ఇస్లామాబాద్: పాకిస్థాన్లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధు ప్రావెన్స్లోని దిల్మురాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై అమర్చిన శక్తిమంతమైన బాంబు పేల్చడం వల్ల... అప్పుడే ఆ ట్రాక్పై వెళ్తున్న కుషాల్ ఖాన్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో కరాచీ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది.
ఇటీవల కాలంలో పాక్లో తీవ్రవాదులు రైల్వే ట్రాక్లను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తున్నారు. గత శనివారం బెలూచిస్థాన్ ప్రావెన్స్లో తీవ్రవాదులు రైల్వే ట్రాక్ వద్ద శక్తిమంతమైన బాంబును పేల్చారని అధికారులు గుర్తు చేశారు. గతేడాది జకోబాబాద్ జిల్లాలోన ఉన్నర్ వాహ్ రైల్వే స్టేషన్ సమీపంలోన తీవ్రవాదులు బాంబు దాడిలో ఏడుగురు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.