అయ్యో.. 11 మందికి బిలీనియర్ ట్యాగ్ పోయింది!
అయ్యో.. 11 మందికి బిలీనియర్ ట్యాగ్ పోయింది!
Published Tue, Mar 7 2017 5:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో 11 మంది తమ బిలీనియర్ ట్యాగ్ ను కోల్పోయారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో వీరు బిలీనియర్ జాబితా నుంచి కిందకి పడిపోయినట్టు తాజా సర్వేలో వెల్లడైంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ మంగళవారం విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి ప్రభుత్వం తీసుకునే సంచలనాత్మక నిర్ణయాలతో భారత్ ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొందని హురున్ రిపోర్ట్ ఇండియా చీఫ్ రీసెర్చర్, మేనేజింగ్ డైరెక్టర్ రెహమాన్ జునైడ్ తెలిపారు. పారదర్శకతమైన కరెన్సీ ఎకనామిక్స్ పారశ్రామికవేత్తల్లో సానుకూల ప్రభావాన్ని నెలకొల్పుతుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నేడు విడుదల చేసిన రిచెస్ట్ ఇండియన్స్ 2017 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, చైర్మన్ ముఖేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ ర్యాంకిగ్స్ లో ఆయన 28 స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత దేశీయంగా రెండో ర్యాంకింగ్ లో ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ(గ్లోబల్ గా 74) , మూడో స్థానంలో దిలీప్ సంఘ్వీ(గ్లోబల్ గా 74), నాలుగో ర్యాంక్ లో పల్లోజి మిస్త్రీ(గ్లోబల్ గా 97)లు ఉన్నారు. ఈ రిపోర్టు ప్రకారం 132 మంది భారతీయులు లేదా భారతీయ సంతతి బిలీనియర్ల నికర సంపద 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. 42 మంది బిలీనియర్లకు ముంబై నిలయంగా ఉండగా.. దాని తర్వాత న్యూఢిల్లీ, అహ్మదాబాద్ లు ఉన్నాయి. గ్లోబల్ గా బీజింగ్, న్యూయార్క్ ను అధిగమించింది. ''బిలీనియర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్'' గా బీజింగ్ అగ్రస్థానంలో నిలిచింది.
Advertisement
Advertisement