మాజీ ఆర్థికమంత్రి చిదంబరం (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం సుప్రీంకోర్టులో లాయర్‌గా దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఐఎన్‌ఎక్స్‌మీడియా కేసులో బెయిల్ లభించిన అనంతరం తన న్యాయవాద వృత్తిలో తిరిగి కొనసాగనున్నారు. బుదవారం ముంబైకి చెందిన గృహహింస కేసులో న్యాయవాదిగా ఆయన సుప్రీంకోర్టులో కనిపించారు. సీనియర్ న్యాయవాదులు, పార్టీ సహచరులు, తోటి రాజ్యసభ ఎంపీలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తో కలిసి ఆయన చీఫ్ జస్టిస్ కోర్టుకు హాజరయ్యారు
కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో 106 రోజులకు గడిపిన ఆయనకు గత వారం (డిసెంబర్ 4) బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజకీయ-ఆర్థికవేత్త చిదంబరం. చెన్నైలయోలా కాలేజీ, మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నైలా కాలేజీల్లో చదువుకున్న చిదంబరంవృత్తిపరంగా న్యాయవాది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీయే కూడా పూర్తి చేశారు. సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లోనూ ఆయన న్యాయవాదిగా పనిచేశారు. చిదంబరం భార్య నళిని కూడా న్యాయవాదే. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన చిదంబరం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment