబ్బాయితోపాటు అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలి. ఈ రోజుల్లో కాలేజీ, స్కూల్ అమ్మాయిల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారిని గమనిస్తూ ఉండాలి. స్కూల్ బ్యాగ్, మొబైల్ ఫోన్‌ని పరిశీలిస్తూ ఉండాలి.’ అని కామెంట్ చేస్తున్నారు.
காலேஜ் மாணவிகள் பரவாயில்லை ஆனால் பள்ளி மாணவிகள் நிலை மோசம் ஆகிரது பெற்றோர்கள் மாணவிகளின் ஸ்கூல் பேக் & மொபைலை பெற்றோர்கள் கண்காணிக்கவும்😭😭😭 pic.twitter.com/BUdtkbCGVq
— SP Chhandak (@CHHANDAK175) October 10, 2022
Comments
Please login to add a commentAdd a comment