
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సోమవారం ఉదయం తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మన్మోహన్ జైల్లో ఉన్న చిదంబరాన్ని పరామర్శించి.. కాసేపు ముచ్చటించారు. చిదంబరం తనయుడు కార్తీ కూడా సోమవారం జైల్లో ఉన్న తండ్రిని కలిశారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చిదంబరాన్ని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. లాయర్ అయిన చిదంబరం బెయిల్ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment