సోనియా గాంధీపై పోటీకి సై: ఉమా భారతి | I WAS willing to contest from Rae Bareli: Uma Bharti | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీపై పోటీకి సై: ఉమా భారతి

Published Tue, Apr 1 2014 8:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

సోనియా గాంధీపై పోటీకి సై: ఉమా భారతి - Sakshi

సోనియా గాంధీపై పోటీకి సై: ఉమా భారతి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గం నుంచి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఉమా భారతి చెప్పారు. కాగా ఆ స్థానం నుంచి బీజేపీ తరపున ప్రముఖ న్యాయవాది అజయ్ అగర్వాల్ పేరును ప్రకటించిన మరుసటి రోజు ఉమ పై వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమా భారతి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తొలుత రాయబరేలి స్థానానికి ఆమె పేరునే పరిశీలించారు. అయితే  కొంతకాలంగా ఝాన్సీలో ప్రచారం నిర్వహిస్తున్నందున ఈ స్థానం నుంచి మరబోనని, కావాలంటే ఝాన్సీతో పాటు రాయబరేలి నుంచి కూడా పోటీచేస్తానని పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు చెప్పినట్టు ఉమా భారతి తెలిపారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement