సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్లీనరీ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దుపై ఎన్‌డీఏ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్‌బీఐ ఇంకా లెక్కలు కడుతూనే ఉందని, పాతనోట్ల రూపంలో ఎంత మొత్తం తిరిగివచ్చిందనేది ఇప్పటికీ వెల్లడించలేదని దుయ్యబట్టారు. ‘ మీరు (ఆర్‌బీఐ) తిరుపతి హుండీలెక్కలను ఎందుకు పరిశీలించరు..? వాళ్లు మీకంటే వేగంగా డబ్బును లెక్కిస్తార’ని చిదంబరం వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు నిర్ణయం బూటకమని..బ్లాక్‌మనీ, అవినీతిని నిర్మూలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర పాలకులు నమ్మబలకడం హాస్యాస్పదమని చిదంబరం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రతి ర్యాలీకి నల్లధనాన్నే ఖర్చు చేశారని ఆరోపించారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థను ఎన్‌డీఏ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment