
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీనీ మరో నాలుగు రోజులు పొడగిస్తూ చిదంబరానికి మళ్లీ షాకిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న ప్రత్యేక కోర్టు కస్టడీని పొగడిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.
(చదవండి : చిదంబరానికి సుప్రీం షాక్)
మరోవైపు సర్వోన్నత న్యాయస్ధానంలో కూడా చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ..ఢిల్లీ హైకోర్టు ఉత‍్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు.
(చదవండి : చిదంబరం అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment