అమేథీలో పోటీచేసే ధైర్యం లేక రాయ్‌బరేలీకని ఎద్దేవా!
రాహుల్ ఇకనైనా భయపడడం, పారిపోవడం ఆపాలి
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా కష్టమే
ఆ పారీ్టకి చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లు
తేలి్చచెప్పిన ప్రధాని మోదీ
పశి్చమ బెంగాల్, జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం
బర్ధమాన్/కృష్ణనగర్/చైబాసా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా ్రస్తాలు విసిరారు. డరో మత్.. భాగో మత్(భయపడొద్దు.. దూరంగా పారిపోవద్దు) అంటూ రాహుల్‌కు సూచించారు. కేరళలోని వయనాడ్‌లో పోలింగ్ పూర్తికాగానే కాంగ్రెస్ యువరాజు అక్కడి నుంచి పారిపోయి మరో స్థానం వెతుక్కుంటాడని ఇంతకుముందే చెప్పానని, తాను చెప్పినట్లే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజు వయనాడ్‌లో ఓటమి తప్పదని గ్రహించి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్‌కు పారిపోయాడని, ఇప్పుడు అక్కడినుంచి రాయ్‌బరేలీకి వచ్చాడని పేర్కొన్నారు. ఈసారి అమేథీలో పోటీ చేసే ధైర్యం లేక రాయ్‌బరేలీని ఎంచుకున్నాడని ఎద్దేవా చేశారు. భయపడొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు తరచుగా ప్రజలకు చెబుతుంటారని, తాను అదే మాట ఇప్పుడు వారికి చెబుతున్నానని అన్నారు. ఇకనైనా భయపడడం, దూరంగా పారిపోవడం ఆపేయాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు.
శుక్రవారం పశి్చమ బెంగాల్‌లోని బర్ధమాన్–దుర్గాపూర్, కృష్ణనగర్, బీర్భుమ్, బోల్‌పూర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో, జార్ఖండ్‌లోని చైబాసాలో ‘మహా విజయ్ సంకల్ప సభ’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభ మసకబారుతోందని, ప్రజాదరణ కోల్పోతోందని, ఈ ఎన్నికల్లో ఆ పారీ్టకి చరిత్రలోనే అత్యంత తక్కువ స్థానాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
కనీసం 50 సీట్లయినా గెలుచుకోవడం కష్టమేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని చెప్పడానికి ఒపీనియన్ పోల్స్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ఓటమి గురించి తాను గతంలోనే పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు(సోనియా గాం«దీ) లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గుర్తించి, రాజస్తాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నేతలకే లేదన్నారు. ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ఇంకా మాట్టాడారంటే..
దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ‘ఓటు జిహాద్’
దేశంలో ఓటు జిహాద్ ఆట గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాద్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు నోరెత్తడం లేదు. అంటే ఈ పిలుపును ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నట్లే లెక్క. ఓటు జిహాద్‌లో పాలుపంచుకున్నవారికి ప్రజల ఆస్తులను దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది.
ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి బుజ్జగింపు తప్ప మరో విధానం లేదు. మతం ఆధారంగా ఇప్పటికే మన దేశాన్ని ముక్కలు చేశారు. సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు అవతలి గట్టుపై చిక్కుకొని నానా కష్టాలూ పడుతున్నారు. వారికి న్యాయం చేకూర్చడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు మాత్రం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వనరులపై, సందపపై ముమ్మాటికీ పేదలకే మొదటి హక్కు ఉంది. ఈ భూగోళంపై ఏ శక్తి కూడా మన రాజ్యాంగాన్ని మార్చేయలేదు.
15 సీట్లు కూడా నెగ్గలేని తృణమూల్ కాంగ్రెస్, 50 సీట్లయినా దక్కించుకోలేని కాంగ్రెస్ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి స్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మాత్రమే ఉంది. పశి్చమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేసింది. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోంది. ఎన్నికల్లో ఆ పారీ్టకి బుద్ధి చెప్పాలి. చిత్తుచిత్తుగా ఓడించాలి. ప్రజలను లూటీ చేసినవారిని శిక్షించకుండా వదిలిపెట్టబోమని గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.
మూడు సవాళ్లపై సమాధానమేదీ?
దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తుండడం చూసి కాంగ్రెస్ భరించలేకపోతోంది. అందుకే వారి రిజర్వేషన్లు లాక్కొని మైనారీ్టలకు కట్టబెట్టాలని పథకం వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘జిహాదీ ఓటు బ్యాంక్’ కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడం తథ్యం. కాంగ్రెస్‌తోపాట విపక్ష కూటమికి నేను 3 సవాళ్లు విసురుతున్నా. మొదటిది.. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చబోమని లేదా మతం ఆధారం రిజర్వేషన్లు ఇవ్వబోమని దేశ ప్రజలకు లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. రెండోది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాజేయబోమని, మతం ఆధారంగా ఆయా వర్గాల ప్రజలను విభజించబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. మూడోది.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు కలి్పంచబోమని లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇవ్వాలి. ఈ మూడు సవాళ్లపై ప్రతిపక్షాలు నోరుమెదపడం లేదు. నాకు సమాధానం ఇవ్వడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment