సోనియాకు ఇల్లే కాదు..కారు కూడ లేదట!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ప్రభుత్వాన్ని శాసిస్తున్న సోనియాగాంధీకి చేతిలో సరైన సొమ్ము, ఇల్లు, కారు కూడా లేదట. అంతేకాకుండా 9 లక్షల లోన్ మొత్తాన్ని కూడా చెల్లించాలట. ఈ విషయాలన్ని తాజాగా ఎన్నికల సందర్భంగా రాయ్ బరేలి లోకసభకు నామినేషన్ దాఖలు సమయంలో రిట్నర్నింగ్ అధికారికి అఫిడవిట్ ను సోనియా గాంధీ సమర్పించారు.
సోనియా వద్ద 85 వేల నగదు మాత్రమే ఉండగా, 9 లక్షల అప్పును చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్లలో 66 లక్షల రూపాయలు, వారసత్వంగా లభించిన 23 లక్షల రూపాయల విలువైన బంగారు అభరణాలు ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు. సోనియా వద్ద 12 లక్షల మ్యూచ్ వల్ ఫండ్స్, కొన్ని కంపెనీల షేర్లు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు.
అంతేకాకుండా తన వద్ద 1.267 కేజిల బంగారం, 88 కేజీల వెండి ఉన్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో 2.5 కిలోల బంగారం ఉన్నట్టు సోనియా తెలిపారు. ఢిల్లీకి సమీపంలోని సుల్తాన్ పూర్, దేరా మండి గ్రామంలో 4.86 కోట్ల విలువైన 3.21 ఎకరాల భూమి ఉన్నట్టు సోనియా తెలిపారు. ఇంకా విశేషమేమిటంటే భారత దేశంలోనూ, ఇటలీలోనూ స్వంత అపార్ట్ మెంట్, ఇల్లు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో పొందు పరచలేదు.