జీఎస్టీ ఒక మోసం: చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పూర్తి అసంపూర్ణమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు. అసలు జీఎస్టీని ‘ఒకే దేశం.. ఒకే పన్ను’అనడానికే వీల్లేదని, ఇందులో ఏడు కన్నా ఎక్కువ రకాల పన్ను రేట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
పెట్రోల్, విద్యుత్, రియల్ ఎస్టేట్ రంగాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది సరైన జీఎస్టీ కాదని, కేంద్రం మోసం చేసిందని, అసలు యూపీఏ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జీఎస్టీ ఇది కాదన్నారు. జీఎస్టీ అమలును కాంగ్రెస్ ఎప్పుడూ పర్యవేక్షిస్తుందని, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల సమస్యలు, అనుమానాలు, సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తుందని చెప్పారు.