Farakka Express train
-
పట్టాలు తప్పిన న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్
లక్నో/న్యూఢిల్లీ: న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించడంతో పాటు 9 మంది గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు రైలు బోగీలు, ఇంజన్ పట్టాలు తప్పాయి. పశ్చిమబెంగాల్లోని మాల్దా నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా రాయ్‌బరేలీ జిల్లాలోని హర్చంద్రపూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం 6.10 గంటలకు న్యూఫరక్కా ఎక్స్‌ప్రెస్ (రైలు నం.14003) పట్టాలు తప్పిందని యూపీ అడిషనల్ డీజీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. మరణించిన ఐదుగురిలో సంవత్సరం వయసున్న పాప, ఏడేళ్ల చిన్నారి ఉన్నారని, వారంతా బిహార్‌కు చెందిన వారని రైల్వే అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పది మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి, మరో ఇద్దరిని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించామని యూపీ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఫరక్కా రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ..5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్
-
పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు చనిపోగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ అలహాబాద్‌కు వెడుతుండగా రాయబరేలి, హరచాంద్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నో నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్విన్ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర సమాచారం నిమిత్తం హెల్ప్‌లైన్ నంబర్లు అధికారులు ప్రకటించారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్-బిఎస్ఎన్ఎల్-05412-254145, రైల్వే -027-73677 పాట్నా స్టేషన్ నం: బిఎస్ఎన్ఎల్-0612-2202290, 0612-2202291, 0612-220229, రైల్వే ఫోన్ నంబర్- 025-8328 ఎక్స్‌గ్రేషియా : ఈ ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రైన్ నుంచి పోలీస్ గెంటివేత
పాట్నా: ఓ రైల్వే పోలీస్ నుంచి కొంతమంది దుండగులు రైళు నుంచి తోసేసిన ఘటన శుక్రవారం ఉదయం దశ్రత్ పూర్ దగ్గరలో చోటు చేసుకుంది. ఫరాక్కా ఎక్స్ ప్రెస్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్పెషల్ ఆక్సలరీ పోలీసుల తో కొందరు దుండగులు వాగ్వాదానికి దిగారు.ఈ క్రమంలోనే ఆ దుండగులు కదులుతున్న ట్రైన్ లో డోర్ వద్ద ఉన్న కానిస్టేబుల్స్ ను గెంటి వేశారు. దీంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో పోలీస్ కానిస్టేబుల్ ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీస్ అధికారి ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ ట్రైన్ లో ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారు భారీగా లూటీకి పాల్పడి పరారయ్యే క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.