
'ముందు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు'
రాయ్ బరేలీ: చాలాకాలం తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ రాజకీయ అంశాన్ని తలకెత్తుకున్నారు. ఆమె కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర మానవ వనరులశాఖామంత్రి అమేథీలో ఎందుకు ఇప్పటివరకు ఐఐఐటీని ఏర్పాటుచేయడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆమె తప్పక సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఒక విద్యా మంత్రి అయి ఉన్న ఆమెను ఏకారణం ఐఐఐటీని ఏర్పాటులచేయకుండా ఆపుతుందో వివరించాలని కోరారు.
స్మృతి ఆ శాఖను నిర్వహిస్తున్నప్పటి నుంచి ఎంతో మంది యువత సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆవిషయం ఆమె ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న పట్టించుకోవడం కరువైందని అన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్మృతి ఇరానీ రాహుల్ నియోజకవర్గంలో పర్యటించి తీవ్ర విమర్శలు చేసింది. గాంధీ కుటుంబ పాలనలో అమేథీ, రాయ్ బరేలీ సమస్యల్లో కూరుకుపోయాయని, అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించింది. దీంతో ఈ వ్యాఖ్యలపై ప్రియాంకగాంధీ స్పందించారు. ఆమె ప్రస్తుతం రాయ్ బరేలీ పర్యటనలో ఉన్నారు.