legacy politics
-
Lok sabha elections 2024: ‘రహస్య వ్యూహం’ ఏమిటో?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ని్రష్కమించాక ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని గంపెడాశ పెట్టుకున్న స్థానిక నాయకత్వంపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. రాయ్‌బరేలీ లేదా అమేథీలో ప్రియాంక కచి్చతంగా పోటీచేస్తారని తెగ ప్రచారం జరిగినా చివరకు ఆమె పోటీకి నిలబడకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. ప్రియాంకను పోటీలో ఉండకపోవడం వెనుక ‘రహస్య వ్యూహం’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో అదేమిటన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. అరంగేట్రం వయా ఉప ఎన్నిక ! వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయినాసరే దశాబ్ధాలుగా రాయ్‌బరేలీతో అనుబంధం పెంచుకున్న గాం«దీలు కచి్చతంగా పోటీచేయాలని స్థానిక నేతల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ సైతం ఇదే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి రాహుల్ పోటీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్లో ముగ్గురు గాం«దీలు ఉంటారని, ఇది వారసత్వ రాజకీయాలను వ్యతి రేకిస్తున్న బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో రాహుల్ గెలిస్తే రాయ్‌బరేలీలో రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి వచ్చే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక రాజకీయ అరంగ్రేటం చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రియాంకగాంధీ దేశమంతా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఒక్క రాయ్‌బరేలీ నియోజకవర్గానికే పరిమితం చేయకూడదన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. -
వారసత్వ రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికే ముప్పు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని ధీమా వెలిబుచ్చారు. యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీని గెలిపించే ధోరణికి యూపీ ప్రజలు స్వస్తి చెప్పారు. వారు 2014 (లోక్‌సభ) ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించారు. మా పనితీరు నచ్చి 2017 (అసెంబ్లీ) ఎన్నికల్లో మళ్లీ అవకాశమిచ్చారు. తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా మేం చేసిన అభివృద్ధిని మెచ్చి 2019 (లోక్‌సభ) ఎన్నికల్లోనూ మాకే ఓటేశారు. ఇప్పుడూ బీజేపీకే అవకాశమిస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు అంశాలపై మోదీ ఏమన్నారంటే... యూపీ మహిళలు రాత్రి పూట తిరగొచ్చు... గతంలో యూపీ అంటే మాఫియారాజ్, గూండారాజ్ మాత్రమే గుర్తొచ్చేవి. వాటిని ప్రభుత్వాలే ప్రోత్సహించేవి. ఇప్పుడక్కడ శాంతిభద్రతలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతంగా చక్కదిద్దింది. ఇప్పుడు యూపీ మహిళలు రాత్రుళ్లు కూడా నిర్భయంగా ఒంటరిగా బయటికి వెళ్లవచ్చు. ఎస్పీ, బీఎస్పీ కల్లబొల్లి మాటలను ఓటర్లు వినే పరిస్థితి లేదు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పు... వారసత్వ రాజకీయాలు నా దృష్టిలో కుహనా సామ్యవాదం. రాం మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌కుమార్ కుటుంబాలు మీకెక్కడైనా కన్పిస్తాయా? సోషలిస్టులంటే వాళ్లు. సమాజ్‌వాదీ పార్టీలో కనీసం 45 పదవుల్లో అగ్ర నేతల కుటుంబీకులేనట! కశ్మీర్, హరియాణా మొదలుకుని యూపీ, జార్ఖండ్, తమిళనాడు దాకా చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు. డైనాస్టీ (వారసత్వం) ఉన్న చోట డైనమిజం ఉండదు. కుల రాజకీయాలు కూడా శాశ్వతంగా పోవాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం కుల జపం చేయడం సరికాదు. హెడ్లైన్ల కోసం పాకులాడట్లేదు... నిత్యం పతాక శీర్షికల్లో నిలవాలని నేనెన్నడూ పాకులాడలేదు. అంతర్జాతీయంగా దేశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా తపన. కానీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలు మన దేశంలో తప్ప బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో! దర్యాప్తు సంస్థల దురుపయోగం అబద్ధం... దర్యాప్తు సంస్థలను మేం దురుపయోగం చేస్తున్నామన్నది అబద్ధం. దేశవ్యాప్తంగా అవినీతి భరతం పడుతూ వందలాది, వేలాది కోట్ల జాతి సంపద ఖజానాకు జమ చేస్తున్నందుకు నిజానికి నన్ను మెచ్చుకోవాలి. అవినీతి దేశానికి పట్టిన చీడ. దీనిపై నేనేమీ చేయకపోతే ప్రజలు నన్ను క్షమిస్తారా? ఎన్నికలప్పుడు ప్రత్యర్థులను వేధించేందుకు వీటిని వా డుకుంటున్నామంటున్న పార్టీలకు దమ్ముంటే దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలకు అంగీకరించాలి. నెహ్రూపై విమర్శలు సబబే... నేను ఎవరి తండ్రి గురించో, తాత గురించో పనిగట్టుకుని మాట్లాడలేదు (రాహుల్‌నుద్దేశించి). కేవలం ఒక మాజీ ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేశా. అది తెలుసుకోవడం దేశం హక్కు. మేం నెహ్రూ పేరే ఎత్తొద్దన్నది వారి వాదన. వాళ్లకు అంత భయమెందుకో! దేశం కోసమే సాగు చట్టాలు వెనక్కు.. నేను రైతుల మనసు గెలుచుకునేందుకే వచ్చాను. గెలిచాను కూడా. చిన్న రైతుల సమస్యలు నాకు తెలుసు. సాగు చట్టాలను రైతుల ప్రయోజనం కోసమే తెచ్చాం. కానీ అంతిమంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కు తీసుకున్నాం. ఎన్నికలు మాకు నిత్య పాఠాలు.. ఎన్నికలను మేం కేవలం రాజకీయ దృష్టితో మాత్రమే చూడం. అవి మాకు ఓపెన్ యూనివర్సిటీల వంటివి. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు గొప్ప అవకాశాలుగా వాటిని చూస్తాం. -
యువత రాజకీయాల్లోకి రావాలి
సాక్షి, న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువని, వాటి అసమర్థత దేశానికి భారం అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాల అసమర్థత, చేతకానితనం నియంతృత్వానికి కొత్త రూపం ఇస్తుందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ, లోక్‌సభ సచివాలయం సంయుక్తంగా ఇక్కడి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన రెండో జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవాల్లోని ముగింపు సమావేశంలో ప్రసంగించిన మోదీ.. వారసత్వ రాజకీయాలపై విమర్శల దాడి చేశారు. ‘వారు తమ సొంత కుటుంబాలలో ఇటువంటి ఉదాహరణలను చూస్తారు. అందువల్ల వారికి చట్టంపై గౌరవం గానీ భయం గానీ ఉండదు..‘అని ఆయన అన్నారు. యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ.. రాజకీయాలను కాపాడాలంటే ఇది అవసరమని పేర్కొన్నారు. ప్రధాని ఏ పార్టీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. గతంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి విమర్శలు చేశారు. వారసత్వ రాజకీయాలు కూడా దేశంలో రాజకీయ, సామాజిక అవినీతి వెనుక దాగిన పెద్ద కార ణాల్లో ఒకటి అని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యంలో కొత్త నియంతృత్వానికి దారితీస్తాయన్నారు. ‘నేషన్ ఫస్ట్(ముందుగా దేశం) అన్న సెంటిమెంట్‌కు బదులుగా నేను మరియు నా కుటుంబం అన్న సెంటిమెంట్‌ను ఈ రాజకీయాలు బలోపేతం చేస్తాయి..’అని పేర్కొన్నారు. -
పనికిరాని వాళ్లూ..నాయకులు అవుతున్నారు
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: నిన్నటి వరకూ ఎందుకూ పనికిరాని వాడు ఓ పార్టీ కండువా కప్పుకోగానే నాయకుడైపోతున్నాడని.. అలాంటి వారిని పార్టీలో చేర్చుకునే వారికి, చేరేవారికి సిగ్గులేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సేవా సమితి, స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, తెలంగాణ నవ నిర్మాణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సైంటిస్ట్ ప్రొ.బాబూరావు అధ్యక్షతన ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు-ప్రజల కర్తవ్యాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో క్రిమినల్స్, మాఫియాలు చేరుతున్న ధోరణిని అడ్డుకోవాల్సిన మేధావులు తమ కర్తవ్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. సీనియర్ సిటిజన్లు, యూత్ ఆర్గనైజేషన్, కాలనీ అసోసియేషన్లు అందరూ ప్రతీ కాలనీల్లో సమావేశమై ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందామని ప్రచారం చేయాలని అన్నారు. ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొ. గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలో వ్యవస్థ పక్కదారి పడుతోందంటే అది విద్యావంతులు, మేధావులు మౌనంగా ఉండడం వల్లేనని అంబేద్కర్ చెప్పారని.. విద్యావంతులు ఉన్న నగరంలో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలంటూ ప్రచారం చేయాలని అన్నారు. నగరంలో వారసత్వ రాజకీయం నడుస్తోందని, రాజకీయం అంటే సం పాదించుకునే వ్యవస్థగా మారిందని మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, నారగోని, ప్రొ. నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రాజలింగం, నైనాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
కమల దళంలోనూ ‘వార్’సత్వం
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలనగానే నిన్నామొన్నటిదాకా అందరికీ కాంగ్రెస్ పార్టీనే మదిలో మెదిలేది. ఇక ఇప్పుడుప్రతిపక్ష బీజేపీలోనూ వారసత్వ రాజకీయ పోరు ప్రారంభమైంది. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో పలువురు బీజేపీ నాయకులు కూడా కొడుకులను రాజకీయ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ అగ్ర నాయకులు కుటుంబ సభ్యులకు టికె ట్లను దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రితోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రంగంలోకి తీసుకొచ్చేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ఈ ప్రయత్నాలను పసిగట్టిన రెండో శ్రేణి నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడం ప్రారంభించారు. ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని కలలుగంటున్న ఈ నాయకులు ఇప్పటికే పార్టీ తరఫున అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ‘‘గడిచిన మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను వారసత్వ రాజకీయాల పార్టీగా అధినాయకుల నుంచి వీధి నాయకుల వరకు దుమ్మెతి పోశాం. ఇప్పుడు మా పార్టీ అదే దారిలో నడుస్తోంది.’ అని పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న బీజేపీ నాయకుడొకరు విమర్శించారు. ‘‘సూత్రబద్ధ రాజకీయాలకు కట్టుబడే పార్టీగా పేరుపడి బీజేపీలో ఇప్పుడు ఆ నిబంధనలు నీరుగారిపోతున్నాయి. అగ్ర నాయకుల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడాన్ని పార్టీలో అన్నిస్థాయిల్లో చర్చ లేవనెత్తుతాం’’ అని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ తనయుడు ప్రవేశ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా తనయులు విమల్, హరీశ్ ఖురానా, ప్రస్తుత ఎమ్మెల్యే ఓపీ బబ్బర్ తనయుడు రాాజీవ్బబ్బర్, ఎమ్మెల్యే హెచ్ఎస్ బల్లీ భార్య ప్రస్తుత ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయించుకునేందుకు తండ్రులు తీవ్ర ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు వీకే మల్హోత్రా తనయుడు అజయ్ మల్హోత్రా, జనక్‌పురి శాసనసభ్యుడు జగదీశ్ ముఖీ తనయుడు అతుల్ ముఖి, సాహెబ్ సింగ్ వర్మ సోదరుడు ప్రస్తుత ఉత్తర ఢిల్లీ మేయర్ ఆజాద్‌సింగ్ కూడా టికెట్ ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. సాహెబ్‌సింగ్ వర్మ దివంగతులవగా మరో మాజీ ముఖ్యమంత్రి సీఎం ఖురానా పడక మంచానికే పరిమితమయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ తనయుడు ప్రవేశ్ వర్మ కన్ను షాలీమార్‌బాగ్ నియోజక వర్గంపై పడింది. ఖురానా కుమారులు మోతీనగర్ సీటును దక్కించుకోవాలనిచూస్తున్నారు. ఇక్కడి నుంచి వారి తండ్రి వరుస విజయాలు సాధించారు. రెండు నియోజక వర్గాలు బీజేపీకి పెట్టని కోటలని ప్రతీతి. ప్రస్తుతం ఢిల్లీ శాసనసభలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా బీజేపీలోని ఈ పరిణామాలను పార్టీ అంతర్గత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అగ్ర నేతల కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెడితే కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్లవుతుందని అంటున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారు పార్టీ సిద్ధాంత కట్టుబాటును శంకించే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ‘‘మా ప్రధాని అభ్యర్థి రాజకీయాల్లో కాంగ్రెస్ సంస్కృతిని తుడిచిపెట్టాలని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఒక వేళ ఇప్పుడు అగ్ర నాయకుల వారసులకుు టికెట్లు ఇచ్చి అభ్యర్థులను చేస్తే పార్టీది రెండు నాల్కల ధోరణి అవుతుంది తప్ప మరేమీు కాదు. దీన్ని పార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి’’ అని ఓ సీనియర్ నాయకుడు తీవ్రంగా విమర్శించారు.