రాయ్‌బరేలీ, అమేథీ.. ప్రస్తుతం ఈ రెండు ఈ స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన స్థానాల్లో నేడు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు కారణం..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీ సినియర్ నేత కేఎల్ శర్మ బరిలో దిపింది కాంగ్రెస్ అధిష్టానం. తొలుత రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలుస్తారని వార్తలు వచ్చాయి. తన సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీకి దిగిన రాహుల్.. అమేథీ నుంచి కూడా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది.
కాగా ప్రియాంకను రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరినట్లు సమాచారం. కానీ అందుకు ఆమె అయిష్టత చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక నో చెప్పడానికి ఆమె సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధే కారణంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల.. వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ చేస్తున్న ఆరోపణలు బలోపేతం చేసినట్లు అవుతుందని ప్రియాంక భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
చదవండి:
Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?
మరోవైపు ప్రియాంక నిర్ణయంపై ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుందని పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆమె లోక్‌సభ ఎన్నికలకు విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్‌కు లాభం చేకూరేదని భావిస్తున్నారు.
వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రాహుల్.. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. కేరళలోని వయనాడు నుంచి ఎంపీగా గెలవడంతో పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈసారి కూడా వయనాడ్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. దీంతోపాటు అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకుంటే రయ్‌బరేలీ నుంచి రంగంలోకి దిగి ట్విస్ట్ ఇచ్చారు.
అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్‌శర్మను ఎంపిక చేసింది పార్టీ. ఇంతకుముందు రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా పనిచేసిన శర్మ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేడు రాహుల్, శర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ జరగనుంది.
రాయ్‌బరేలీలో బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌తో గాంధీ తలపడనున్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో శర్మ పోటీపడనున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ అఖండ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమేథీలోమ అట్టడుగు వర్గాలకు చెందిన శర్మ తప్పక గెలుస్తారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment