కాంగ్రెస్ ఓ ఫన్నీ పార్టీ: శరద్ పవార్
ముంబై: కాంగ్రెస్ ఓ ఫన్నీ పార్టీ అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. పరిస్థితులను బట్టి కాంగ్రెస్ మార్పులు, చేర్పులు చేసుకుంటుందని ఆయన అన్నారు. ఒకవేళ ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే రాహుల్ నాయకత్వంలో పనిచేయడానికి మంచి నేతలు ఉన్నారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. లోకసభ ఎన్నికల్లో ప్రచారం, వ్యూహాల పన్నడంలో విఫలమైన రాహుల్ స్థానంలో ప్రియాంకను పార్టీలోకి తీసుకువచ్చే ప్రసక్తి లేదని పవార్ అన్నారు.
రాహుల్, ప్రియాంక లు పార్టీ ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని.. అనేక సభల్లో పాల్గొంటున్నారని పవార్ తెలిపారు. రాహుల్ ప్రభుత్వంలో చేరి మంత్రిగా సేవలందిస్తే అతని సామర్ధ్యం ప్రజలకు తెలిసి వచ్చేదని పవార్ అన్నారు. ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ ప్రధాని అవుతారని తాను అనుకోవడం లేదని ఓ ప్రశ్నకు పవార్ సమాధానమిచ్చారు.