60 ఏళ్లుగా ఆ కుటుంబమే బలపడింది
సోనియా కుటుంబంపై మోడీ పరోక్ష విమర్శలు
కలోల్ (గుజరాత్): తన కుటుంబం, భర్తపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తోందని, అయితే తమపై వచ్చే ఇలాంటి ఆరోపణలు తనకు మరింత బలాన్ని ఇస్తున్నాయని, రాటుదేలేలా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యా గాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఖండించారు.
ప్రియాంక పేరును నేరుగా ప్రస్తావించకుండా, ‘నిజమే గత 60 ఏళ్లుగా వారి కుటుంబం మాత్రమే బలపడింది’ అని అన్నారు. బుధవారం ఆయన గాంధీనగర్ జిల్లాలోని కలోల్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. దేశాన్ని ఎలా పటిష్టం చేయాలన్న విషయంపై అందరూ ఆలోచిస్తుంటే ఆ కుటుంబం మాత్రం తమ స్వంత బలాన్ని పెంచుకోవడం గురించి ఆలోచిస్తోందని మోడీ ఎద్దేవా చేశారు. అయితే తమకు ప్రజల సంక్షేమమే ముఖ్యమని, దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
మంగళవారం ప్రియాంక బీజేపీపై విమర్శలు చేసిన నేపథ్యంలో మోడీ ఈ వాఖ్యలు చేశారు. దేశాన్ని పీడిస్తున్న సమస్యలనుంచి ప్రజల దృష్టిని మరల్చడాని కాంగ్రెస్ ఎత్తులు వేస్తోందని ఆయన దుయ్యబట్టారు. తల్లీ, కొడుకులు దేశాన్ని లూటీ చేసి నల్లధనాన్ని విదేశాల్లో దాచుకున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ధ నాన్ని వెనక్కి తీసుకురావాల్సి ఉందని ఆయన అన్నా రు. కాగా, గాంధీనగర్ ఎంపీ సీటునుంచి పోటీ చేస్తు న్న అద్వానీ పితృసమానులని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అద్వానీ తనకు రాజకీయగురువని మోడీ అన్నారు.