ఓ వ్యక్తి చేతిలో 'అధికారం'... కరెక్టెనా?
రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ప్రజల చేతుల్లో ఉండాల్సిన 'అధికారం' ఓ వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైపోతుందంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనయ ప్రియాంక గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని పరోక్షంగా విమర్శించారు. ప్రజల చేతిలో ఉండాల్సిన అధికారమంతా ఓ వ్యక్తి చేతిలో ఉండటం ఎంత వరకు సమంజసం ... అందుకు మీరు సమ్మతమేనా అంటూ ప్రజలను ప్రశ్నించారు. బుధవారం సోనియా సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులోభాగంగా ప్రియాంక ప్రసంగించారు.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశ ఐక్యత, సమగ్రత కోసం జరగుతున్నాయని...ఈ నేపథ్యంలో ప్రజలను విభజించి పాలించే బీజేపీకా లేకుంటే ప్రజలను ఐక్యమత్యంగా ఉంచే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలంటూ ఆమె రాయ్బరేలీ ప్రజలకు సూచించారు. దేశమంతా గుజరాత్ నమూనా అభివృద్ధి చేపడగామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యమని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 2014 ఎన్నికల ప్రచారంలో ఉదరగోడుతున్నారని... కానీ అవినీతి అంత కోసం యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిందని ప్రియాంక గుర్తు చేశారు.