హర్‌చంద్రపూర్‌లో చెల్లాచెదురుగా పడిన రైలు ఇంజన్, బోగీలు
లక్నో/న్యూఢిల్లీ: న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించడంతో పాటు 9 మంది గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు రైలు బోగీలు, ఇంజన్ పట్టాలు తప్పాయి. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా రాయ్‌బరేలీ జిల్లాలోని హర్‌చంద్రపూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.10 గంటలకు న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్ (రైలు నం.14003) పట్టాలు తప్పిందని యూపీ అడిషనల్ డీజీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. మరణించిన ఐదుగురిలో సంవత్సరం వయసున్న పాప, ఏడేళ్ల చిన్నారి ఉన్నారని, వారంతా బిహార్‌కు చెందిన వారని రైల్వే అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పది మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి, మరో ఇద్దరిని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించామని యూపీ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఫరక్కా రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ..5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment