లోక్‌సభ ఎన్నికల తరుణంలో మహరాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు.
గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంఎన్ఎస్ నేత రాజ్‌ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్ థాకరే బీజేపీ, ఏక్‌నాథ్ షిండే - శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పక్షాల కూటమి ‘మహాయుతి’లో చేరవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ తరుణంలో ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌థాకరే కీలక ప్రకటన చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్ పోటీ చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మద్దతు కోరారు.
నాకు పదవులొద్దు
నాకు రాజ్యసభ, విధానసభ పదవులు వద్దని ఫడ్నవీస్‌తో చెప్పాను. అంతేకాదు నేను ఎటువంటి అంచనాలు, షరతులు లేకుండా ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నానని రాజ్ థాకరే అన్నారు. కాగా, ఎంఎన్‌ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు.
Comments
Please login to add a commentAdd a comment