రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వివాహ వేడుక జరుగనుంది. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జులై 12న ఏర్పాటు చేశారు. దీంతో అంబానీ కుటుంబం ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేసింది.
వారం రోజుల క్రితం లగ్నపత్రిక కూడా రాసుకున్నారు. ఇక మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ముందస్తు వివాహ వేడుకలను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. అయితే, జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా వేడుకల కోసం వచ్చే బిలియనీర్ గెస్ట్‌లకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఫైవ్‌స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా గెస్ట్‌లు ఉండేందుకు అల్ట్రా లగ్జరీ టెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా తాత్కాలిక దేవాలయాలు రూపొందిస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే వీటిలో సకల సదుపాయాలూ ఉండనున్నాయి.
An Auspicious Beginning
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) February 25, 2024
Ushering in Anant Ambani and Radhika Merchant's much-awaited wedding, the Ambani family has facilitated the construction of new temples within a sprawling temple complex in Jamnagar, Gujarat. pic.twitter.com/xKZwCauWzG
అతిథుల లిస్ట్..
ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్‌జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు.
ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్!
కోడలికి ఖరీదైన గిఫ్ట్‌లు..
ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అత్తింటి వారు తమకు కాబోయే కోడలికి ముందుగానే సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment