సోనియాపై ఆప్ అభ్యర్థి మాజీ జడ్జి ఫక్రుద్దీన్
న్యూఢిల్లీ: రాయ్ బరేలిలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై పోటికి అభ్యర్థిని ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) ఖరారు చేసింది. సోనియాపై పోటికి మాజీ న్యాయమూర్తి ఫక్రుద్దీన్ ను ఆప్ ప్రకటించింది. రాయ్ బరేలిలో ముస్లీం ఓటర్లకు గాలం వేసేందుకు ఫక్రుద్దీన్ రంగంలోకి ఆప్ దించింది. ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని లాల్ బహద్దుర్ శాస్త్రి మనవడు ఆదర్శ్ శాస్త్రిని బరిలోకి దించింది.
వారణాసిలో నరేంద్రమోడిని ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులుగా సేవలందించిన మాజీలను ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఆరుగురు మాజీ మంత్రులు రాహుల్ గాంధీ పోటి చేస్తున్న అమేథిలో కూడా ప్రచారం చేయనున్నారు.