
'అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్'ల వివాహం జులై 12న జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు మొదలైపోయాయి. నీతా అంబానీ మొదటి శుభలేఖను కాశీ విశ్వనాధునికి సమర్పించారు. అనంత్ అంబానీ పలువురు సినీ తారలను, ఇతర ప్రముఖులను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఈ తరుణంలో అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అద్భుతంగా ఉన్న అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు ధర ఎంత ఉంటుందని సర్వత్రా ఉత్కంఠగా మారింది. అంబానీల ఒక్క వెడ్డింగ్ కార్డు ధర రూ. 6.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎందుకంటే ఇది మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు.
గతంలో ముకేశ్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లి కార్డును కూడా రూ. 3 లక్షల ఖర్చు పోయేట్టు తయారు చేయించినట్లు సమాచారం. కాగా ఇప్పుడు కొడుకు వెడ్డింగ్ (ఒక్కొక్క వెడ్డింగ్ కార్డు) కార్డు కోసం ఏకంగా రూ. 6.50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంబానీ ఇంట జరగబోయే ఈ వివాహ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు, సినీతారలు హాజరు కానున్నారు. కాగా వీరి పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.
ఇదీ చదవండి: అనంత్ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రిక
Unboxing the wedding card for Anant Ambani and Radhika Merchant's world's costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2
— DealzTrendz (@dealztrendz) June 26, 2024