మా ఆయన్నుటార్గెట్ చేయడం బాధిస్తోంది | Feel pained at attack on husband, will fight back: Priyanka gandhi | Sakshi
Sakshi News home page

మా ఆయన్నుటార్గెట్ చేయడం బాధిస్తోంది

Published Tue, Apr 22 2014 3:07 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

మా ఆయన్నుటార్గెట్ చేయడం బాధిస్తోంది - Sakshi

మా ఆయన్నుటార్గెట్ చేయడం బాధిస్తోంది

రాయ్ బరేలి: తన భర్త రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేసుకుని విపక్షాలు దాడి చేయడం బాధిస్తోందని కాంగ్రెస్ నేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తెలిపారు.కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొలేని వారు వాద్రాను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడం తనను వేదనకు  గురిచేస్తోందన్నారు.  ఈ రోజు రాయ్ బరేలిలో తల్లి సోనియా గాంధీ తరుపున ప్రచారం చేపట్టిన ఆమె.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. వారికి అభివృద్ధిపై మాట్లాడటం తెలీదు.ఎన్నికల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ఆ నేతలు తన భర్తను తెరపైకి తీసుకురావడం రాజకీయ కుట్రలో భాగమేనని ప్రియాంక తెలిపారు.

 

' మీరు టీవీ చూస్తు ఉంటారు. మీకు ఏమి కనిపిస్తోంది. మా కుటుంబాన్ని అనైతిక పదజాలంతో నిందిచడమే వారికి కనిపిస్తోంది.నా భర్తపై లేనిపోని ఆరోపణలు చేయడమే ఆ పార్టీలకు పనిగా మారింది' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  యువతకు ఉద్యోగాలు,  ప్రజా అవసరాలు తదితర అంశాలపై మాట్లాడాల్సిన నేతలు తమ కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలతో దాడులకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆ పార్టీలు ప్రస్తుతం చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ప్రియాంక మండిపడ్డారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement