సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయంపై సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ద్రవ్య లభ్యత కోసం సోమవారం రిజర్వు బ్యాంకు రూ.50,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించటాన్ని ఆయన స్వాగతించారు. ఆర్‌బీఐ సత్వర చర్య మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో నెలకొన్న ఆందోళనలకు ఊరటనిస్తుందని ఆయన ప్రశంసించారు.
ప్రముఖ పెట్టుబడి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భారత్‌లోని ఆరు పథకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో తన పెట్టుబడిని కొద్దిరోజుల క్రితం స్తంభింపజేసింది. అయితే పెట్టుడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సొమ్మును తిరిగి చెల్లిస్తామని స్పష్టత నిచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయంతో దేశీయ పెట్టుబడిదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్‌బీఐ లిక్విడిటీ సదుపాయాన్ని ప్రకటించింది. (మ్యూచువల్ ఫండ్లకు ఆర్‌బీఐ భారీ ప్యాకేజీ)
చదవండి: జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే!
Comments
Please login to add a commentAdd a comment