సీఎంగా ప్రమాణ స్వీకారం.. దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే | Devendra Fadnavis Wife Reacts as He Sworn in as Maharashtra CM | Sakshi
Sakshi News home page

సీఎంగా ప్రమాణ స్వీకారం.. దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

Published Thu, Dec 5 2024 8:11 PM | Last Updated on Thu, Dec 5 2024 8:15 PM

Devendra Fadnavis Wife Reacts as He Sworn in as Maharashtra CM

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5.30గంటలకు ముంబై ఆజాద్‌ మైదాన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ఎన్‌డీఏ అలయన్స్‌ నేతలు పాల్గొన్నారు.  

అయితే, ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన సతీమణి  అమృతా ఫడ్నవీస్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘దేవేంద్ర ఆరోసారి ఎమ్మెల్యే అయ్యి మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. ఈ రోజు మాకు బ్యూటిఫుల్‌ డే. మాకు బాధ్యత కూడా మరింత పెరిగింది’అని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి ఘన విజయం సాధించింది.288 స్థానాలకు గానూ మహాయుతి కూటమి 235 అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (57), ఎన్సీపీ (41) స్థానాల్ని దక్కించుకున్నాయి.  

అదే ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో గెలుపొందగా, దాని భాగస్వామ్య పక్షాలు శివసేన (యుబిటి) 20, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) 10 స్థానాలను గెలుచుకున్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement