సోలాపూర్: జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. లాడ్‌కీ బహీన్ పథకం ప్రయోజనాలు మహా కూటమి అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి ప్రభుత్వానికి మహిళా ఓటర్లు భారీగా పట్టం కట్టారని స్పష్టం అవుతోంది. జిల్లాలోని ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ నాలుగు.. శివసేన యూబీటీకి చెందిన ఒకరు అలాగే షేకాపాకు చెందిన ఒకరు గెలుపొందారు.
అక్కల్‌కోట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సచిన్ కల్యాణ్ శెట్టి 49 వేల 572 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామ్ మెత్రే పరాభవం చెందారు. భార్షీ నియోజకవర్గం నందు శివసేన యూబీటీకి చెందిన దిలీప్ సోపల్ 6,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఏక్‌నాథ్ శిందేకు చెందిన అభ్యర్థి రాజేంద్ర రౌత్ పరాభవం చెందారు. కరమాల నియోజకవర్గం నందు శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున నారాయణ పాటిల్ 16 వేల 85 ఓట్ల ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. ఆయన తన ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్ శిందేను ఓడించారు. మాడ నియోజకవర్గంలోని అభిజిత్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున పోటీ చేసి 30 వేల 621 ఓట్ల అధిక్యంతో విజయం పొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి రంజిత్ శిందేను ఓడించారు. మోహల్ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరఫున పోటీ చేసిన రాజు కర్రే 30 వేల రెండు వందల రెండు ఓట్లతో విజయం సాధించారు. ఇచ్చట సిట్టింగ్ ఎమ్మెల్యే యశ్వంత్ మానే ఓటమి పాలయ్యారు.
ఇదీ చదవండి: ఐపీఎల్ 2025 వేలం : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
పండరీపూర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన సమాధాన్ అవతాడే 8 వేల 65 ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి భగీరథ బాలికేను ఓడించారు. సోలాపూర్ సిటీ నార్త్ నియోజకవర్గం ద్వారా బీజేపీకి చెందిన విజయ్ దేశ్‌ముఖ్ 51 వేల 88 ఓట్ల మెజారీ్టతో వరుసగా ఐదవసారి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థి మహేశ్ కోటేను ఓడించారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దేవేంద్ర కోటే 40 వేల 657 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఫారూక్ షాబ్దిని ఓడించారు. సాంగోల నియోజకవర్గంలో షేత్కారి కామ్‌గార్ పారీ్టకి చెందిన బాబాసాహెబ్ దేశ్‌ముఖ్ 25 వేల 386 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన ప్రత్యర్థి ఏక్‌నాథ్ శిందే శివసేనకు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు షాహాజీ బాపు పాటిల్‌ను ఓడించారు. మాల్ శిరస్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఉత్తం ఝాన్కర్ 137 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్‌సాత్ పూతేను ఓడించారు.
ఆరు స్థానాల్లో బరిలోకి బీజేపీ అభ్యర్థులు.. ఐదు స్థానాల్లో గెలుపు
Comments
Please login to add a commentAdd a comment