సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్‌పై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ప్రశ్నల్ని సంధించారు. దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంటే.. లక్షల కోట్లతో భారత్‌మాల, బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ ను ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటూ తన దాడిని ఎక్కుపెట్టారు.
భారతీయ ఆర్థిక వ్యవస్థ 2004- 2009 మధ్యకాలంలో 8.5 శాతం వృద్ధిని సాధించింది, ఇది ఇప్పటివరకు భారతదేశంలో అత్యుత్తమ రేటు. కానీ 2014 నాటికి ఇది భయంకరమైనదిగా దిగజారిపోయిందని చిదంబరం కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే, ఎందుకు రూ. 6 లక్షల కోట్ల భారతమాల కార్యక్రమం ఎందుకు ప్రకటించారు? బ్యాంకులకు భారీ స్థాయిలో రీ క్యాపిటలైజేషన్ (రూ2.11 లక్షల కోట్లు) ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దుతో ఆర్ధికవృద్ధిరేటు మందగించిదని మండిపడ్డారు. నల్లధనాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. జీఎస్‌టీ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నంచేసిందని చిదంబరం మండిపడ్డారు. జీఎస్‌టీ చిన్న, మధ్యతరహా వ్యాపారాలను నాశనం చేసిందనీ, తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన మూలన పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జీఎస్‌టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని వ్యాఖ్యానించిన చిదంబరం జీఎస్‌టీ రేటు 18శాతానికి మించి ఉండకూడదన్నారు. అలాగే బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై మండిపడిన మాజీ ఆర్థికమంత్రి ఆ లక్ష కోట్ల రూపాయల నిధులను దేశంలో విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం ఎందుకు వెచ్చించలేదంటూ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment