కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ.. రెండు నియోజర్గాలో పార్టీ విజయ ఢంకా మోగించింది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడున్నర లక్షల మేజార్టీతో గెలుపొందారు.
ఇటు అమేథీలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఈసారి బొల్తా కొట్టారు. దాదాపు 1.50 లక్షల ఓట్ల తేడాతో కిషోర్ లాల్ శర్మ చేతిలో చిత్తుగా ఓడారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీని తిరిగి చేజిక్కించుకుంది.
కిషోరీ లాల్ గెలుపుతో తరఫున విస్తృత ప్రచారం సాగించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. పార్టీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ గెలుపు విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, అమేథీ నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు’ అని రాసుకొచ్చారు.
किशोरी भैया, मुझे कभी कोई शक नहीं था, मुझे शुरू से यक़ीन था कि आप जीतोगे। आपको और अमेठी के मेरे प्यारे भाइयों और बहनों को हार्दिक बधाई ! pic.twitter.com/JzH5Gr3z30
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 4, 2024
Comments
Please login to add a commentAdd a comment