derails train
-
పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు 8 స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్ డివిజన్ రాజ్‌కియవాస్-బొమద్రా సెక్షన్ పరిధిలోని పాలీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3.27 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ముంబై నుంచి జోధ్‌పుర్‌కు వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది వాయవ్య రైల్వే. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొంది. ‘సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెళ్తున్నారు. వాయవ్య రైల్వే జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు జైపూర్‌లోని కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.’అని తెలిపారు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వెల్లడించారు.సంఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ క్రమంలోనే హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది వాయవ్య రైల్వే. జోధ్‌పుర్ 0291- 2654979(1072) 0291- 2654993(1072) 0291- 2624125 0291- 2431646 పాలి మర్వార్ 0293- 2250324 138 1072 "Within 5 minutes of departing from Marwar junction, a vibration sound was heard inside the train & after 2-3 minutes, the train stopped. We got down & saw that at least 8 sleeper class coaches were off the tracks. Within 15-20 minutes, ambulances arrived," says a passenger pic.twitter.com/aCDjmZEFyq — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 2, 2023 ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
పట్టాలు తప్పినా వేగంగా దూసుకొచ్చిన రైలు.. జనం పరుగులు!
పాట్నా: బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ రైలు బిహార్‌లో పట్టాలు తప్పింది. గుర్పా రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు 53 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ధన్‌బాద్ డివిజన్ పరిధిలోని కొడెర్మా-మన్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున 6.24 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ‘బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు బోగీలు పట్టాలు తప్పేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే బృందాలు కృషి చేస్తున్నాయి.’ అని ఈసీఆర్ జోన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో అధికారులు అప్రమత్తమవటంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు. 10 రైళ్లను దారి మళ్లించామని, నాలుగు రైళ్లు రద్దు చేశామని చెప్పారు. A goods train derails between Koderma and Manpur railway stations under #Dhanbad railway division. pic.twitter.com/Age2J3wcRa — TOI Patna (@TOIPatna) October 26, 2022 ఇదీ చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది! -
పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో హజరత్ నిజాముద్దిన్ – మడ్గావ్ రాజధాని సూపర్ ఫాస్ట్ స్పేషల్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ పట్టాలు తప్పింది. కోంకణ్ రైల్వేమార్గంపై ఉక్షీ – భోకేల మధ్య ఉన్న కురబుడే టన్నెల్ మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కోంకణ్ రైల్వే పీఆర్వో సచిన్ దేశాయి అందించిన వివరాల మేరకు.. కరబుడే టన్నెల్లో శనివారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఊహించని విధంగా రైలు ఇంజిన్ చక్రం టన్నెల్ మధ్యలో నుంచి వెళ్లే సమయంలో పట్టాలు తప్పింది. చీకటి గుహలో ఉన్నామని తెలుసుకున్న ప్రయాణికులు అరుపులు కేకలు పెట్టారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అనంతరం యుద్ద ప్రతిపాదికపై పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది రైల్వే మార్గాన్ని పునరుద్దరించారు. అయితే సుమారు 7 గంటలపాటు ఈ కోంకణ్ మార్గంపై రైళ్ల రాకపోకలు స్థంబించిపోయాయి. చదవండి: ‘పిల్లలకు కోవిడ్ టీకా’పై మరింత డేటా రావాల్సి ఉంది -
పట్టాలు తప్పిన న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్
లక్నో/న్యూఢిల్లీ: న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించడంతో పాటు 9 మంది గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు రైలు బోగీలు, ఇంజన్ పట్టాలు తప్పాయి. పశ్చిమబెంగాల్లోని మాల్దా నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా రాయ్‌బరేలీ జిల్లాలోని హర్చంద్రపూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.10 గంటలకు న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్ (రైలు నం.14003) పట్టాలు తప్పిందని యూపీ అడిషనల్ డీజీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. మరణించిన ఐదుగురిలో సంవత్సరం వయసున్న పాప, ఏడేళ్ల చిన్నారి ఉన్నారని, వారంతా బిహార్‌కు చెందిన వారని రైల్వే అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పది మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి, మరో ఇద్దరిని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించామని యూపీ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఫరక్కా రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ..5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
బాంబు పేలుడు... పట్టాలు తప్పిన రైలు బోగీలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధు ప్రావెన్స్లోని దిల్మురాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై అమర్చిన శక్తిమంతమైన బాంబు పేల్చడం వల్ల... అప్పుడే ఆ ట్రాక్‌పై వెళ్తున్న కుషాల్ ఖాన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో కరాచీ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ఇటీవల కాలంలో పాక్‌లో తీవ్రవాదులు రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తున్నారు. గత శనివారం బెలూచిస్థాన్ ప్రావెన్స్లో తీవ్రవాదులు రైల్వే ట్రాక్ వద్ద శక్తిమంతమైన బాంబును పేల్చారని అధికారులు గుర్తు చేశారు. గతేడాది జకోబాబాద్ జిల్లాలోన ఉన్నర్ వాహ్ రైల్వే స్టేషన్ సమీపంలోన తీవ్రవాదులు బాంబు దాడిలో ఏడుగురు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.