Wedding Accessories
-
పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమా
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. దీన్ని తరాలు గుర్తిండిపోయేలా వైభవంగా జరపాలనుకుంటారు. పెళ్లి బట్టల షాపింగ్ నుంచి వధువు అత్తారింట్లో కాలుమోపే వరకు రూ.లక్షలు ఖర్చు చేస్తారు. మొన్నామధ్య అనంత్ అంబానీ పెళ్లికి ముఖేశ్ అంబానీ కుంటుంబం కోట్లల్లో ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. పెళ్లిలో ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం కలిగి, బంధువులు గాయాలపాలైతే..పెళ్లి చేస్తున్న కుటుంబ సభ్యులకు తీరని వ్యథగా మారుతుంది. అలాంటి వారికోసం చాలా బీమా కంపెనీలు వివాహ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినా ఈ బీమా ఆర్థికంగా ఆదుకుంటుంది.వివాహ వేడుక స్థాయి, సర్వీసులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సర్వీసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది.లయబిలిటీ కవరేజీ..పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటిది జరిగితే ఈ కవరేజీ వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ థర్డ్ పార్టీకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు.ఏదైనా కారణాల వల్ల పెళ్లి రద్దైనా లేదా వాయిదా పడినా క్యాన్స్లేషన్ కవరేజీ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. విలువైన వస్తువులు పాడైనా దాని కోసం ప్రత్యేకంగా కవరేజీ అందిస్తున్నారు. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా.. ‘అటైర్ కవరేజీ’ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవాలి. -
టెంట్లు వేస్తూ దేవాలయాలు నిర్మిస్తున్న అంబానీ.. ఎందుకంటే..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వివాహ వేడుక జరుగనుంది. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జులై 12న ఏర్పాటు చేశారు. దీంతో అంబానీ కుటుంబం ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేసింది. వారం రోజుల క్రితం లగ్నపత్రిక కూడా రాసుకున్నారు. ఇక మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ముందస్తు వివాహ వేడుకలను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. అయితే, జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా వేడుకల కోసం వచ్చే బిలియనీర్ గెస్ట్‌లకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఫైవ్‌స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా గెస్ట్‌లు ఉండేందుకు అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా తాత్కాలిక దేవాలయాలు రూపొందిస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే వీటిలో సకల సదుపాయాలూ ఉండనున్నాయి. An Auspicious Beginning Ushering in Anant Ambani and Radhika Merchant's much-awaited wedding, the Ambani family has facilitated the construction of new temples within a sprawling temple complex in Jamnagar, Gujarat. pic.twitter.com/xKZwCauWzG — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) February 25, 2024 అతిథుల లిస్ట్.. ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్! కోడలికి ఖరీదైన గిఫ్ట్‌లు.. ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అత్తింటి వారు తమకు కాబోయే కోడలికి ముందుగానే సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిసింది. -
పెళ్లింట విషాదం
మూడు గుడిసెలు దగ్ధం ఓ గుడిసెలో పెళ్లి సామగ్రి, రూ.2లక్షలు దగ్ధం దాదాపు రూ.5లక్షలకు పైగా నష్టం ఎమ్మిగనూరు టౌన్: పట్టణంలోని శాంతినగర్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు కుటుంబాల బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్న వీరేష్ ఇంట్లో ముందుగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించేలోపు మంటలు పక్కనే ఉన్న మరో రెండు గుడిసెలకు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి ఇంట్లో దేవుని ముందు ఉంచిన దీపమే కారణమై ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వీరేష్ గుడిసెలోని వంట సరుకు, సామగ్రి, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. అలాగే జాతరలు తిరుగుతూ రింగుల ఆటతో జీవనం సాగిస్తున్న మహేష్ గుడిసెలోని వస్తువులన్నీ బూడిదయ్యాయి. ఇక ఆర్టీసీలో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్న బాలముని కుటుంబానికి ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఆదివారం కూతురు కృష్ణవేణి పెళ్లి ఉంది. అందుకోసం ఖర్చుల నిమిత్తం ఇంట్లో ఉంచిన రూ.2 లక్షలు, పెళ్లిబట్టలు, ఇతర వస్తువులన్నీ కాలి బూడిదయ్యా యి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5నుంచి రూ.7లక్షల దాకా ఆస్తినష్టం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.