'ఇది అసలైన జీఎస్‌టీ కానే కాదు' | It is not the original GST that experts had drafted: Chidambaram | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీపై చిదంబరం హెచ్చరిక.. ఏమిటది?

Published Sat, Jul 1 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

'ఇది అసలైన జీఎస్‌టీ కానే కాదు'

'ఇది అసలైన జీఎస్‌టీ కానే కాదు'

న్యూఢిల్లీ: వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ)పన్నుపై కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం పెదవి విరిచారు. అది అసలైన జీఎస్‌టీ కాదని అన్నారు. నిపుణులు తయారు చేసి ఇచ్చిన ముసాయిదా ప్రకారం ఈ జీఎస్‌టీ లేదని, కచ్చితంగా ద్రవ్యోల్బణంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వర్తకులంతా కూడా పెద్ద మొత్తంలో నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్కరణగా పేర్కొంటూ దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండేలాగా వస్తు సేవా పన్నును శుక్రవారం అర్థరాత్రి 12గంటల ప్రాంతంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీతో సహా విపక్షాలన్నీ డుమ్మా కొట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో బీజేపీనే స్వయంగా జీఎస్‌టీని వద్దని చెప్పిందన్న విషయం అందరికీ తెలుసని, దీనిని ఎవరూ కాదన లేరని గుర్తు చేశారు. భారత దేశంలో జీఎస్‌టీ అమలు సాధ్యం కాదని కూడా బీజేపీనే ఆరోపించి గతంలో అడ్డుకుందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement