రాయ్ బరేలీ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 32కి చేరింది. తీవ్ర గాయాలపాలైన 12 మందిని ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రికి తరలించినట్లు ఎన్‌టీపీసీ ప్రాంతీయ అధికారి ఆర్‌ఎస్ రత్తీ ప్రకటించారు. ఘటన జరిగిన విధానం కోసం నిపుణులతో కూడిన కమిటీని నియమించి 30 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.