రాయ్‌బరేలీ : తమ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించకపోతే వారు చేస్తున్న కృషి వ్యర్థవమవుతుంది. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులకు తగిన భద్రత కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది కనిపించడం లేదనే చెప్పాలి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కోవిడ్-19 బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు రిలీజ్ చేసిన వీడియో ఒకటి ఆలోచనలో పడేసింది. అంతేగాక తాము వైద్యులమన్న సంగతి మరిచి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడంపై అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు లేఖ ద్వారా తమ బాధను చెప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాయ్‌బరేలీలో కరోనా సోకిన బాధితులకు అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వైద్యులు ఇంటికి వెళ్లడానికి నిరాకరించడంతో అక్కడి ప్రభుత్వం మంగళవారం ఆసుపత్రి పక్కనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్‌లో వారు ఉండేదుకు క్వార్టర్స్‌ను ఏర్పాటు చేశారు. (ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు)
తమ విధులు ముగించుకొని క్వార్టర్స్‌కు వెళ్లిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అక్కడి పరిస్థితిని గమనించిన వైద్యులు మంగళవారం రాత్రి రెండు వీడియోలు తీసి స్థానిక చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు పంపారు. 'మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న మాకు కనీస సౌకర్యాలు లేని గదులు కేటాయించారు. ఒకే గదిలో నాలుగు మంచాలు ఏర్పాటు చేశారు. కనీసం ఒక ఫ్యాన్ కూడా లేదని, నాలుగు గంటలుగా గదిలో కరెంట్ కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురయ్యాం. బాత్‌రూమ్‌లో యూరిన్ పైప్ సరిగా లేక కంపు కొడుతుంది. ఇక తిండి విషయానికి వస్తే ఇక పాలిథిన్ కవర్‌లో పూరీ, సబ్జీని కలిపి పంపించారు. దానిని తినడం మావల్ల కాలేదు. ఇక ఒకే గదిలో నాలుగు బెడ్స్ ఏర్పాటు చేశారని, కనీసం తాగడానికి మంచినీటిని కూడా పెట్టలేదు. ఒక గౌరవమైన వృత్తిలో ఉంటూ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులను, సిబ్బందిని ఇలాగేనా చూసుకునేది. మా పరిస్థితి ఇలాగే ఉంటే ఏదో ఒకరోజు మాకు కరోనా అంటుకుంటుంది. అప్పుడు మాకు దిక్కెవరు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు)
అయితే ఈ వీడియోపై స్పందించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌కే శర్మ మాట్లాడుతూ.. వారు వీడియోను షేర్ చేయగానే నేను అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాను. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారంతా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే బుధవారం రాత్రి వారిని గెస్ట్ హౌస్‌కు తరలించాం. వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి అవసరమైనవన్నీ సమకూర్చామంటూ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపిన రోజే కరోనాపై పోరాటం చేస్తున్న వారియర్స్(వైద్యులు, సిబ్బంది)ను కంటికి రెప్పలా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కానీ వైద్యులకు ఏర్పాటు చేసిన వసతి మోదీ పిలుపును ఆలోచనలో పడేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 700కు చేరువలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment