
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఆమె తనయ ప్రియాంకగాంధీలో ఎవరూ పోటీచేసినా.. రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం ఇక్కడి నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్సీ అయిన ప్రతాప్ సింగ్ తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఆయన శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరనున్నారు. ఈ సందర్భంగా ప్రియాంకగాంధీపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు రాకేశ్ సింగ్ టికెట్ ఇవ్వకుండా ప్రియాంక గాంధీ అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. తన తమ్ముడు బీజేపీ నుంచి పోటీ చేస్తానంటే.. అన్నాదమ్ములు ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడం బాగుండదని సర్దిచెప్పి.. తన తమ్ముడి కోసం ప్రియాంకను టికెట్ అడిగానని, కానీ రాయ్‌బరేలి నియోజకవర్గంలో నలుగురు ఠాకూర్లకు టికెట్లు ఇవ్వడం కుదరదంటూ తన సోదరుడికి టికెట్ నిరాకరించారని ఆయన ఆరోపించారు. రాయ్‌బరేలిలో ఈ సారి కాంగ్రెస్ అగ్రనేతలకు పరాభవం తప్పదని చెప్పుకొచ్చారు. అయితే, ఆయన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment