
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తేనే గుజరాత్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కౌంటింగ్‌కు ముందే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని, అక్కడ కౌంటింగ్ జరిగిందని, రీకౌంటింగ్ జరగలేదని స్పష్టంచేశారు.
స్పష్టత కావాలంటే ఈసీనే సంప్రదించాలని సూచించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించకపోవడంపై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ను మోదీ తప్పుబట్టారు. ఈసీని పౌరులు కాకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారో చెప్పాలని చిదంబరం డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment