ఎన్నికల నుంచి ప్రియాంక దూరంపై కాంగ్రెస్‌లో రకరకాల చర్చలు
వారసత్వ పోకడ అన్న బీజేపీ విమర్శలకి చెక్ పెట్టేందుకే అంటూ కొందరి వ్యాఖ్య
ఉప ఎన్నిక ద్వారా ఎంట్రీ ఇస్తారని మరికొందరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ని్రష్కమించాక ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని గంపెడాశ పెట్టుకున్న స్థానిక నాయకత్వంపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. రాయ్‌బరేలీ లేదా అమేథీలో ప్రియాంక కచి్చతంగా పోటీచేస్తారని తెగ ప్రచారం జరిగినా చివరకు ఆమె పోటీకి నిలబడకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ప్రియాంకను పోటీలో ఉండకపోవడం వెనుక ‘రహస్య వ్యూహం’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో అదేమిటన్న ఆసక్తి మరింత ఎక్కువైంది.
అరంగేట్రం వయా ఉప ఎన్నిక !
వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయినాసరే దశాబ్ధాలుగా రాయ్‌బరేలీతో అనుబంధం పెంచుకున్న గాం«దీలు కచి్చతంగా పోటీచేయాలని స్థానిక నేతల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ సైతం ఇదే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి రాహుల్ పోటీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా ఎన్నికయ్యారు.
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్‌లో ముగ్గురు గాం«దీలు ఉంటారని, ఇది వారసత్వ రాజకీయాలను వ్యతి రేకిస్తున్న బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో రాహుల్ గెలిస్తే రాయ్‌బరేలీలో రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి వచ్చే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక రాజకీయ అరంగ్రేటం చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రియాంకగాంధీ దేశమంతా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఒక్క రాయ్‌బరేలీ నియోజకవర్గానికే పరిమితం చేయకూడదన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment