
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో బిహార్ ఎన్నికల ఫలితాల ఎపిసోడ్ చివరి అంకానికి చేరినట్లు కనపడుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు బిహార్ కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రసాద్ తెర ముందుకొచ్చారు. తన వల్లే పార్టీ రాష్ట్రంలో పరాజయం పాలైందని ఒప్పుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఓటమి గల కారణాలను వివరించేందుకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరారు. గత 20 ఏళ్లలో ప్రత్యర్థులు గెలుస్తున్న సీట్లను తమకు కేటాయించడం వల్లే ఈ పరాజయం పొందామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా తమకు బలంలేని చోట పోటీకి దిగామని, పరాజయంపై రాహుల్ గాంధీతో చర్చిస్తానని అన్నారు. వ్యూహాత్మకంగా బలహీనంగా ఉన్న చోట సరిచేయాలని అధినేతతో చెప్తానని అన్నారు. బ్లాక్, జిల్లా స్థాయిలో పార్టీ చాలా బలహీనంగా ఉందని ఆయన అంగీకరించారు. ఏ రాష్ట్ర ఎన్నికల్లో అయిన గెలవాలంటే పార్టీలో భారీ సంస్కరణలు అమలు చేయాలని అన్నారు.
ఇంతకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. పార్టీని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టాలని పరోక్షంగా రాహుల్‌ని ఉద్ధేశించి బహిరంగంగా విమర్శించారు. కాంగ్రెస్ నానాటికీ బలహీన పడుతుందని, వ్యవస్థాగతంగా మార్పులు చేయాలని మరో సీనియర్ నేత చిదంబరం సూచించారు. అంతేకాకుండా బిహార్‌లో సీట్ల ఎంపికలో సరిగా వ్యవహరించలేదని, ప్రతిపక్షాలు గత 20 ఏళ్లలో గెలుస్తున్న 25 సీట్లను అంటగట్టారని అన్నారు. అన్ని స్థానాల్లో కాకుండా 45 సీట్లలో పోటీకి నిలిపితే బాగుండేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ ప్రసాద్ స్పందిస్తూ.. తనకు కపిల్ సిబల్ అంటే చాలా గౌరవమని అన్నారు. పరాజయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్పిందని అన్నారు. బిహార్‌లో కొన్ని సీట్లలో పోటీ చేసి ఉంటే విజయానికి దగ్గరలో ఉండేదన్న వ్యాఖ్యలపై మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల్లోనూ పరాజయం తరువాత ఇవి తీవ్రమయ్యాయి. (చదవండి: కాంగ్రెస్ పార్టీపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment