ముంబై: మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ముంబై శివారుల్లో ఆదివారం కార్లు, బైకులతో ర్యాలీ తీసిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీసు స్పందించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని సహించేది లేదని పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల నేపథ్యంలో 10-12 మంది కార్లు, మెటర్ సైకిల్స్‌తో ఆదివారం రాత్రి ముంబై శివారుల్లో శ్రీరాముడి నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. మరో వర్గం టపాసులు పేల్చింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ అధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు
Comments
Please login to add a commentAdd a comment