టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే: సోనియా | Sonia Gandhi slams TDP, BJP | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే: సోనియా

Published Fri, May 2 2014 9:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Sonia Gandhi slams TDP, BJP

గుంటూరు: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. టీడీపీ, బీజేపీలు ఒకే నాణేనికి రెండు పార్శాలని విమర్శించారు. శుక్రవారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో సోనియా పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు అవకాశవాదమని అన్నారు. ఈ రెండు పార్టీలు పాత మిత్రులని,  మరోసారి పొత్తు పెట్టుకుని లౌకిక వాదాన్ని దెబ్బతీసేందుకు వస్తున్నాయని సోనియా ఆరోపించారు. టీడీపీకి ఓటేస్తే, బీజేపీకి వేసినట్టేనని ప్రజలను హెచ్చరించారు. ఈ సభలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కాగా సోనియా సభ జనం లేక వెలవెలబోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement