recapitalise
-
బ్యాంకులకు రూ .80,000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కింద రూ 80,000 కోట్ల నిధులను అందించాలన్న ప్రతిపాదనకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. మొండి బాకీలు, రుణ డిమాండ్ తగ్గుదలతో సతమతమవుతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం భారీగా నిధుల సాయం అందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. బాండ్ల ద్వారా పీఎస్‌యూ బ్యాంకులకు రూ 80,000 కోట్లు అదనందగా వెచ్చించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల వ్యవధిలో బ్యాంకులకు రూ 1.35 లక్షల కోట్ల మూలధనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు జూన్ 2017 నాటికి విపరీతంగా పెరిగి రూ 7.33 లక్షల కోట్లకు ఎగబాకాయి. -
అంతా బావుంటే..మరి అవన్నీ ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్‌పై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ప్రశ్నల్ని సంధించారు. దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంటే.. లక్షల కోట్లతో భారత్‌మాల, బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ ను ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటూ తన దాడిని ఎక్కుపెట్టారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ 2004- 2009 మధ్యకాలంలో 8.5 శాతం వృద్ధిని సాధించింది, ఇది ఇప్పటివరకు భారతదేశంలో అత్యుత్తమ రేటు. కానీ 2014 నాటికి ఇది భయంకరమైనదిగా దిగజారిపోయిందని చిదంబరం కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే, ఎందుకు రూ. 6 లక్షల కోట్ల భారతమాల కార్యక్రమం ఎందుకు ప్రకటించారు? బ్యాంకులకు భారీ స్థాయిలో రీ క్యాపిటలైజేషన్ (రూ2.11 లక్షల కోట్లు) ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దుతో ఆర్ధికవృద్ధిరేటు మందగించిదని మండిపడ్డారు. నల్లధనాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. జీఎస్టీ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నంచేసిందని చిదంబరం మండిపడ్డారు. జీఎస్టీ చిన్న, మధ్యతరహా వ్యాపారాలను నాశనం చేసిందనీ, తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన మూలన పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జీఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని వ్యాఖ్యానించిన చిదంబరం జీఎస్టీ రేటు 18శాతానికి మించి ఉండకూడదన్నారు. అలాగే బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై మండిపడిన మాజీ ఆర్థికమంత్రి ఆ లక్ష కోట్ల రూపాయల నిధులను దేశంలో విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం ఎందుకు వెచ్చించలేదంటూ విమర్శించారు. -
బ్యాంకుల రీకాపిటలైజేషన్ ఫండ్ కేటాయింపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కోసం కేటాయించిన నిధుల్లో మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది . ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయల కేటాయించిన ప్రభుత్వం రూ22,915 కోట్ల ఫండ్ ను కేటాయించింది. 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నిధులను పంపిణీ చేయనుంది. బ్యాంకుల సామర్థ్యం, క్రెడిట్, నిక్షేపాలు, ఖర్చుల తగ్గింపు తదితర కార్యకలాపాల పనితీరుతో ముడిపడి మిగిలిన మొత్తం నిధుల జారీ ఉంటుందని తెలిపింది. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 'ఇంద్రధనుశ్' పథకం కింద ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత సంవత్సరం మూలధనం, వార్షిక వృద్ధి రేటు, గత ఐదు సంవత్సరాలుగా క్రెడిట్ వృద్ధి రేటు ఆధారంగా ఈ కేటాయింపులు చేసినట్టు తెలిపింది. ద్రవ్యత మద్దతు అందించడానికి వీలుగా 75 శాతం నిధులును అందజేయనున్నట్టుస్పష్టం చేసింది. ఎస్ బీఐ - 230. 85శాతం రూ.7,575 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 133.10 శాతం రూ. 2,816 కోట్లు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 112.60 శాతం రూ. 1,784 కోట్లు కెనరా బ్యాంక్ - రూ. 256.40 శాతం రూ. 997 కోట్లు సిండికేట్ బ్యాంక్ - 256.40 శాతంతో రూ. 1,034 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 1,729 కోట్ల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ 3,101 కోట్లు తదితర బ్యాంకులకు మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 25వేల కోట్ల రూపాయలను ఫండ్స్ ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రకటించింది. దీనిపై స్పందించిన నిపుణులు ప్రభుత్వం కేటాయించిన దాని కన్నా బ్యాంకులకు మరింత మూలధనం అవసరపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇవే అంతిమ నిధులు కావాలని, అదనపు నిల్వలు కావాల్సిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని జైట్లీ హామి ఇచ్చిన సంగతి తెలిసిందే.