కాంగ్రెస్ ప్లీనరీ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దుపై ఎన్‌డీఏ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్‌బీఐ ఇంకా లెక్కలు కడుతూనే ఉందని, పాతనోట్ల రూపంలో ఎంత మొత్తం తిరిగివచ్చిందనేది ఇప్పటికీ వెల్లడించలేదని దుయ్యబట్టారు