రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ టీచర్‌గా, వ్యాపారవేత్తగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానిగా, నృత్యకారిణిగా, సేవకురాలిగా..ఇలా తన లైఫ్‌లో ఎన్నో పాత్రలు పోషించారు. జీవితంలో ఎదిగేందుకు చాలాకష్టపడినట్లు ఐకానిక్ టాక్ షో విత్ సిమి గరేవాల్ ఎపిసోడ్‌లో వెల్లడించారు. ఈమేరకు అప్పటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో నీతా అంబానీ నర్సరీ స్కూల్‌లో టీచర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముఖేష్ అంబానీతో 1985లో వివాహం జరగడానికంటే ఏడాది ముందు నుంచే ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..?
ముఖేష్ అంబానీని పెళ్లాడిన తర్వాత కూడా సన్‌ఫ్లవర్ నర్సరీ స్కూల్‌లో టీచర్‌గా కొనసాగినట్లు తెలిపారు. అప్పుడు తన వేతనం నెలకు రూ.800 ఉండేదని నీతా అంబానీ గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సమయంలో తనను చూసి చాలా మంది ఎగతాలిగా నవ్వేవారని చెప్పారు. కానీ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment