Mutual fund companies
-
ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?
లిక్విడ్ ఫండ్‌లో ఉన్న నా పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించినట్టయితే, అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుందా? – అజయ్ కుమార్ఏ తరహా మ్యూచువల్ ఫండ్(Mutual Funds)లో పెట్టుబడులు ఉన్నాయి..ఏ సమయంలో అభ్యర్థన (కొనుగోలు/విక్రయం) పంపించారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించేందుకు ఆర్డర్ చేశారని అనుకుందాం. లిక్విడ్ ఫండ్స్‌కు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు. మీ అభ్యర్థన ఈ సమయానికి ముందే చేశారు కనుక, విక్రయించిన యూనిట్లకు శుక్రవారం నాటి ఎన్ఏవీ వర్తిస్తుంది. ఇలా విక్రయించిన పెట్టుబడులు బ్యాంక్ అకౌంట్(Bank Account)లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అన్నది తెలుసుకుందాం. ఈ విషయంలోనూ ఏ ఫండ్‌లో పెట్టుబడులు విక్రయించారన్నది కీలకం అవుతుంది. లిక్విడ్ ఫండ్, ఓవర్‌నైట్ ఫండ్‌లో పెట్టుబడులను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు ఒక పనిదినం పడుతుంది. ఇతర డెట్ ఫండ్స్ అయితే, రెండు రోజుల సమయం తీసుకుంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వెనక్కి వచ్చేందుకు మూడు పనిదినాలు పడుతుంది. టీప్లస్ రూపంలో ఈ విషయాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాయి.ఉదాహరణకు సోమవారం నాడు ఈక్విటీ ఫండ్స్(Equity Funds)లో పెట్టుబడులు విక్రయించారని అనుకుంటే, ఈ మొత్తం గురువారం నాడు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. రియలైజింగ్ మనీ అంటే.. ఇన్వెస్టర్ కొనుగోలు ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (AMC) అందుకోవడం. బ్యాంక్ నుంచి పంపించారనుకుంటే ఆ మొత్తం ఏఎంసీ చేరేందుకు కొన్ని గంటలు లేదా రోజు సమయం తీసుకోవచ్చు. కొనుగోలు ఏ రోజు చేశారన్న దానితో సంబంధం లేకుండా, ఏఎంసీకి ఆ మొత్తం అందిన రోజు ఎన్ఏవీనే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడులను కటాఫ్ సమయం 3 గంటలు దాటిన తర్వాత విక్రయించారని అనుకుంటే, అప్పుడు తర్వాతి రోజు ఎన్ఏవీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే తర్వాతి రోజునే ఫండ్స్ సంస్థలు ఆ మేరకు విక్రయాలు చేస్తాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..నాకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. వాటిని ఇటీవలే విక్రయించి అదే పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశాను. కనుక లాభాలపై నేను పన్ను చెల్లించాలా? లేక భవిష్యత్తులో పెట్టుబడులు విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తుందా? – రాజన్ పీ.ఏఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ నుంచి మరో ప్లాన్‌లోకి మారినప్పుడు, అది రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్ అయినా సరే దాన్ని పెట్టుబడి ఉపసంహరణగానే చూస్తారు. ఆదాయపన్ను చట్టం కింద పెట్టుబడుల విక్రయమే అవుతుంది. దీనర్థం.. మూలధన లాభాలపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మరో ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్తులో విక్రయించినట్టయితే.. హోల్డింగ్ పీరియడ్ (ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారు), వచ్చిన మూలధన లాభాల ఆధారంగా తిరిగి అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడి నుంచి విక్రయం మధ్య కాలానికి పన్ను వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్ -
న్యూ ఫండ్ ఆఫర్లకు కాల పరిమితులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొత్త పథకాల రూపంలో (ఎన్‌ఎఫ్‌వోలు) సమీకరించే నిధులను ఇన్వెస్ట్ చేసేందుకు కాల పరిమితులను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, అస్సెట్ మేనేజ్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) ఉద్యోగుల ప్రయోజనాలను, యూనిట్ హోల్డర్ల ప్రయోజనాలతో సమీకృతం చేసే నిబంధనలను సడలించాలన్న నిర్ణయానికొచి్చంది. దీనికితోడు అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను ఇన్వెస్టర్లతో మరింత పారదర్శకంగా పంచుకోవాలని నిర్దేశించింది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలకు బుధవారం నాటి సెబీ బోర్డులో ఆమోదం లభించింది. ఎన్ఎఫ్వో ద్వారా సమీకరించిన నిధులను ఏఎంసీలు 30 రోజుల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.ఆలోపు ఇన్వెస్ట్ చేయకపోతే ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ‘‘30 రోజుల్లోపు ఇన్వెస్ట్ చేయడానికి వీలైనంత పెట్టుబడులనే ఓపెన్ ఎండెడ్ ఎన్ఎఫ్వోలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ సమీకరించాలి. ఎందుకంటే ఇవి ఓపెన్ ఎండెడ్ పథకాలు కనుక ఇన్వెస్టర్లు కావాలంటే తర్వాత తిరిగి ఇన్వెస్ట్ చేసుకోగలరు’’అని సెబీ తెలిపింది.ఏఎంసీ ఉద్యోగులకు సంబంధించి కార్యాచరణను సులభతరం చేయాలని నిర్ణయించింది. దీని కింద ఏఎంసీకి చెందిన నియమిత ఉద్యోగులు ఇన్వెస్ట్ చేయాల్సిన కనీస మొత్తాన్ని తగ్గించింది. ఏఎంసీ నుంచి తప్పుకున్న ఉద్యోగికి సంబంధించి పెట్టుబడులకు లాకిన్ పీరియడ్‌ను సైతం తగ్గించనున్నారు. సెబీ నిర్ణయాలను ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా ఆహా్వనించారు. వేగంగా విస్తరిస్తున్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు యూనిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించే నిపుణులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
క్వాంట్ ఫండ్ కార్యాలయాల్లో సెబీ సోదాలు
ముంబై: ఫ్రంట్ రన్నింగ్ కేసులను తీవ్రంగా పరిగణిస్తున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా క్వాంట్ మ్యుచువల్ ఫండ్‌పై దృష్టి సారించింది. కంపెనీకి చెందిన హైదరాబాద్, ముంబై కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధమున్న డీలర్లు, వ్యక్తులను కూడా సెబీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సందీప్ టాండన్ నెలకొల్పిన క్వాంట్ మ్యుచువల్ ఫండ్ అసెట్లు 2019లో సుమారు రూ. 100 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం రూ. 90,000 కోట్ల పైచిలుకు చేరాయి. 26 స్కీములు, 54 లక్షల ఫోలియోలతో ఈ ఫండ్ ఈ ఏడాది జనవరిలోనే రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. సంస్థకి చెందిన స్మాల్ క్యాప్ ఫండ్ గత అయిదేళ్లలో ఏకంగా 45 శాతం రాబడిని అందించింది. మే నెలలో స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి వచి్చన మొత్తం నిధులలో 43 శాతం నిధులు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లోకే రావడం గమనార్హం. పెద్ద ఆర్డర్లు రాబోతున్న సమాచారం తెలుసుకుని ఫండ్ మేనేజర్లు, డీలర్లు, బ్రోకర్లు ముందుగానే తమ సొంత ఖాతాల ద్వారా ఆయా షేర్లలో ట్రేడింగ్ చేసి లాభపడటాన్ని ఫ్రంట్ రన్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి లావాదేవీలన్నీ వేరే వారి పేరిట ఉండే ఖాతాల ద్వారా జరుగుతాయి కాబట్టి అంతిమంగా లబ్ధి పొందే వ్యక్తులను గుర్తించడం కఠినతరంగా ఉంటోంది. దీంతో సెబీ కొన్నాళ్లుగా ఈ తరహా కేసులపై మరింత లోతుగా విచారణ జరుపుతోంది. ఇలాంటి ఆరోపణలపైనే యాక్సిస్ మ్యుచువల్ ఫండ్‌కి చెందిన ఫండ్ మేనేజర్ వీరేశ్ జోషితో పాటు అతనికి సంబంధించిన 20 సంస్థలు, వ్యక్తులపై సెబీ గతంలో చర్యలు తీసుకుంది. -
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్‌ఫండ్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
ఐపీవో నిధుల వినియోగానికి కళ్లెం
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ నిధుల వినియోగంసహా మ్యూచువల్ ఫండ్ తదితర పలు విభాగాలలో నిబంధనలను సవరించింది. మంగళవారం(28న) సమావేశమైన సెబీ బోర్డు ప్రిఫరెన్షియల్ షేర్లు, ఫండ్ పథకాల నిలిపివేత, సెటిల్మెంట్ విధానాలు, కంపెనీ ఎండీ పునర్నియామకం, ఒత్తిడిలోపడ్డ రుణాలలో పెట్టుబడులు వంటి పలు మార్గదర్శకాలలో మార్పులకు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. ముందస్తు అనుమతి... సెబీ తాజా సవరణలు అమలులోకి వచ్చాక కంపెనీ ఎండీ, హోల్‌టైమ్ డైరెక్టర్ లేదా మేనేజర్ ఎంపికకు ఇకపై వాటాదారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. సాధారణ వాటాదారుల సమావేశంలో తిరస్కారానికి గురైన అధికారుల ఎంపిక లేదా పునర్నియామకానికి ముందస్తు అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇక మార్కెట్లను ముంచెత్తుతున్న పబ్లిక్ ఇష్యూలపైనా సెబీ దృష్టి సారించింది. 2022లో మరిన్ని కంపెనీల ఐపీవోల నేపథ్యంలో ఇష్యూ నిధుల విని యోగంపై ఆంక్షలు విధించింది. స్పష్టతలేని కంపెనీయేతర వృద్ధి అవకాశాలకు వినియోగించదలచిన నిధులకు ఇవి వర్తించనున్నాయి. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు ఐపీవోలో విక్రయానికి ఉంచదలచిన షేర్ల సంఖ్యపైనా పరిమితులు అమలుకానున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50%కి లాకిన్ పిరియడ్ 90 రోజులకు పెరగనుంది. మిగిలిన వాటాకు ప్రస్తుత 30 రోజుల గడువే అమలుకానుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించే నిధులపైనా సెబీ పర్యవేక్షణ ఉంటుంది. కొత్త టెక్ ఐపీవోలు.. ఇటీవల కొత్తతరహా టెక్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ చేపడుతున్న నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగుకు వీలుగా ఐపీవోలకు వస్తున్న కంపెనీల ధరల శ్రేణి నిర్ణయంపై ఆంక్షలు ఉండబోవని సెబీ చైర్పర్సన్ అజయ్ త్యాగి స్పష్టం చేశారు. ప్రైస్ డిస్కవరీ(ధరల నిర్ణయం) అనేది మార్కెట్ ఆధారితమని, ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. సెబీ తాజా నిర్ణయాలలో భాగంగా ఒత్తిడిలోఉన్న రుణాల(ఆస్తుల)లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యేక సిట్యుయేషన్ ఫండ్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌లు)కు తెరలేవనుంది. కేవలం మొండి రుణాలలో ఇన్వెస్ట్ చేసేందుకే వీటిని ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల(ఏఐఎఫ్‌లు)లో ఉపవిభాగం కింద అనుమతించనున్నారు. దివాలా చట్టంలో భాగంగా ఆర్బీఐ నిబంధనలు అనుమతించిన మొండి రుణాల కొనుగోలుకే ఎస్ఎస్ఎఫ్కు అవకాశముంటుంది. ఈ బాటలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు, ఒత్తిడిలోపడ్డ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీలలోనూ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రిఫరెన్స్ షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే కంపెనీలకు ధరల నిర్ణయం, లాకిన్ వంటి అంశాలలోనూ సెబీ నిబంధలను సరళీకరించింది. వీటితోపాటు లాకిన్ పీరియడ్‌లో ఉన్నప్పటికీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో పొందిన షేర్లను ప్రమోటర్లు తనఖాలో ఉంచేందుకు నిబంధనలను సరళీకరించింది. ఇక లిక్విడిటీగల కంపెనీ ప్రిఫరెన్షియల్ ఇష్యూకి ఫ్లోర్ ధరను 90–10 రోజుల సగటు ధర కంటే అధికంగా నిర్ణయించవలసి ఉంటుంది. ఇల్లిక్విడ్ సెక్యూరిటీ విషయంలో రిజిస్టర్డ్ స్వతంత్ర విలు వ మదింపు సంస్థ ఫ్లోర్ ధరను నిర్ణయించవచ్చు. ప్రస్తుతం 2 లేదా గత 26 వారాల్లో అత్యధిక ధరను ఫ్లోర్ ధరగా నిర్ణయిస్తుండటం తెలిసిందే. ఎంఎఫ్ ఇన్వెస్టర్లు.. మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూ సెబీ నిబంధనలను సవరించింది. వీటి ప్రకారం ఎంఎఫ్లకు చెందిన మెజారిటీ ట్రస్టీలు ఏవైనా పథకాలను నిలిపివేయదలిస్తే యూనిట్ హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతిని తీసు కోవలసి ఉంటుంది. అంతేకాకుండా 2023–24 ఆర్థిక సంవత్సరం నుంచి ఎంఎఫ్‌లు తప్పనిసరిగా దేశీ ప్రమాణాల ప్రకారం ఖాతాలను నిర్వహించవలసి వస్తుంది. ఇక సెటిల్మెంట్ దరఖాస్తులను కంపెనీలు షోకాజ్ నోటీసు జారీ అయిన 60 రోజుల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. అంతర్గత కమిటీ సమావేశం తదుపరి సవరించిన సెటిల్మెంట్ షరతులను 15 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. తద్వారా సెటిల్మెంట్ ప్రక్రియల నిబంధనలను క్రమబద్ధీకరించింది. -
మార్కెట్‌కు ఆర్బీఐ బూస్ట్
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ఆదుకోవడానికి రూ.50,000 కోట్లనిధులు అందుబాటులోకి తెస్తామన్న ఆర్బీఐ ప్రకటన సోమవారం స్టాక్ మార్కెట్‌ను లాభాల బాటలో నడిపించింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం... సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ సెన్సెక్స్ 31,500 పాయింట్ల పైకి, నిఫ్టీ 9,200 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 31,743 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 9,282 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆర్బీఐ అభయం...: మ్యూచువల్ ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధులను అందుబాటులోకి తేవడంతో కరోనా వైరస్ కల్లోలంతో అల్లకల్లోలమవుతున్న ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించడానికి మరిన్ని చర్యలను తీసుకోగలమని ఆర్బీఐ అభయం ఇచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 32,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఒక దశలో సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్ల మేర లాభపడ్డాయి. ట్రేడింగ్ చివర్లో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి జపాన్ కేంద్ర బ్యాంక్ మరోసారి ప్యాకేజీని ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు 0.2–2% రేంజ్లో పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1–2% రేంజ్ లాభాల్లో ముగిశాయి. మ్యూచువల్ ఫండ్ షేర్ల జోరు... మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు రూ.50,000 కోట్ల నిధులను ఆర్బీఐ అందుబాటులోకి తేనుండటంతో మ్యూచువల్ ఫండ్, ఆర్థిక రంగ షేర్లు జోరుగా పెరిగాయి. నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ 13 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ 8 శాతం, శ్రీరామ్ ఏఎమ్‌సీ 5 శాతం చొప్పున ఎగిశాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మణప్పురం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా మనీ క్యాపిటల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు 6–11 శాతం రేంజ్లో పెరిగాయి. ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 5 షేర్లు మాత్రమే నష్టపోగా మిగిలిన 25 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 6శాతం లాభంతో రూ.407 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ షేర్ బాగా పెరిగింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ► యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ ఆ్యంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 5 శాతం మేర లాభపడ్డాయి. ► ఒక్కో షేర్‌కు రూ.320 (3200 శాతం) స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించడంతో ఫైజర్ షేర్ 11 శాతం లాభంతో రూ.4,891 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ, ఇంట్రాడేలో వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. సైయంట్, చాలెట్ హోటల్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సన్ ఫార్మా, లుపిన్, లారస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి. -
లిక్విడిటీ బూస్ట్: చిదంబరం ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయంపై సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందించారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు ద్రవ్య లభ్యత కోసం సోమవారం రిజర్వు బ్యాంకు రూ.50,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించటాన్ని ఆయన స్వాగతించారు. ఆర్బీఐ సత్వర చర్య మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో నెలకొన్న ఆందోళనలకు ఊరటనిస్తుందని ఆయన ప్రశంసించారు. ప్రముఖ పెట్టుబడి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భారత్‌లోని ఆరు పథకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో తన పెట్టుబడిని కొద్దిరోజుల క్రితం స్తంభింపజేసింది. అయితే పెట్టుడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సొమ్మును తిరిగి చెల్లిస్తామని స్పష్టత నిచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయంతో దేశీయ పెట్టుబడిదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్బీఐ లిక్విడిటీ సదుపాయాన్ని ప్రకటించింది. (మ్యూచువల్ ఫండ్లకు ఆర్బీఐ భారీ ప్యాకేజీ) చదవండి: జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
ఫండ్ పథకాలన్నీ.. ఐదు కేటగిరీల్లోనే
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒకే థీమ్ కింద అనేక స్కీములను ప్రవేశపెడుతుండటానికి చెక్ పెడుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. ఇకపై మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో కేవలం అయిదే రకాలు ఉండాలని నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై స్కీములన్నింటినీ కూడా ఈక్విటీ, డెట్, హైబ్రీడ్, సొల్యూషన్ ఓరియంటెడ్, అదర్ స్కీమ్ అనే అయిదు కేటగిరీల్లోనే వర్గీకరించాల్సి ఉంటుంది. ఒక కేటగిరీ నుంచి ఒకటే స్కీముకు అనుమతి ఉంటుంది.అయితే, ఇండెక్స్ ఫండ్స్, వివిధ సూచీల ఆధారంగా పనిచేసే ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), రకరకాల స్కీమ్‌ల ఆధారంగా ఉండే ఫండ్ ఆఫ్ ఫండ్స్, వివిధ థీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్స్‌కి దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం తాము అమలు చేస్తున్న స్కీములను కొత్త కేటగిరీలకు అనుగుణంగా విశ్లేషించుకుని, తదనుగుణంగా రెండు నెలల్లోగా సెబీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులేమైనా ఉంటే గరిష్టంగా మూడు నెలల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వాటితో పాటు ఇంకా రాబోయే ఓపెన్ ఎండెడ్ స్కీములన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఫండ్ ప్రవేశపెట్టే వివిధ స్కీములన్నింట్లోనూ అసెట్ కేటాయింపులు, ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల్లో భిన్నత్వం స్పష్టంగా ఉండాలని సెబీ సూచించింది. ఒకే రకమైన థీమ్‌తో వివిధ సంస్థలు అందించే స్కీముల స్వభావం కూడా ఏకరూపంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనివల్ల వాటిని పోల్చి చూసుకుని, ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చనే దానిపై ఇన్వెస్టరు సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని తెలిపింది. మరోవైపు, లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ నిర్వచనాన్ని కూడా సెబీ ప్రత్యేకంగా పేర్కొంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 100 కంపెనీలు లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కింద, 101–250 దాకా సంస్థలు మిడ్ క్యాప్ కోవకి, 251వ సంస్థ నుంచి మిగతావి స్మాల్‌క్యాప్ కోవకి చెందుతాయని తెలిపింది. సెబీ నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఎండీ ఆశీష్ సోమయ్య తెలిపారు. అసంఖ్యాకంగా ఒకే రకమైన స్కీములు గుప్పించడం కాకుండా పథకాలు కొన్నే అయినా మెరుగైనవి అందించడానికి వీలవుతుందన్నారు. -
ఫండ్స్ అమ్మకాలకు ఊతమిచ్చేలా కొత్త నిబంధనలు
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటి పథకాల అమ్మకాలకు మరింతగా ఊతమిచ్చే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. ఈ-కామర్స్ సైట్లలో కూడా ఫండ్స్ అమ్మకాలకు వెసులుబాటు కల్పించడంతో పాటు పలు చర్యలు తీసుకోనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సెబీ చైర్మన్ యూకే సిన్హా ఈ విషయాలు చెప్పారు. ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసేందుకు కస్టమర్ల వివరాలు ఆన్లైన్లోనే సమర్పించడం, ధృవీకరించడం మొదలైన ప్రక్రియలు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలను సూచిం చేందుకు నందన్ నీలేకని సారథ్యంలో ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ సంస్థలు దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే అసెట్స్‌ను నిర్వహిస్తున్నాయి. -
కొత్త సిప్ మొదలుపెట్టండి..
ఇటీవల నాకొక ఇంక్రిమెంట్ వచ్చింది. దీంతో నా ఆదాయం పెరిగింది. ఆదాయం పెరగడంతో నా సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) మొత్తాన్ని కొంచెం పెంచితే బావుంటుందని నా శ్రీమతి సలహా ఇచ్చింది. అయితే ప్రస్తుత సిప్‌లో మార్పులు, చేర్పులు కుదరవని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటున్నాయి. సిప్ మొత్తాన్ని ఎలా పెంచుకోవాలి? - అర్జున్, విజయవాడ ఆదాయం పెరిగినందున సిప్ మొత్తాన్ని పెంచుకోమని మీ శ్రీమతి సరైన సలహానే ఇచ్చారు. అయితే చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిప్ మొత్తంలో మార్పులు, చేర్పులు చేయడాన్ని ప్రోత్సహించవు. దీనిని అధిగమించడానికి రెండు మార్గాలున్నాయి. ఎంత మొత్తం పెంచుకోవాలనుకుంటున్నారో అంత మొత్తానికి కొత్త సిప్‌ను మొదలుపెట్టండి. లేదా ప్రస్తుతమున్న సిప్‌ను క్యాన్సిల్ చేసుకొని, పెరిగిన మొత్తంతో కొత్త సిప్‌ను ప్రారంభించండి. ఏ మార్గాన్ని అనుసరించినా ప్రస్తుతమున్న మ్యూచువల్ ఫండ్‌లోనే సిప్‌ను కొనసాగిస్తే మంచిది. నా వయస్సు 32 సంవత్సరాలు. ఇటీవలే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. పన్నుల పరంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్), రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌కు మధ్య ఉన్న తేడాలేంటి? నేను ప్రస్తుతం నెలకు రూ.5,000 చొప్పున సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే వీటిల్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏమీ లేవు. సెక్షన్ 80 సీ కింద రూ. లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందుతున్నాను. సెక్షన్ 80సీ కింద రూ. లక్షన్నర వరకూ ఉన్న పన్ను మినహాయింపులను పొందడానికి ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - రాజశేఖర్, హైదరాబాద్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్‌ను ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ. లక్షన్నర పన్ను మినహాయింపు ఆదాయం పొందే మార్గాల్లో ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒకటి. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీ పన్ను ప్రయోజనాలు పొందలేరు. మీరు ఇప్పుడు సెక్షన్ 80 సీ కింద రూ. లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఈ సెక్షన్ కింద రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు ఈ పన్ను మినహాయింపును పూర్తి స్థాయిలో పొందడం లేదు కాబట్టి ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపుకు అర్హమైన ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో అత్యంత అధిక రాబడులనిచ్చేవిగా ఈఎల్ఎస్ఎస్లను పేర్కొనవచ్చు. నా వయస్సు 40 సంవత్సరాలు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నెలకు రూ.5,000 చొప్పున ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యాక్సిమైజర్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సూచించారు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? - మహ్మద్ జానీ. నిజామాబాద్. మీ మిత్రుడు సూచించింది బీమా ప్రొడక్ట్. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడూ బీమా సాధానాల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడూ కలగలపకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్ ఉన్న ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌లు ఇటు బీమా అవసరాలను, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలను అందుకోలేవు. బీమా అవసరాల కోసం ఎప్పుడూ టర్మ్ ప్లాన్లనే ఎంచుకోవాలి. ఇవి అత్యంత చౌకైనవి. బీమాకు అత్యంత మెరుగైనవి కూడా. ఇక ఇన్వెస్ట్మెంట్స్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీకు స్టాక్‌మార్కెట్‌తో బొత్తిగా పరిచయం లేకపోతే మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.సాధారణ ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి ఎంపిక. ఇవి ఈక్విటీ, డెట్ సాధనాల్లో మిశ్రమంగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఫలితంగా మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్నప్పుడు మీకు రక్షణ లభిస్తుంది. నేను చెల్లించాల్సిన గృహ రుణ మొత్తం రూ. 13,50,000గా ఉంది. మరో 16 ఏళ్లపాటు నెలవారీ సమాన వాయిదా (ఈఎంఐ)లు చెల్లించాల్సి ఉంది. ఇటీవల నాకు రూ.3,00,000 వరకూ సొమ్ములొచ్చాయి. ఈ డబ్బులతో గృహ రుణంలో కొంత మొత్తం చెల్లించమంటారా ? లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదైతే ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి? - వైదేహి, తిరుపతి నెలవారీ సమాన వాయిదాలు(ఈఎంఐలు) చెల్లించడంలో ఆర్థికపరంగా మీరు ఇబ్బందిపడుతున్నట్లయితే ఆ డబ్బులను గృహరుణం తీర్చడానికి ఉపయోగించండి. ఈఎంఐలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. గృహ రుణం మంచి రుణమని చెప్పవచ్చు. గృహ రుణం కారణంగా మనకు ఉండటానికి ఒక ఇల్లు ఉంటుంది. పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. అద్దె డబ్బులు మిగులుతాయి. తక్కువ వడ్డీరేట్ల ప్రయోజనాలూ ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అయితే, ఏదైనా మంచి బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని, దాంట్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మా అమ్మగారు ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయ్యారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ.35 లక్షల వరకూ వచ్చాయి. వీటిని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఇన్వెస్ట్ చేస్తానని ఆమె అంటోంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పాను. పెట్టుబడి సురక్షితంగా ఉంటూ, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులిచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. రెండు నుంచి మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలని మా అమ్మగారు భావిస్తున్నారు. - వెంకట్, గుంటూరు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను పొం దలేం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు కావాలనుకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే రెండు, మూడేళ్ల కాలానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధా నం కాదు. ఒక వేళ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసినప్పటికీ, పన్ను ప్రయోజనాలు పొందలేరు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం మంచి రాబడులను ఇస్తాయి. అయితే మార్కెట్ పనితీరును బట్టే వీటి రాబడులు ఉంటా యి. మీ అమ్మగారు అధిక పన్ను బ్రాకెట్లో ఉండి ఉంటే, మూడేళ్ల పాటు ఈ డబ్బులను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, డెట్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మూడేళ్లలోపే డబ్బులు కావాలనుకుంటే షార్ట్-టర్మ్ డెట్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈ ఏడాది వందకు మించిన ఎన్ఎఫ్ఓ దరఖాస్తులు
న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి ఎన్ఎఫ్ఓలు(న్యూ ఫండ్ ఆఫర్లు) వెల్లువెత్తనున్నాయి. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో పలు సంస్థలు ఎన్ఎఫ్ఓలకు అనుమతులు కావాలంటూ సెబీకి దరఖాస్తులు సమర్పించాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఎన్ఎఫ్ఓల కోసం చేసిన దరఖాస్తుల సంఖ్య వందకు మించిపోయింది. వీటిల్లో కొన్నింటికి అనుమతులు లభించి, స్కీమ్‌లు ప్రారంభమయ్యాయి కూడా. యూటీఐ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్, ఎస్బీఐ ఎంఎఫ్ తదితర సంస్థలు ఎన్ఎఫ్ఓల కోసం దరఖాస్తులు సమర్పించాయి. కాగా ఈ ఎన్ఎఫ్ఓల్లో అధిక భాగం ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేవే. డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవి కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు జోరుగా ఉండటంతో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందని, మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. ఇటీవల వచ్చిన ఎన్ఎఫ్ఓలకు మంచి స్పందన వచ్చిందని చెబుతున్నారు. -
న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ) జోరు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ పరిస్థితులు బాగుండడంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓఎ)ను జోరుగా అందించనున్నాయి. కంపెనీలు దాదాపు 34 ఎన్ఎఫ్ఓలను ఆఫర్ చేస్తాయని సమాచారం. ఎస్బీఐ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, తదితర కంపెనీలు ఈ ఎన్ఎఫ్ఓలను ఆఫర్ చేయనున్నాయి. -
డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వీటిపై వచ్చిన రాబడులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన రాబడుల కన్నా స్వల్పమే ఎక్కువ. ఎక్స్పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాబడులు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాతనే మనకు రాబడులను ఇస్తారా? ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 5-10 ఏళ్లపాటు కొనసాగించవచ్చా? తగిన సమాధానాలు ఇవ్వగలరు. - సునయన, విజయవాడ ఫండ్ వ్యయాలను మినహాయించుకున్న తర్వాతనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు నెట్ అసెట్ వేల్యూ(ఎన్ఏవీ)ను ప్రకటిస్తాయి. మీకు వచ్చే రాబడులు ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాత వచ్చినవే. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌కు రెండు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో స్థిరమైన రాబడి వస్తుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వడ్డీరేట్ల హెచ్చుతగ్గులను బట్టి రాబడులు ఉంటాయి. వడ్డీరేట్ల హెచ్చుతగ్గులు బాగా ఉంటే వీటి నుంచి మంచి రాబడులు వస్తాయి. ఇటీవల కాలంలో ఒక డెట్ ఫండ్ ఏడాదికి 17 శాతం రాబడిని ఇచ్చింది. డెట్ ఫండ్స్ నుంచి కనిష్టంగా 8.5 శాతం రాబడి పొందవచ్చు. ఇతర స్థిరాదాయ మార్గాలతో పోల్చితే డెట్ ఫండ్స్ మంచి రాబడులనిచ్చే అవకాశాలే ఎక్కువ. ఇక ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్ యూనిట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోలేం. నిర్ణీత గడువు కన్నా ముందుగానే తీసుకుంటే, కొంత రుసుము చెల్లించాల్సి రావచ్చు. పన్ను పరంగా చూసుకున్నా డెట్ ఫండ్స్ ఉత్తమమైనవి. స్వల్పకాలంలో అధిక రాబడులు, లిక్విడిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా డెట్ ఫండ్సే ఉత్తమం. డెట్ ఫండ్స్‌లో స్వల్పకాలానికే ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం సరైన పని కాదు. ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 65% ఈక్విటీల్లోనూ, మిగిలిన దానిని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి నుంచి అధిక శాతం రాబడులు వస్తాయి. పైగా వీటిల్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే ఎలాంటి పన్ను పోటు ఉండదు. నేను ఇప్పటివరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కొత్త ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. వచ్చే జనవరి నుంచి ఏదైనా ఒక ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. విస్తృత అధ్యయనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్స్ ఎన్ఏవీ (నెట్ అసెట్ వేల్యూ) అధికంగా ఉంది. దేనిని ఎంచుకోవాలో తగిన సూచనలివ్వండి. - రుద్ర భూపతి, విజయనగరం మ్యూచువల్ ఫండ్స్‌లో అందునా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు మీకు అభినందనలు. మీరు షార్ట్‌లిస్ట్ చేసిన ఫండ్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ ఉత్తమమైనది. మిగిలిన రెండూ మంచి ఫండ్సే కానీ, మూడేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి, మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో అడుగిడుతున్న మీకు హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ అనువైనది. ఇక ఎన్ఏవీ అధికంగా ఉందని రాశారు. ఇది అసలు సమస్యే కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గతంలోని పనితీరు ఇప్పటి పనితీరు పోల్చడానికి ఎన్ఏవీ పనికి వస్తుంది. ఎన్ఏవీ తక్కువగా ఉంటే ఎక్కువ యూనిట్లు, ఎన్ఏవీ ఎక్కువగా ఉంటే యూనిట్లు తక్కువగా వస్తాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ విలువ ఒక్కలాగే ఉంటుంది. ఎన్ఏవీని బట్టి కాకుండా ఫండ్ పనితీరును బట్టి ఇన్వెస్ట్ చేయాలి. నేరుగా ఈక్విటీల్లో (షేర్లు) ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? - కమలాకర్, నిజామాబాద్ మ్యూచువల్ ఫండ్స్ వార్షిక వ్యయాలను మినహాయించుకొని రాబడులను అందిస్తాయి. ఈ వార్షిక వ్యయాలు 1-2% రేంజ్లో ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. నిపుణులైన ఫండ్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్లను నిర్వహించడమే దీనికి కారణం. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి విస్తృతమైన పరిజాఞనం అవసరం. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ ఏ రంగంలో ఉంది? ఎలాంటి ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది? వాటికి మార్కెట్లో స్పందన ఎలా ఉంది? ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్.. ఇలాంటి పలు అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వీటన్నింటినీ చూడ్డానికి నిపుణులైన వ్యక్తులు ఉంటారు. మీకు తగిన సమయం, ఓపిక ఉంటే కంపెనీకి సంబంధించి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. -
మార్కెట్‌ను మించిన ట్యాక్స్ ఫండ్స్
గతేడాది కాలంగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఇదే సమయంలో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ప్రధాన సూచీలను మించి లాభాలను అందిస్తున్నాయి. గతేడాది కాలంలో నిఫ్టీ 39% లాభాలను అందిస్తే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ 69% నుంచి గరిష్టంగా 110% వరకు లాభాలను అందించాయి. ఈ గణాంకాలకు తోడు గత బడ్జెట్లో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పొందే పన్ను లాభాల పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.1.5 లక్షలకు పెంచడంతో ఈ పథకాల్లో మదుపు చేయడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఇతర ట్యాక్స్ సేవింగ్ పథకాలతో పోలిస్తే పలు ప్రయోజనాలు ఉండటం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. బహుళ ప్రయోజనాలు కలిగిన ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఉండే లాభనష్టాలను ఇప్పుడొకసారి పరిశీలిద్దాం.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను అందిస్తుండటంతో వీటిని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) లేదా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని పిలుస్తారు. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రధానంగా లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి చేయడం ద్వారా వీటిపై వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు వైదొలిగే అవకాశం లేకపోవడంతో దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే అవకాశం ఉన్న షేర్లను ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఫండ్ మేనేజర్లకు లభిస్తుంది. ఈ కారణంగానే ఇండెక్స్‌లు కంటే ఎక్కువ లాభాలను ఈ స్కీమ్స్ అందించగలిగాయి. ఫండ్ మేనేజర్లు లార్జ్‌క్యాప్స్‌తో పాటు మిడ్‌క్యాప్ షేర్లలో కూడా ఇన్వెస్ట్ చేయడం ఈ లాభాలకు ప్రధాన కారణం. అయితే ఈ ఏడాది ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి వచ్చే ఏడాది కూడా ఇదే విధమైన లాభాలు వస్తాయన్న హామీ ఏమీ ఉండదు. వీటి రాబడులు పూర్తిగా స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి కచ్చితమైన రాబడిని ఆశించలేం. లాభనష్టాలు రెండింటికీ ఆస్కారం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకులను తట్టుకొని నిల బడితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి లాభాలను పొందవచ్చని దీర్ఘకాలంగా వీటి పనితీరు వెల్లడిస్తున్నది. అంతే ఒకేసారి వద్దు ఇప్పుడు దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ట్యాక్స్ సేవింగ్ స్కీంలను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా ఫండ్ హౌస్‌లకు దరఖాస్తుచేయడం లేదా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ల ద్వారా కాని ఇన్వెస్ట్ చేయవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేస్తే ఏజెంట్ కమీషన్లు ఉండవు కాబట్టి మరికొంత అదనపు రాబడిని పొందవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు డెరైక్ట్ ప్లాన్ పేరుతో ప్రత్యేకంగా ఎన్ఏవీని అందిస్తున్నాయి. వీటిల్లో ఒకేసారిగా కాని లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నందున ఈక్విటీ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పన్ను ప్రయోజనాలను పొందే విధంగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఆరు సమాన భాగాలుగా విభజించి ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నారు. కాని ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని కొత్త పెట్టుబడి కింద భావించి అక్కడ నుంచి వైదొలగడానికి మూడు సంవత్సరాలు వేచి చూడాలి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం లాభనష్టాలు మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యల్ప కాలపరిమితి ఉన్న అన్ని రకాల ట్యాక్స్ సేవింగ్స్ పత్రాల (ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్, బీమా, పీపీఎఫ్ తదితరాలు)తో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ముందు వరుసలో నిలబడతాయి. స్థిరాదాయాన్ని ఇచ్చే బ్యాంకు డిపాజిట్లలో కనీసం ఐదేళ్లు వేచి ఉండాల్సి ఉంటే, బీమా, పీపీఎఫ్ వంటి వాటిల్లో కనీసం 10 నుంచి 15 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. వీటిలో కాకుండా ఈక్విటీ లింక్డ్ టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకాల్లో ఉన్న ప్రధానమైన లోపం ఏమిటంటే రాబడిపై హామీ లేకపోగా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు భయపడి వైదొలగకుండా వేచి చూస్తే నష్టాలను భర్తీ చేసుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.