'చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువదు' | Congress will not open account in many states: Narendra Modi | Sakshi
Sakshi News home page

'చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువదు'

Published Wed, May 7 2014 1:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువదు' - Sakshi

'చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువదు'

వాల్మీకి నగర్ (బీహార్): సాధారణ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువదు అని బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ జోస్యం చెప్పారు. గాంధీ కుటంబానికి కంచుకోట అమేథిలోనే పరాజయం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
 
జాతిని రక్షించడానికి పోరాటం చేస్తుంటే.. వాళ్లు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ అన్నారు. ఈ ఎన్నికల్లో కొన్నిరాష్ట్రాల్లో ఒక సీటు కూడా కాంగ్రెస్ గెలువదని ఆయన అన్నారు. 
 
సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఆహార పదార్ధాలను పేద ప్రజలకు పంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అదే ఆహార పదార్ధాలను కిలోకు 80 రూపాయల చొప్పున  మద్యం తయారికి అమ్ముకోవడం రాజనీతీ అంటారా అని మోడీ ప్రశ్నించారు. నీచ స్థాయి రాజనీతికి పాల్పడుతున్నారని ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యల్ని మోడీ తప్పుపట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement