Women Voters
-
రసవత్తరంగా ఢిల్లీ రణం
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది. 1993 నవంబర్‌లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. 1998 నవంబర్‌లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్‌సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు. పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది. ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. చిరకాలంగా లోక్‌సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్‌కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది. నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్‌లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి. -
ఓటేసిన మహిళలు 25 శాతం పెరిగారు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అక్షరాస్యత రేటులో ఒక శాతం పెరుగుదలతో ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 25 శాతం పెరిగింది. ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇవే కాకుండా వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని నివేదిక తెలిపింది. 2019తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 1.8 కోట్లు పెరిగింది. వీరిలో అక్షరాస్యత శాతం పెరగడం వల్ల 45 లక్షల మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి అక్షరాస్యత రేటుతో పాటు ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి ఉపాధి పథకాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దీని కారణంగా సుమారు 36 లక్షల మంది మహిళా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. పరిశుభ్రత కూడా ఒక కీలక అంశంగా మారి, మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రభావితం చేసింది. పరిశుభ్రత ప్రచారం, దాని ప్రభావం కారణంగా మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 21 లక్షలు పెరిగిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఇవే కాకుండా స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలు కూడా మహిళా ఓటర్లపై సానుకూల ప్రభావం చూపాయి. అయితే వీటి వల్ల ఓటు వేయాలనే స్ఫూర్తిని పొందిన మహిళల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఎన్నికలలో మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో మహిళలకు గృహ యాజమాన్య హక్కులు కూడా ముఖ్యమైనవిగా పరిగణించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది మహిళా ఓటర్లు పెరిగారు. పీఎం ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్లలో 74 శాతం మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వారిని ప్రేరేపించింది. విద్య, ఉపాధి, ప్రాథమిక అవసరాలపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియలోవారి భాగస్వామ్యాన్ని పెంచవచ్చని నివేదిక పేర్కొంది. -
రాష్ట్ర ఓటర్లు 4,14,40,447
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,40,447 అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాకు సవరణ అనంతరం తుది జాబితాను ఆయన సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో పురుషులకన్నామహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. సర్విసు ఓటర్లతో కలిపి పురుష ఓటర్లు 2,03,52,816 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,10,84,231 మంది ఉన్నారు.3,400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 4,86,226 కాగా, తుది జాబితాలో 5,14,646కు పెరిగింది. దివ్యాంగ ఓటర్లు 5,18,383 మంది ఉన్నారు. ఓటర్లు, జనాభా నిష్పత్తి 719గా ఉంది. లింగ నిష్పత్తి 1039గా ఉంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,64,184 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,73,388 మంది ఓటర్లు ఉన్నారు. సర్విసు ఓటర్లు ముసాయిదా జాబితాలో 67,143 ఉండగా తుది జాబితాలో 66,690 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,397. -
మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు!
సోలాపూర్: జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. లాడ్కీ బహీన్ పథకం ప్రయోజనాలు మహా కూటమి అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి ప్రభుత్వానికి మహిళా ఓటర్లు భారీగా పట్టం కట్టారని స్పష్టం అవుతోంది. జిల్లాలోని ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ నాలుగు.. శివసేన యూబీటీకి చెందిన ఒకరు అలాగే షేకాపాకు చెందిన ఒకరు గెలుపొందారు. అక్కల్కోట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సచిన్ కల్యాణ్ శెట్టి 49 వేల 572 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామ్ మెత్రే పరాభవం చెందారు. భార్షీ నియోజకవర్గం నందు శివసేన యూబీటీకి చెందిన దిలీప్ సోపల్ 6,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఏక్నాథ్ శిందేకు చెందిన అభ్యర్థి రాజేంద్ర రౌత్ పరాభవం చెందారు. కరమాల నియోజకవర్గం నందు శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున నారాయణ పాటిల్ 16 వేల 85 ఓట్ల ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. ఆయన తన ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్ శిందేను ఓడించారు. మాడ నియోజకవర్గంలోని అభిజిత్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున పోటీ చేసి 30 వేల 621 ఓట్ల అధిక్యంతో విజయం పొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి రంజిత్ శిందేను ఓడించారు. మోహల్ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరఫున పోటీ చేసిన రాజు కర్రే 30 వేల రెండు వందల రెండు ఓట్లతో విజయం సాధించారు. ఇచ్చట సిట్టింగ్ ఎమ్మెల్యే యశ్వంత్ మానే ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ఐపీఎల్ 2025 వేలం : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?పండరీపూర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన సమాధాన్ అవతాడే 8 వేల 65 ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి భగీరథ బాలికేను ఓడించారు. సోలాపూర్ సిటీ నార్త్ నియోజకవర్గం ద్వారా బీజేపీకి చెందిన విజయ్ దేశ్‌ముఖ్ 51 వేల 88 ఓట్ల మెజారీ్టతో వరుసగా ఐదవసారి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థి మహేశ్ కోటేను ఓడించారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దేవేంద్ర కోటే 40 వేల 657 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఫారూక్ షాబ్దిని ఓడించారు. సాంగోల నియోజకవర్గంలో షేత్కారి కామ్‌గార్ పారీ్టకి చెందిన బాబాసాహెబ్ దేశ్‌ముఖ్ 25 వేల 386 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన ప్రత్యర్థి ఏక్నాథ్ శిందే శివసేనకు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు షాహాజీ బాపు పాటిల్‌ను ఓడించారు. మాల్ శిరస్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఉత్తం ఝాన్కర్ 137 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్సాత్ పూతేను ఓడించారు. ఆరు స్థానాల్లో బరిలోకి బీజేపీ అభ్యర్థులు.. ఐదు స్థానాల్లో గెలుపు -
USA Presidential Elections 2024: లేడీస్ అండ్ జెంటిల్మెన్!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్నాయి. పురుష ఓటర్లలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కే భారీ ఆదరణ కన్పిస్తుండగా మహిళలు మాత్రం డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ వైపే మొగ్గుతున్నారు. అగ్రరాజ్యంలోనూ రాజకీయంగా నెలకొని ఉన్న లింగ వివక్షను ఇది ప్రతిబింబిస్తోంది. ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కూడా ఈ అంశం కీలకంగా మారింది. హారిస్ తొలినుంచీ ఇలాంటి గుర్తింపు రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఎక్కడా తను మహిళను కనుక ఓటేయండని కోరలేదు. దాన్ని ప్రచారాంశంగా మలచుకునే ప్రయత్నమూ చేయలేదు. జాతి, జెండర్‌తో నిమిత్తం లేకుండా అమెరికన్లందరి శ్రేయస్సు కోసం పని చేయడానికి తానే సమర్థురాలినని నమ్ముతున్నట్టు పలు ఇంటర్వ్యూల్లో హారిస్ స్పష్టం చేశారు కూడా. అలా జెండర్‌ను తటస్థంగా ఉంచడానికి ఆమె ఎంత ప్రయత్నించినా అది ప్రధానాంశంగానే ఉంటూ వస్తోంది. ఎందుకంటే ‘మేడం ప్రెసిడెంట్’ అనేది అమెరికాకు చాలా కొత్త విషయం. ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా అత్యున్నత పీఠాన్ని అధిరోహించింది లేదు. ఈ నేపథ్యంలో హారిస్ ప్రెసిడెంట్ అవడమనే ఆలోచననే చాలామంది ఓటర్లు ఇష్టపడుతున్నారు. పలువురు అమెరికన్లు మాత్రం ఈ తరహా కొత్తదనాన్ని ఇబ్బందికరంగా భావిస్తున్నారు. బహిరంగ రహస్యమే హారిస్ తన ప్రచారంలో ఎక్కడా జెండర్ విషయాన్ని ప్రస్తావించకపోయినా లైంగికత అనేది అమెరికా సమాజంలోనే అంతర్లీనంగా దాగుందని, అధ్యక్షురాలిగా ఓ మహిళకు ఓటేయడానికి చాలామందికి ఇదో అడ్డంకిగా కనిపిస్తోందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రచార బృందం కూడా పైకి జెండర్‌తో సంబంధం లేదని చెబుతున్నా, ‘‘హారిస్ బలహీనురాలు. నిజాయితీ లేని వ్యక్తి. ప్రమాదకరమైన ఉదారవాది’’ తరహా ప్రచారంతో ఊదరగొడుతోంది. అమెరికా ప్రజలు ఆమెను తిరస్కరించడం ఖాయమంటోంది. అంతేగాక అధ్యక్ష అభ్యర్థుల్లోని ఈ లింగపరమైన తేడా తమకే లాభిస్తుందని ట్రంప్ ప్రచార బృందం సీనియర్ సలహాదారు బ్రయాన్ లాంజా బాహాటంగానే అన్నారు. ఫలితంగా ట్రంపే గెలుస్తారని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు. ‘మీటూ’ ప్రభావమెంత? సమాజంలో తన స్థానంపై మహిళల దృక్కోణంలో 2016 నుంచి పెను మార్పులొచ్చాయి. 2017లో ‘మీ టూ’ ఉద్యమం పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వివక్షపై సమాజంలో అవగాహనను ఎంతో పెంచింది. మహిళల గురించి మాట్లాడే విధానాన్నీ మార్చింది. కానీ భిన్నత్వం, సమానత్వం, సమ్మిళితం వంటి అంశాల్లో అంతటి పెద్ద ముందడుగును జీరి్ణంచుకునే స్థితిలో అమెరికా సంప్రదాయ యువకులు లేరు. దీన్ని కేవలం తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా వారు భావిస్తున్నారు. అధ్యక్ష రేసులో లింగ అంతరం ప్రారంభమైందన్న సీబీఎస్ న్యూస్ పోల్ తాజా ఫలితాలు ఇందుకు అద్దం పట్టేవే. అమెరికాలో పురుషులు ప్రధానంగా ట్రంప్ మద్దతుదారులుగానే ఉన్నారు. హారిస్‌ను బలమైన నేతగా చూసే పురుషులు కూడా తక్కువగా ఉన్నారు. యువకులు చాలావరకు ట్రంప్, ఎలాన్ మస్క్ ‘బ్రో కల్చర్’లో నిండా మునిగి తేలుతున్నారు. ‘‘డెమొక్రాట్లు ఎంతసేపూ మహిళలు, గర్భస్రావ హక్కులు, ఎల్జీటీబీక్యూ సంస్కృతి గురించే మాట్లాడుతున్నారు. మరి మా పరిస్థితేమిటి?’’ అన్నది అమెరికా యువత నుంచి గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న. దీన్ని డెమొక్రాట్ల పాలిట డేంజర్ బెల్గా విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు! ఎంతో అంతరం అమెరికా పురుషుల్లో 51 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తుండగా హారిస్‌కు 45 శాతం మాత్రమే సానుకూలంగా ఉన్నట్టు ఇటీవలి సీఎన్ఎన్ జాతీయ ఓటర్ల సర్వే తేలి్చంది. హార్వర్డ్ యూత్ పోల్‌లో 30 ఏళ్ల లోపు మహిళల్లో హారిస్ ఏకంగా 47 శాతం ఆధిక్యంలో ఉన్నారు. అదే 30 ఏళ్లలోపు పురుషుల్లో ఆమెకు మద్దతిస్తున్నది కేవలం 17 శాతమే. దీంతో హారిస్ ప్రస్తుతం ఈ అంతరాన్ని తగ్గించే పనిలో పడ్డారు. గత వారాంతంలో స్వింగ్ స్టేట్స్‌లోని పురుషులను లక్ష్యంగా చేసుకుని కొత్త ప్రకటనలకు తెరతీశారు. ‘బీ ఏ మాన్.. ఓట్ ఫర్ ఉమన్’ వంటి నినాదాలను నమ్ముకున్నారు. హారిస్ రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ ప్రచార కూడా పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, డిజిటల్ మీడియా కంటెంట్‌తో పురుష ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ట్రంప్ మాత్రం మరిన్ని ఇంటర్వ్యూలతో పురుష ఓటర్లకు మరింత దగ్గరవుతున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ‘లేడీస్ అండ్ జంటిల్మెన్’, ‘బాయ్స్ అండ్ గాళ్స్’ డిసైడ్ చేయబోతున్నారు. ఆ లెక్కన అమెరికన్ల జీవితంలో మహిళల పాత్రపై దీన్ని రెఫరెండంగా కూడా భావించొచ్చేమో! ‘పురుష నిస్పృహ’.. ట్రంప్ ఆయుధం! అమెరికాలో యువతులతో పోలిస్తే యువకుల తీరు తీసికట్టుగానే ఉన్నట్టు గణాంకాలన్నీ చెబుతున్నాయి. కళాశాలలో యువకులు తక్కువగా చేరుతున్నారు. సమాజంతో సంబంధాలను కొనసాగించడమూ తక్కువే. ఆత్మహత్య రేటూ వారిలోనే ఎక్కువ. యువతులు బాగా చదువుకుంటున్నారు. సేవా రంగంలో రాణిస్తున్నారు. యువకులతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక యువకుల కంటే యువతులే బాగా ఉదారంగా మారినట్టు గాలప్ పోలింగ్ బృందం తెలిపింది. అయితే ఇవన్నీ అమెరికా సమాజంలో లింగ విభేదాలను మరింతగా పెంచేందుకే దోహదపడుతుండటం చింతించాల్సిన విషయమే. యువత అసంతృప్తులను ట్రంప్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రచారం చివరి రోజుల్లో ఈ పురుష నిస్పృహపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ‘పురుషత్వం దాడికి గురవుతోంది’ అనే హెచ్చరికను తన సోషల్ మీడియా టూల్ ట్రూత్‌లో తిరిగి పోస్ట్ చేశారు.హిల్లరీకీ ఇదే పరిస్థితి!అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ హోరాహోరీ పోరులో హిల్లరీ ఓటమికి లింగ వివక్ష, స్త్రీల పట్ల అమెరికా సమాజంలో దాగున్న వ్యతిరేకత కూడా కారణమైంది. అప్పుడు కూడా ప్రధాన ప్రత్యరి్థ, అధ్యక్ష పోరులో అంతిమ విజేత ట్రంపే కావడం విశేషం. ఈసారి వివక్ష కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నా మరోసారి గెలుపోటములను నిర్ణయించే కీలకాంశం కావచ్చన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి!1920లో మహిళలకు ఓటు హక్కు అమెరికా మహిళలు తొలిసారిగా 1920 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వారెన్ జి.హార్డింగ్ మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు అనిశ్చితి నుంచి దేశం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఆ ‘సాధారణ స్థితి’ అంటే ఏమిటో 100 ఏళ్లు గడిచినా సగటు అమెరికన్లకు అర్థం కావడం లేదు. 2024లో కూడా అమెరికన్ అంటే ‘పురుషుడా, లేక మహిళా?’ అనే ప్రశ్న అడుగడుగునా తలెత్తుతూనే ఉంది. చారిత్రికంగా తెల్లజాతి పితృస్వామ్యంలో నిండా మునిగి తేలుతూ వస్తున్న అగ్ర రాజ్యం ఇప్పుడు తమ నాయకురాలిగా నల్లజాతీయురాలైన మహిళను నామినేట్ చేసింది. ఫలితంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. 1920తో పోల్చుకుంటే ఆర్థిక, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందినా అమెరికా మహిళలు ఇప్పటికీ తమ శరీరాలపై హక్కులు తదితరాల కోసం పోరాడాల్సే వస్తోంది. రాజకీయంగా పోటీని మరింత బలంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది... మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్‌కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. రాజస్తాన్‌లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్‌లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ! -
బరితెగించిన టీడీపీ నేతలు
కొలిమిగుండ్ల/వీరపునాయునిపల్లె/చింతకొమ్మ దిన్నె/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/చిల్లకూరు (తిరుపతి జిల్లా)/గంగాధర నెల్లూరు (చిత్తూరు జిల్లా): ఎన్నికల ముంగిట టీడీపీ నాయకులు బరితెగించారు. ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో దింపుడుకళ్లెం ఆశతో ప్రలోభాలకు పాల్పడుతున్నారు. కనీసం పరువైనా దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లకు భారీ ఎత్తున నగదు, మద్యం, బియ్యం బస్తాలను ఎరవేస్తున్నారు. మహిళా ఓటర్లకు చీరలు, ముక్కుపుడకలు, వెండి భరిణెలు పంపిణీ చేస్తూ ప్రలోభపెడుతున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పలు రకాల తాయిళాలు ఎరవేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. తద్వారా నిర్భీతిగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. 300 మందికిపైగా ముక్కుపుడకలు.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతో ఓటమి ఖాయం అని భావించిన టీడీపీ నేతలు నగదు పంచారు. అయినా ఫలితం లేకపోవడంతో కల్వటాలలో ఆదివారం మహిళా ఓటర్లకు 300 మందికిపైగా ముక్కుపుడకలను పంపిణీ చేశారు. మరికొన్ని గ్రామాల్లో చీరలు అందజేశారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యు.రాజుపాలెం, తాటిమాకులపల్లె సమీపంలోని అరటి తోటలో నాలుగు వందల చీరల బస్తాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బస్తాలపై టీడీపీ నేతలు ఎన్.వేణుగోపాల్, ఎం.నాగరాజు పేర్లు ఉన్నాయి.వీరిద్దరూ ఓటర్లకు పంపిణీ చేసేందుకు అరటితోటలో చీరలు దాచి ఉంచారని తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కడప సమీపంలోని ఊటుకూరు వద్ద 250 బియ్యం బస్తాలతో వెళుతున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వీటిని టీడీపీ నేత డాక్టర్ కృష్ణకిషోర్‌రెడ్డికి చెందినవిగా గుర్తించారు. ఈ బియ్యాన్ని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లి పంచాయతీ పరిధిలో ఓటర్లకు పంచేందుకు తీసుకెళుతున్నారు.ఆటోను, బియ్యం బస్తాలను విడిపించుకునేందుకు పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ నేత కృష్ణ కిషోర్‌రెడ్డి, ఆయన అనుచరులు హల్చల్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు çపంపిణీ చేసే స్లిప్పులపైన టీడీపీ పథకాలను ఆ పార్టీ నేతలు ముద్రించి అందజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.1,500 విలువైన వెండి భరిణెల పంపిణీ శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఇంటింటికీ రూ.వెయ్యి నగదు, రూ.1,500 విలువైన వెండిభరిణెలు పంపిణీ చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ నాయకులు ఒక్కో ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేల వరకు అందించారు. మద్యాన్ని కూడా ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు.బీజేపీ అభ్యర్థికి చుక్కెదురు తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్‌రావుకు చుక్కెదురైంది. చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రచార పర్వం ముగిశాక కూడా ఓటర్లను కలుసుకుని ఇలా ప్రలోభాలకు గురి చేయడం సబబుగా లేదని వెళ్లిపోవాలని కోరారు. దీంతో వరప్రసాద్‌రావు అక్కడ నుంచి జారుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులను స్కాన్ చేస్తే రూ.500 తీసుకోవచ్చని ప్రలోభపెడుతున్నారు. -
డిసైడ్ చేసేది.. ఆమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేపు జరగనున్న ఎన్నికల్లో ‘విజేత’ను మహిళలే నిర్ణయించబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 స్థానాల్లో మహిళా ఓటర్లదే పై చేయి. ఇందులో ఏకంగా 70 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా నాలుగు వేల నుంచి పది వేలకు పైగా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో విజేతల తలరాతను మహిళా ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో మహిళల నిష్పత్తి పెరుగుతూనే ఉంది.2014తో పోల్చి చూస్తే 2019లో మహిళా ఓటర్ల పోలింగ్ కూడా భారీగా పెరిగింది. అదేవిధంగా ఈ నెల 13న అసెంబ్లీకి, లోక్‌సభకు జరిగే పోలింగ్‌లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. పోలింగ్‌లో పాల్గొనే మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో రాష్ట్రంలో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న యువతులు దాదాపు నాలుగు లక్షల మంది తమ ఓట్లు నమోదు చేసుకున్నారు.2019లో మాదిరిగానే ఈసారి కూడా పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని చోట్లా పెద్ద ఎత్తున మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాల లబ్ధిదారుల్లో కూడా మహిళలే అత్యధికంగా ఉన్నందున.. వారంతా ‘ఫ్యాన్’కు ఓటు వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు.మహిళా కూలీల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు, గృహిణులు, యువతులు వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే వాతావరణం అన్ని నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో పాటు సొంతింటి కల నెరవేరిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘నవరత్నాల ద్వారా మహిళలకు ఏకంగా రూ.2,83,866.33 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది.ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,89,519.07 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347.26 కోట్లు ప్రయోజనం చేకూరింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీకి బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. అందువల్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. -
ఆ ఓటర్లే కీలకం..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి.పోస్టల్, హోం ఓటింగ్ కీలకం..రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు.కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.పోలింగ్ శాతం పెరగాల్సిందే..ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు.యువ ఓటర్లకు గాలం!ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు.ఆమే.. అధికం!ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్‌లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు.ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్‌ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది. -
లింగసమానత్వమే మహిళల ఎజెండా
మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, పురుషుల భాగస్వామ్యాన్ని మహిళా ఓటర్ల సంఖ్య అధిగమించింది. రానున్న సాధారణ ఎన్నికల్లో దాదాపు 47 కోట్ల మంది మహిళలు ఓటు వేయనున్నట్లు భారత ఎన్నికల సంఘం అంచనా వేసింది. మగవారి ఆదేశాల మేరకే మహిళలు ఓటు వేస్తారనే భావన క్రమంగా తన విలువను కోల్పోతోంది. పూర్తి స్పృహతో వారి ఎంపికలు ఉంటున్నాయి. సమానత్వం, గౌరవ ప్రదమైన జీవితం తప్ప మహిళలకు మరేదీ అంగీకారం కాదు. వీటిని సాధించే జెండర్ మేనిఫెస్టో తక్షణావసరం. లింగ సమాన ప్రపంచాన్ని సాధించ డానికి కొత్త పుంతలు తొక్కాలనే సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు. భారతదేశం సార్వత్రిక ఎన్నికల వైపు వెళుతున్నందున, నేను గత కొన్ని వారాలుగా మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులతో మాట్లాడి తదుపరి ప్రభుత్వంపై వారి అంచనాలను జెండర్ మేనిఫెస్టోలో పొందుపరిచాను. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 ప్రకారం, భారతదేశం ప్రస్తుతం లింగ సమానత్వంలో 146 దేశాలలో 127వ స్థానంలో ఉంది. ఈ విషయంలో కొన్ని చిన్న, కొన్ని భారీ అడుగులు పడ్డాయి. కానీ ఇది సరిపోదు. రాజ్యాంగ ప్రవేశిక పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమా నత్వానికి కట్టుబడి ఉంది. భారతదేశ జనాభాలో సగానికి పైగా, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఇప్పటికీ ఈ ప్రాథమిక హామీలను పొందేందుకు కష్టపడుతున్నారు. జెండర్ మేనిఫెస్టో కోసం సంప్రదింపుల ప్రక్రియను మొత్తంగా చూస్తే, భారతదేశంలోని మహి ళలు సమానత్వం, గౌరవప్రదమైన జీవితాన్ని తప్ప మరేమీ కోరు కోవడం లేదని స్పష్టమైంది. హక్కుల కోసం పోరాడాలా? చారిత్రకంగా నేరపూరితమైన సంచార, డీనోటిఫైడ్ తెగల (నేరస్థ తెగల చట్టం నుండి మినహాయించిన) జనాభాలో ఎక్కువ మందికి, ప్రత్యేకించి మహిళలకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఇప్పటికీ, వారి ‘మృత పేర్లను‘ (లింగ పరివర్తన తర్వాత ఉపయోగంలో లేనటువంటి వారి పుట్టుక పేర్లు) కలిగి ఉన్న రాతపనిని నవీకరించడానికి అధిగమించలేని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి గుర్తింపు హక్కు చాలా కాలంగా నిరాకరించబడింది. 2024లో, ఉనికిలో ఉండే హక్కు ఏ వ్యక్తికైనా పోరాటం కాకూడదు. అన్ని వర్గాలకు చెందిన మహిళలు, ఎల్జీబీటీక్యూ+ వ్యక్తుల ఆశలు, ఆశయాలను గుర్తించే జెండర్ ఎజెండాను అనుసరించడం మన రాజ కీయ పార్టీల కర్తవ్యం కావాలి. ఈ ఎజెండా కోసం ఇక్కడ కొన్ని సిఫార్సులు: రాజ్యాంగం సమానత్వానికి హామీ ఇస్తుండగా, లింగ నిర్ధారిత కోణం నుండి చూసినప్పుడు వ్యక్తిగత హక్కులు తక్కువగా ఉంటున్నాయి. వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు పౌరులకు లేదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎల్జీబీటీక్యూ+ వ్యక్తులకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కును తిరస్కరించినట్లయితే మనం సమానత్వాన్ని ప్రకటించుకోలేం. వీలైనంత త్వరగా పార్లమెంటు దీనిపై చట్టం చేయాలి. ప్రతిరోజూ, మహిళలు తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ఇంట్లో ప్రారంభమవుతాయి. శిక్షాస్మృతిలో వైవాహిక అత్యాచారం మినహాయింపుగా ఉండటం అనాలోచితం. తదుపరి ప్రభుత్వం ఈ చట్టాన్ని తొలగించి, లింగ ఆధారిత హింస పట్ల జీరో–టాలరెన్స్(ఏమాత్రం సహించని) విధానాన్ని అనుసరించాలి. చాలామంది మహిళలు డీప్ ఫేక్ (మార్ఫింగ్ వీడియోలు), ఆన్ లైన్ దుర్వినియోగం పట్ల ఉన్న వారి భయాల గురించి నాతో మాట్లా డారు. పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత శాంతి భద్రతల యంత్రాంగాలు తగినంతగా సన్నద్ధంగా లేవు. మహిళలు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో సురక్షితంగా ఉండేలా చేయడానికి వీటిని తప్పనిసరిగా సంస్కరించాల్సి ఉంది. లింగ అపోహలు తొలగాలి అన్నిరకాల సామాజిక కలయికలు పెరగాలంటే, లింగ అపోహలను వదిలించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తమ పరిసరాలలో లింగ పరమైన సామాజికీకరణ కారణంగా పితృస్వామ్య పద్ధతులను అవలంబిస్తారు. లింగపరమైన మూస పద్ధతులను తొలగించడానికి పాఠశాల పాఠ్యపుస్తకాలను సమీక్షించడం, తిరగరాయడం తక్షణ అవసరం. అదనంగా, లింగపరమైన సున్నితత్వాన్ని బోధించే వర్క్ షాప్‌లను పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చాలి. తరువాత, పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత అని మనం గుర్తించాలి. అన్ని అధికారిక సంస్థలలో వేతన చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవును తప్పనిసరి చేయాలి. ఒక దృష్టాంతాన్ని నెలకొల్పడానికి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ‘క్రెష్’(శిశు సంరక్షణ కేంద్రం)లను కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా పనిచేసే తల్లిదండ్రులు, లింగ భేదం లేకుండా పిల్లల సంరక్షణలో పాల్గొనేలా చేయాలి. కోవిడ్ తర్వాత, ఆరోగ్య హక్కుపై ఎక్కువ దృష్టి పడింది. అయితే, మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆరోగ్య హక్కును కీలకమైనదిగా పరిగ ణించాలి. లింగపరమైన దృష్టితో విధానాలను రూపొందించాలి. గత కేంద్ర బడ్జెట్లో, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరిగా రొమ్ము, గర్భా శయ క్యాన్సర్‌కు ఉచిత పరీక్షలు చేయాలి. ఇంకా, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ద్రవ్యోల్బణంతో సరిపోయేలా ఆర్థిక సహాయాన్ని తప్పనిసరిగా పెంచాలి. మహిళలకు ఆర్థిక శ్రేయస్సును అందించడం తదుపరి ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సవాలు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు నిర్దిష్ట నిధులను తప్పనిసరిగా కేటాయించాలి. మహిళా రైతులను గుర్తించకపోవడం, తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం మహిళలకు సంబంధించినంతవరకు రెండు ప్రధాన బాధాకరమైన అంశాలు. తదుపరి ప్రభుత్వం మహిళా రైతుల హక్కుల బిల్లు, 2011ను తప్పనిసరిగా అమలులోకి తేవాలి. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలను, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో అమలు చేయాలి. తమ సిబ్బందిలో 20 శాతం కంటే ఎక్కువ మంది మహిళలను నియమించుకునే సంస్థలకు పన్ను రాయితీలు మంజూరు చేయడం ఒక మార్గం. ప్రభుత్వం అతిపెద్ద ఉద్యోగ కల్పనా దారులలో ఒకటి కాబట్టి, 30 లక్షలుగా అంచనా వేసిన ప్రస్తుత ఖాళీ స్థానాలను త్వరగా భర్తీ చేయాలి. ఈ ఉద్యోగాలకు మహిళా రిజర్వేషన్ ను తప్పనిసరిగా విస్తరించాలి. చట్టం చేయాల్సిన ఆవశ్యకత భారతదేశంలో మహిళల రాజకీయ హక్కులకు సంబంధించి గత సంవత్సరం చాలా ముఖ్యమైనది. మూడు దశాబ్దాలకు పైగా జరిగిన ఉద్యమాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వానికి దృఢ సంకల్పం ఉంటే లింగ సమానత్వం వైపు చరిత్రాత్మక అడుగు వేయవచ్చని ఇది సూచిస్తోంది. అయితే, చట్టం అమలులో లేకపోవడం మనందరినీ నిరాశకు గురిచేస్తోంది. రాబోయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ను వీలైనంత త్వరగా అమలు చేసేలా చూడాలి. ఇది జనాభా లెక్కలను పూర్తి చేయడానికి లోబడి ఉండ కూడదు. పైగా, ప్రాతినిధ్యం అనేది ఎగువ మరియు దిగువ సభలు రెండింటిలోనూ ప్రతిబింబించే ఆదర్శం. రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సి ల్లలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు రిజర్వేషన్ల నిబంధనలపై పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలి. భారతదేశం లింగ సమానత్వాన్ని సాధించడానికి ఒక శతాబ్దానికి పైగా కాలం పడుతుంది. గత స్త్రీవాద ఉద్యమాలు మన ప్రధాన లక్ష్యాల సాధనలో పట్టుదలతో కొనసాగుతూనే, చిన్నపాటి విజయా లను జరుపుకోవాలని బోధించాయి. పైన పేర్కొన్న సిఫార్సులు కీలక మైనవి, దూరదృష్టితో కూడుకున్నవి. ముఖ్యంగా, తదుపరి ప్రభుత్వా నికి దాని పదవీకాలంలోనే సాధించదగినవి. మనకు కావలసిందల్లా లింగ–సమాన ప్రపంచాన్ని సాధించడానికి కొత్త పుంతలు తొక్కాలనే నిస్సందేహమైన సంకల్పం మాత్రమే. ఏంజెలికా అరిబమ్ వ్యాసకర్త ‘ఫెమ్మె ఫస్ట్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు -
సార్వత్రిక ఎన్నికల నగారా : మహిళా ఓటర్ల జోరు!
దేశంలో ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక జరగనున్న ఎన్నికలు, లోక్‌సభ - 2024 ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్(rajiv kumar) శనివారం ప్రకటించారు. మూడు దశల్లో రాష్ట్రాల ఎన్నికలు, ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది 1.89 కోట్ల మంది తొలి సారి ఓటర్లుగా నమోదయ్యారని వీరిలో 85 లక్షల మంది మహిళలు ఉన్నారని కూడా ఆయన వెల్లడించారు. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కిం, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. అలాగే పలు రాష్ట్రాల్లోని మహిళా పురుష ఓటర్ల నిష్పత్తి గణాంకాల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రతీ పౌరుడు తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని సూచించారు. హింసను వ్యాపింపజేసే వారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని కుమార్ హెచ్చరించారు. ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట వెలుగొందేలా రక్తపాతానికి, హింసకు తావులేకుండా ఈ ఎన్నికలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది. సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటన ప్రకారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా 96.8 కోట్లుగా ఉంది. వీరిలో 48వేల మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదయ్యారు. అలాగే 1.8 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. అలాగే 20 - 29 ఏళ్ల మధ్య వయస్సు గల వారు 19.47 కోట్ల మంది ఉన్నారు. దేశంలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇది కాకుండా 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా, 19.74 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. అలాగే దేశంలో 82 లక్షలకు పైగా వృద్ధ ఓటర్లు ఉన్నారు. 2023లో 940 నుంచి 2024లో 948కి లింగ నిష్పత్తి పెరిగిందని ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు 1.5 కోట్ల మంది సిబ్బందితో పాటు 55 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఈసీ 17 లోక్‌సభ ఎన్నికలు, 16 రాష్ట్రపతి ఎన్నికలు, 400కి పైగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిందని కుమార్ తెలిపారు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, తృణమూల్ కాంగ్రెస్ 22, బీఎస్పీ 10, ఎన్సీపీ 5, సీపీఐ-ఎం 3, సీపీఐ 2 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
నిర్ణయాధికారం ‘ఆమె’దే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
మహిళా ‘ముద్ర’
సాక్షి, అమరావతి: దేశ ఎన్నికల క్షేత్రంలో మహిళల పాత్ర పెరుగుతోంది. స్త్రీ శక్తి మద్దతు లేనిదే ఏ పార్టీ లేదా ఏ నాయకుడూ విజయం సాధించలేరన్నంతగా ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఆ తర్వాత 2029 నుంచి స్త్రీలదే ఆధిపత్యం. ఇది మహిళలు సాధించిన సాధికారత. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించిన విషయమిది. 1951 నుంచి ఎన్నికల పోలింగ్ శాతం సరళితో 2047 వరకు పోలింగ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుందో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వివరించింది. 2014 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో పురుషులకన్నా మహిళా ఓటర్లు తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల పోలింగ్‌లో పురుష ఓటర్లు 67.01 శాతం ఓట్లేయగా, మహళా ఓటర్లు 67.18 శాతం పాల్గొన్నట్లు ఆ నివేదిక తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్లతో మహిళా ఓటర్లు దాదాపుగా సమానంగా ఉంటారని పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి 2047 ఎన్నికల వరకు మహిళా ఓటర్లదే హవా. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే వారి సంఖ్య 68 కోట్లకు చేరుతుందని, అందులో 33 కోట్ల మహిళా ఓటర్లుంటారని అంచనా. ఇది మొత్తం పోలింగ్‌లో 49 శాతం. 2029 ఎన్నికల నుంచి పోలింగ్‌లో పాల్గొనే మహిళల సంఖ్య పెరుగుతూ పోతుందని, పురుష ఓటర్ల సంఖ్య తగ్గుతుందని నివేదిక వెల్లడించింది. 2024లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 67.6 శాతం ఓట్లు వేస్తారని, –2029లో ప్రతి 100 మంది మహిళా ఓటర్లలో 71.4 శాతం ఓట్లు వేస్తారని, 2047లో ప్రతి వంద మంది మహిళా ఓటర్లలో 86.3 శాతం ఓట్లు వేస్తారని నివేదిక తెలిపింది. 1951 ఎన్నికల్లో 8 కోట్ల మంది మాత్రమే ఓట్లు వేసినట్లు నివేదిక పేర్కొంది. 2009 ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య 42 కోట్లకు పెరగ్గా, ఇందులో 19 కోట్ల మంది మహిళలున్నారు. 2014 ఎన్నికల్లో 55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా అందులో 26 కోట్ల మంది మహిళలున్నారని నివేదిక తెలిపింది. 2019 ఎన్నికల్లో 62 కోట్ల మంది ఓట్లు వేయగా అందులో 30 కోట్ల మంది మహిళలని తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 68 కోట్ల మంది ఓట్లు వేస్తారని, అందులో 33 కోట్ల మంది మహిళా ఓటర్లుంటారని నివేదిక పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ సరళిని పరిశీలిస్తే 2029 ఎన్నికల్లో 73 కోట్ల మంది ఓట్లు వేస్తారని, ఇందులో 37 కోట్లు మహిళలుంటారని అంచనా వేసింది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు నమోదవుతారని అంచనా వేయగా అందులో 80 శాతం మంది.. అంటే 92 కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొంటారని అంచనా వేసింది. ఇందులో మహిళల ఓటింగ్ 55 శాతానికి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. మహిళా ఓటర్లదే పెద్ద పాత్ర భారత దేశ రాజకీయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, అలాగే లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గత దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నివేదిక వ్యాఖ్యానించింది. గతంలోకంటే ఇప్పడు ఎన్నికల్లో మహిళా ఓటర్లు చాలా పెద్ద పాత్ర పోషిస్తారని నివేదిక పేర్కొంది. 1991 నుంచి పురుష, మహిళా ఓటర్ల మధ్య అంతరం తగ్గుతూ వస్తోందని తెలిపింది. 1991లో ఈ అంతరం పది శాతానికి పైగా ఉండగా 1996 నుంచి 2004 వరకు నాలుగు ఎన్నికల్లో 8.4 శాతానికి తగ్గిందని తెలిపింది. గత ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ శాతం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో 23 ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 18 రాష్ట్రాల్లో పురుష ఓట్ల పోలింగ్ శాతం కన్నా మహిళా ఓట్ల పోలింగ్ శాతం అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. ఈ 18 రాష్ట్రాల్లో పది రాష్ట్రాల్లో అవే ప్రభుత్వాలు తిరిగి ఎన్నికయ్యాయని నివేదిక పేర్కొంది. -
AP: ఎన్నికల్లో కీలక శక్తిగా మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళలే కీలక శక్తిగా మారనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా 2023ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868. వీరిలో పురుష ఓటర్లు 1,97,59,489 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,21,455 మంది ఉన్నారు. అంటే 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్ల సంఖ్య 3,924గా ఉంది. మొత్తం 26 జిల్లాల్లో 22 జిల్లాల్లో పురుషులకంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 19,41,277 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,29,085 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,76,716 మంది ఓటర్లు ఉన్నారు. 2022తో పోలిస్తే తగ్గిన ఓటర్ల సంఖ్య గతేడాది తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 7,51,411 తగ్గింది. 2022 తుది జాబితాలో 4,07,36,279గా ఉన్న ఓటర్ల సంఖ్య 2023 జాబితా నాటికి 3,99,84,868కి పరిమితమయింది. కానీ, నవంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా జాబితా సవరణ తర్వాత నికరంగా ఓటర్ల సంఖ్య 1,30,728 పెరిగినట్లు మీనా తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా 5,97,701 మంది ఓటర్లు చేరితే 4,66,973 మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అదనంగా ఒక పోలింగ్ స్టేషన్ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 45,951 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 721 మందికి ఓటు హక్కు ఉండగా, లింగ నిష్పత్తి 1,027గా ఉంది. పెరిగిన తొలి ఓటు హక్కు వినియోగదారులు 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని ఓటర్లుగా చేర్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్లు ఉన్న తొలి ఓటు హక్కు వినియోగదారుల సంఖ్య 78,438గా ఉంటే తుది జాబితా నాటికి ఈ సంఖ్య 3,03,225కు చేరినట్లు మీనా తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయడమే కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని చెప్పారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగుల సంఖ్య 5,17,403గా ఉంది. ఈ తుది ఓటర్ల జాబితాను అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శుక్రవారం అందజేస్తామని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోలేకపోయినవారు ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చని, అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, సవరణలను ఫారం–8 ద్వారా చేయవచ్చని తెలిపారు. -
ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం
హిమాచల్ ప్రదేశ్. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఆ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా రోడ్డుపక్కన టీ కొట్టుల్లో, ఆలయాల వద్ద, ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళలే వ్యాపారాలు చేస్తూ కనిపిస్తారు. ఆర్థిక స్వాతంత్య్రం రాజకీయ చైతన్యం ఇష్టపడే మహిళలు ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అందుకే ప్రధాన పార్టీలన్నీ మహిళా ఓటర్లపై గాలం వేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడంలో మహిళలు అత్యంత కీలకంగా మారారు. రాష్ట్ర జనాభాలో 49% మంది మహిళలే ఉన్నారు. 1998 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని విశ్లేషిస్తే పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 55,92,828 ఉంటే వారిలో పురుష ఓటర్లు 28,54,945, మహిళా ఓటర్లు 27,37,845, థర్డ్ జెండర్ ఓటర్లు 38 ఉన్నాయి. స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తి జాతీయ సగటు కంటే హిమాచల్ ప్రదేశ్‌లో అధికం. ప్రతీ వెయ్యి మంది పురుషులకు జాతీయ స్థాయిలో 976 మంది మహిళలు ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 981 మంది ఉన్నారు. 18 నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి వెయ్యి దాటి ఉండడం విశేషం. ’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దేవేష్ కుమార్ వ్యాఖ్యానించారు. పోటీ పడి హామీలు అధికార బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక మేనిఫెస్టో స్త్రీ సంకల్ప పత్ర విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లయ్యే సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, ప్రాథమిక విద్య అభ్యసించే బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉన్నత విద్య అమ్మాయిలకు స్కూటీలు, మహిళా సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, ఆశావర్కర్ల జీతం రూ.4,700కి పెంపు వంటి హామీలు గుప్పించింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద 1.36 లక్షల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, రాష్ట్రస్థాయిలో గ్రామీణ సువిధ యోజన కింద 3.24 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీతో మహిళలు పొగ ముప్పు నుంచి విముక్తి చెందారని, తొలి స్మోక్ ఫ్రీ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ హర్ ఘర్ లక్ష్మి నారి సమ్మాన్ నిధి పథకం కింద నెలకి రూ.1500 ఇస్తామని ప్రకటించింది. ‘‘ఉన్నత విద్య అభ్యసించలేని యువతులు కానివ్వండి, సింగిల్ మదర్లు, వితంతువులు ఇలా అవసరం ఉన్న మహిళలందరికీ రూ.1500 బ్యాంకులో పడతాయి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది’’ అని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు. అంతకు ముందే ఆప్ తాము అధికారంలోకి వస్తే నెలకి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాతినిధ్యం ఏది ? మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించే పార్టీలు వారికి టికెట్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. 68 స్థానాలున్న అసెంబ్లీలో గత సారి కేవలం నలుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సారి బీజేపీ ఆరుగురికి టికెట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ముగ్గురుకి మాత్రమే ఇచ్చింది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇచ్చింది. 1998లో తొలిసారిగా ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 338 అభ్యర్థులు పోటీ పడితే వారిలో 19 మంది మాత్రమే మహిళలు. వారిలో నలుగురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 6% ఎక్కువగా మహిళల ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా అక్షరాస్యత ఎక్కువ. ఓటు ఎంత విలువైనదో వారికి బాగా తెలుసు. సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా ఎంతో అవగాహనతో ఉంటారు. అందుకే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలవచ్చి ఓట్లు వేస్తారు. గత 20 ఏళ్లుగా పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6 శాతం అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 27 జిల్లాల్లో మహిళా ఓటరే న్యాయ నిర్ణేతలయ్యారు. పది జిల్లాల్లో పురుషాధిక్యం కొనసాగింది. ఒక కోటి 70 లక్షల మంది ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా తమ బాధ్యతను విస్మరించారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థానాలకు ఆరో తేదీన ఎన్నికలు జరిగాయి. గతంతో పోల్చితే ఈ సారి ఓటింగ్ శాతం కాస్త తగ్గింది. దీంతో గెలుపు ధీమా అభ్యర్థుల్లో ఉన్నా తెలియని టెన్షన్ తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఓట్ల వివరాలు, ఎవరెవరు ఏ మేరకు ఓటు హక్కు వినియోగించుకున్నారో అన్న సమగ్ర వివరాలను ఎన్నికల యంత్రాంగం శనివారం వెబ్సైట్లో పొందుపరిచింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతం, జిల్లాల వారీగా శాతాలకు తగ్గ వివరాలను ఇప్పటికే ప్రకటించినా, తాజాగా నియోజకవర్గాల వారిగా పురుషులు, స్త్రీలు, ఇతరులు ఏ మేరకు తమ హక్కును వినియోగించుకున్నారు, ఏ మేరకు విస్మరించారో అన్న విషయాన్ని వివరించారు. మహిళలే అధికం.. రాష్ట్రంలో ఆరు కోట్ల 28 లక్షల 69 వేల 955 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3 కోట్ల 9 లక్షల 23 వే 651 మంది, స్త్రీలు 3 కోట్ల 19 లక్షల 39 వేల 112 మంది ఉన్నారు. మిగిలిన వారు ఇతరులు. ఇందులో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న వారు 4 కోట్ల 57 లక్షల 76 వేల 311 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2 కోట్ల 26 లక్షల 3 వేల 156, స్త్రీలు 2 కోట్ల 31 లక్షల 71 వేల 736 మంది ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు 5 లక్షల 68 వేల 550 మంది అధికంగా ఓట్లు వేశారు. సాధారణంగా పురుషులే అధికంగా ఓటు హక్కు ఇది వరకు వినియోగించుకునే వారి జాబితాలో ముందుండే వారు. అయితే, ఈ సారి పురుషుల్ని మించి మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని వేలూరు, తిరువణ్ణామలై, నామక్కల్, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్ వంటి పశ్చిమ పర్వత శ్రేణుల కూడిన జిల్లాల్లోని నియోజకవర్గాలనూ అధికంగా మహిళలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం విశేషం. కుగ్రామాలతో నిండిన పోలింగ్ కేంద్రాల్లోనూ అధికంగా మహిళలు ఓట్లు వేసి ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో మహిళలు అత్యధికంగా ఓటు వేశారు. పది జిల్లాల్లో మాత్రం పురుషులు ముందంజలో ఉన్నారు. ఇందులో చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, కృష్ణగిరి, ధర్మపురి, విల్లుపురం వంటి ఉత్తర తమిళనాడు జిల్లాలు ఉన్నాయి. ఇక, ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు దూరంగా ఉన్న వాళ్లు కోటి 70 లక్షల 93 వేల 644 మంది ఉన్నారు. తాజా ఎన్నికల్లో మహిళలు అధికంగానే నియోజకవర్గాల్లో ఓటు వేసిన దృష్ట్యా, వారి నిర్ణయమే అభ్యర్థుల తలరాతగా మారనున్నాయి. ఫలితాల రోజున మహిళ ఓటర్లే న్యాయనిర్ణేతలు కాబోతున్నారు. చదవండి: మరో వివాదంలో కమల్ -
ఆఫీసర్స్ అందరూ మహిళలే
మహిళల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం కలిగించడం కోసం అస్సాంలోని నల్బరి జిల్లా యంత్రాంగం కొత్తగా ఆలోచిస్తోంది. నల్బరినే ఎందుకు అంటే.. ఆ జిల్లాలోని అత్యున్నతస్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావడం! డిప్యూటీ కమిషనర్ మహిళ. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహిళ. ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. వీళ్లంతా కలిసి నల్బరిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు నడిపించేందుకు రకరకాల ప్రణాళికలు, పథకాలు రచిస్తున్నారు! 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీకి మూడు విడతలుగా.. మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీలలో.. పోలింగ్ జరుగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లే ప్రభావం చూపబోతున్నారని సర్వేల అంచనా. బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డున అస్సాం నగరం గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంది నల్బరి జిల్లా. ఆ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలేనన్నది మరీ కొత్త సంగతైతే కాదు. అయితే వీళ్లంతా కలిసి మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. వీళ్లకేం పని? వీళ్లకే పని! డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు.. వీళ్లే కదా జిల్లా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసింది, బాధ్యత గల పౌరులుగా మెలిగేలా నడిపించవలసింది! అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం పౌరధర్మం అయితే, ఓటు వేయించడం అధికారం ధర్మం. ఆ ధర్మాన్నే ఈ మహిళా అధికారులంతా బాధ్యతగా, వినూత్నంగా చేపడుతున్నారు. అభ్యర్థులు మహిళల ఓట్ల కోసం పాట్లు పడుతుంటే, అధికారులు మహిళల చేత ఓటు వేయించడం కోసం ‘ప్లాట్’లు ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. లోపల బూత్ సిబ్బంది, బయట భద్రతా సిబ్బంది అంతా మహిళల్నే నియమిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మహిళల్ని ఆ పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నల్బరీ, బర్క్షెత్రి, ధర్మాపూర్లను ప్రత్యేక జోన్లుగా, సెక్టార్లుగా, చౌక్‌లుగా విభజించి అక్కడ మహిళా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలలో ఉండేది మళ్లీ మహిళలే. వారు తమ పరిధిలోని మహిళలకు ఓటు ఎందుకు వేయాలో చెబుతారు. ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తారు. ‘ఈసారి మన మహిళల ఓటు మీద అస్సాం భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సర్వేలను ఉదహరిస్తూ కొన్ని ప్రధానమైన అభివృద్ధి అంశాలను అర్థమయ్యేలా చేస్తారు. ఓటు ఎవరికి వేసినా గానీ, మొత్తానికైతే ఓటు వేయడం మానకూడదన్న స్పృహ కలిగిస్తారు. ఇందుకోసం ఆ కేంద్రాల్లోని మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. ఇక పోలింగ్ డ్యూటీలో ఉన్న మహిళలకైతే వాళ్లెంత చిన్న బాధ్యతల్లో ఉన్నా ప్రత్యేక వసతుల్ని కల్పిస్తున్నారు. ‘‘మహిళలు సౌకర్యంగా ఉంటే, సమాజం సవ్యంగా సాగుతుంది’’ అంటారు డిప్యూటీ కమిషనర్ పురబి కన్వార్. అందుకే ఆమె ఓటు వేసే మహిళలకే కాకుండా, ఓటు వేయమని చెప్పే, బూత్ లోపల ఓటు వేసేందుకు దారి చూపే మహిళా సిబ్బంది అందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పురబి కన్వార్ జిల్లా ఎన్నికల అధికారి కూడా. మరోవైపు.. ఇళ్లకు డెలివరీ అయ్యే గ్యాస్ సిలిండర్లపై ‘ఓటు వెయ్యడం మీ కర్తవ్యం’ అని తెలియజెప్పే స్టిక్కర్లను అతికించమని చెబుతున్నారు. ఇప్పటి వరకు అలా స్టిక్కర్లు అంటించిన సిలిండర్లు ఐదు వేల వరకు డెలివరీ అయ్యాయి. అలాగే వీధి నాటకాలు వేయిస్తున్నారు. మహిళా కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘మహిళా అధికారుల జిల్లా’గా నల్బరి స్టోరీ అప్పుడే అయిపోలేదు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.. అందరూ మహిళలే! జిల్లా ఎస్పీ మహిళ (అమన్‌జీత్ కౌర్). జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్ (రెవిన్యూ), ఇంకా.. డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంతా మహిళలే. ఇంత మంది మహిళా అధికారులు ఉన్నప్పుడు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? మహిళల్లో చైతన్యం వెల్లివిరవకుండా ఉంటుందా? -
ఓటు మన బాధ్యత
మనిషి ఇంట్లో ఉండటం తక్కువ. రోజంతా బయటే! చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాలు. అలసి ఇంటికి చేరిన వారిని ఇల్లు ఆదరిస్తుంది. ఫ్యాన్ వేసి కూర్చోబెడుతుంది. మంచినీళ్ల గ్లాసు చేతికి అందిస్తుంది. స్నానానికి వేణ్ణీళ్లు పెడుతుంది. అప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. సేదతీరాక, ‘ఈరోజు ఎలా గడిచింది?’ అని అడుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మనిషికి కూడా ఇలాంటి ఆదరణే ఉండాలి. రోజూ వెళ్లొచ్చే రోడ్లు బాగుండాలి. రాకపోకలకు రవాణా సౌకర్యం ఉండాలి. రద్దీ తక్కువగా ఉండాలి. రక్షణ, భద్రత ఉండాలి. ఒక్కమాటలో.. మహానగరమే అయినా మన ఇల్లులా ఉండాలి! ఆ నగర ‘గృహ’ బాధ్యత ‘మేయర్’ది అయితే, మేయర్ ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల బాధ్యత. ఇంట్లో నీళ్ల ట్యాప్ అయినా, రోడ్డు మీద నడిచే మన బతుకు బండైనా ఉండేది మేయర్ చేతిలోనే. ఆ మేయర్‌ని ఎన్నుకునే అవకాశం మళ్లీ ఇప్పుడు నగరజీవి చేతికి వచ్చింది. డిసెంబర్ 1న హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు. కోటీ 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీలో 74 లక్షలకు పైగా ఓటేయబోతున్నారు. వారిలో మహిళా ఓటర్లు 35 లక్షలకు పైగానే. ఈ మహిళల ఓట్లే ఇప్పుడు కీలకం! ఓటు హక్కును వినియోగించుకోడం తమ బాధ్యత అని భావిస్తున్నారా లేదా అని తెలుసుకోడానికి జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మెట్రో కార్పోరేషన్) పరిధిలోని మహిళా ఓటర్లను ‘సాక్షి’ కలిసింది. ఎక్కువమంది మహిళల్లో ఓటు వేయడం పట్ల చైతన్యంతో కూడిన బాధ్యత వ్యక్తం అయింది. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఓటు వేసేదాన్ని. సిటీ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే స్థానిక సమస్యల పరిష్కారంలో నగర పాలకవర్గానిదే ప్రధాన పాత్ర అని ఇప్పుడు తెలుస్తోంది. అందుకే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా ఓటేస్తాను. మా శేరిలింగంపల్లి డివిజన్లో అనుమతి లేని నిర్మాణాల వంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దగలిగిన వ్యక్తినే కార్పొరేటర్‌గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. చుట్టూ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత, సరైన ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన విధి సిటిజన్‌గా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎన్నికల సమయంలో నిరాసక్తంగా ఉండి తర్వాత ఎవరిని తప్పు పట్టినా ప్రయోజనం ఉండదు. – పి. నీలిమ, ప్రాజెక్ట్ మేనేజర్, మైక్రోసాఫ్ట్ అప్పట్లో మాకు 21 ఏళ్లకు ఓటు హక్కు వచ్చేది. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ ఓటు వేస్తున్నాను. ఎలక్షన్ల సమయంలో రేడియో ఉద్యోగంలో పని ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పనులున్నా సరే ఓటు వేయడం మానలేదు. ఉదయం ఓటింగ్ మొదలయ్యే సమయానికే బూత్‌కి వెళ్లి ఓటు వేసిన తర్వాత డ్యూటీకి వెళ్లేదాన్ని. ఢిల్లీలో ఉద్యోగం చేసినన్నాళ్లు అక్కడ వేశాను, ఇప్పుడు హైదరాబాద్‌లో వేస్తున్నాను. తలవంచుకుని వెళ్లి ఓటు వేసి రావడం కాదు, ఓటింగ్ సరళిని గమనించి సమాచారంతో ఆఫీసుకు వెళ్తుంటాను. – ఎమ్.ఎస్.లక్ష్మి, న్యూస్ కరస్పాండెంట్, ఆల్ ఇండియా రేడియో మేము హైదరాబాద్‌కి వచ్చి ముప్పై ఏళ్లయింది. ఇక్కడ ఓటు వచ్చి ఇరవై ఏళ్లయింది. ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నాం. మా కష్టం ఎవరూ తీర్చరు. అలాగని ఓటు వేయకపోతే... మనం ఊర్లో ఉన్నా లేనట్లే చూస్తారు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల కోసం ఏదైనా పథకం పెట్టినప్పుడు మమ్మల్ని ఏ లీడరూ పట్టించుకోరు. మాకూ అర్హత ఉందని గట్టిగా అడగాలంటే ఓటు వేయాల్సిందే. – టి. సరస్వతి,పూల వ్యాపారి ఒకరొచ్చి చెప్పాలా?! ఓటు వేయడం ద్వారా మన జీవితంలో ఐదేళ్ల కాలాన్ని ఆ ప్రతినిధి చేతిలో పెడుతున్నాం. అందుకే ఆ ఎన్నిక ప్రక్రియలో విధిగా భాగస్వాములు కావాలి. సరైన వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకోవాలి. నగరంలో మనిషికి ప్రభుత్వం చేయాల్సిన కనీస సర్వీసులు కరెంటు, వాటర్, డ్రైనేజ్ సర్వీసులే. అవన్నీ మనం కట్టే పన్నుల నుంచి అందుతున్న సర్వీసులే. ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను సక్రమంగా అందించే బాధ్యత ఆ ప్రతినిధిది. స్ట్రీట్ లైట్ వెలగకపోయినా, డ్రైనేజ్ పొంగినా మనకు అందాల్సిన సర్వీస్ గురించి అడగగలగాలి. అలాగే జనం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎవరో వచ్చి చైతన్యపరచాలని ఎదురు చూడకూడదు. ఎవరికి వాళ్లు చైతన్యవంతం కావాలి. ఇక చాలా మందికి క్యూలో నిలబడడం అంటే నామోషీ. బేషజాలకు పోయి విలువైన ఓటు హక్కును వినియోగించుకోరు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ కూడా రాష్ట్రపతి హోదాలో నేరుగా వెళ్లి ఓటేయకుండా, క్యూలో నిలబడి తన వంతు కోసం ఎదురు చూసి మరీ ఓటేశారు. అంతకంటే స్ఫూర్తి మరేం కావాలి? నా మట్టుకు నేను ప్రతి ఎన్నికలోనూ ఓటేశాను. సాధారణ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యుయెన్సీ ఓటు కూడా వేశాను. ఇప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఓటు వేస్తాను. – పి. హరిత, ఎంటర్ప్రెన్యూర్ -
‘ఆమే’ నిర్ణాయక శక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన 2021 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపురం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సర్వీసు ఓటర్లను మినహాయిస్తే థర్డ్ జండర్ ఓట్లు 4,083 కలుపుకుని మొత్తం ఓటర్లు 4,00,79,025 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,02,83,145 మంది కాగా, పురుష ఓటర్ల సంఖ్య 1,97,91,797. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,91,348 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాగా, 2020 ముసాయిదా ఓటర్ల సవరణ జాబితా నుంచి ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నాటికి అదనంగా 1,41,631 ఓటర్లు నమోదయ్యారు. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం పురుష ఓటర్లు 16,52,036 మంది ఉండగా, మహిళా ఓటర్లు 16,48,024 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,72,107 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,65,266 మంది ఓటర్లు ఉన్నారు. -
మహిళా ఓటర్లకు రాహుల్ హ్యాట్సాఫ్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పోటెత్తిన మహిళా ఓటర్లు క్రియాశీలకంగా వ్యవహరించారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటు చేసిన తల్లులు, సోదరీమణులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ఓ వీడియో ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో మహిళలు కేవలం అభ్యర్ధులుగానే కాకుండా తమ గొంతుక వినిపించేందుకు కట్టుబడిన ఓటర్లుగానూ కీలకంగా వ్యవహరించిన వారందరికీ తాను శాల్యూట్ చేస్తున్నా’నని రాహుల్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు మహిళా ఓటర్లు తమకు సమాన అవకాశాలు, గౌరవం, ఐక్యతతో కూడిన భారతావని కోరుతున్న 30 సెకన్ల నిడివికలిగిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకం మహిళలకు దక్కాల్సిన న్యాయపరమైన వాటాను వారికి లభించేలా చేస్తుందని ఈ వీడియోలో మహిళలు అభిప్రాయపడ్డారు. ఏడవ, తుది విడత పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో రాహుల్ మహిళా ఓటర్లకు ధన్యవాదాలు చెబుతూ ఈ ట్వీట్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. తుదివిడత పోలింగ్ ఆదివారం ముగియడంతో ఈనెల 23న ప్రకటించనున్న ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. -
హాట్సాఫ్ వాట్సాప్
సార్వత్రిక ఎన్నికల్లో నేడు చివరి విడతగా 59 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బిహార్ (8 స్థానాలు), జార్ఖండ్ (3), మధ్యప్రదేశ్ (8), పంజాబ్ (13), పశ్చిమ బెంగాల్ (9), ఛండీగఢ్ (1), ఉత్తర ప్రదేశ్ (13), హిమాచల్ ప్రదేశ్ (4) రాష్ట్రాలలోని ఆయా నియోజక వర్గాల ప్రజలు తమ ఓటు హవినియోగింక్కును చుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే అనేక స్థానాలలో ఓటు వేసిన మహిళల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించగా.. ఇవాళ్టి ఎన్నికలు కూడా పూర్తయ్యాక జరిగే విశ్లేషణలో పురుష ఓటర్లను మించి మహిళా ఓటర్లు లెక్క తేలే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ జరిగిన 16 సార్వత్రిక ఎన్నికల్లోనూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని, అందుకు కారణం.. మహిళల్లో నిరక్షరాస్యత శాతం తగ్గడం, స్త్రీ సాధికారత ప్రయత్నాలు పెరగడం, ఎన్నికల కమిషన్ ప్రచారం మొదలైనవి ప్రధానమైనవి కాగా.. టెక్నాలజీ పరంగా చూస్తే, వాట్సాప్ అందుబాటులోకి రావడం.. మహిళల్లో ఓటు వేయాలన్న చైతన్య కలగడానికి కీలకమైన అంశంగా దోహదపడిందని ‘షి ది పీపుల్.టీవీ’ వ్యవస్థాపకురాలు, ‘ది బిగ్ కనెక్ట్–సోషల్ మీడియా అండ్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తక రచయిత్రి అయిన శైలీ చోప్రా అంటున్నారు. ‘‘గతంలో ఓటు వెయ్యడం అనేది మహిళ జీవితంలో ఒక రోజుతో పూర్తయ్యే ప్రస్తావన. వాట్సాప్ వచ్చాక ఓటు విలువ, ఓటు వినియోగంపై విస్తృతంగా చర్చ జరిగి (వాట్సాప్ గ్రూపుల్లో), మహిళలకది తమ జీవితంలోని ఒక ముఖ్యమైన బాధ్యత అన్న స్పృహను కలిగించింది. పర్యవసానమే.. మహిళల ఓట్లు.. పురుష ఓట్లను మించిపోడం’’అని చెబుతున్న శైలీ, గ్రామీణ ప్రాంతాలలో సైతం వాట్సాప్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా, మహిళల అభీష్టానుసారం మాత్రమే గెలుపోటములు ఉంటాయని శైలీ చోప్రా చెబుతున్న దానిని బట్టి అర్థమౌతోంది. -
సత్తా చూపిస్తున్న మహిళా ఓటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : బీహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిధిలోని 72 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సోమవారం జోరుగా పోలింగ్ జరుతుతోంది. పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుండగా, ఇంతకుముందు జరిగిన మూడు విడతల్లాగానే నేటి పోలింగ్‌లో కూడా అక్కడక్కడా ఈవీఎంలు మొండికేస్తున్నాయి. ముందుగా నిర్దేశించిన గడువు ప్రకారం ఒక్క కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసిపోతుండగా, మిగతా అన్ని చోట్ల సాయంత్రం ఆరు గంటలకు ముగిసిపోనుంది. ఏప్రిల్ 11న జరిగిన మొదటి విడత లోక్‌సభ పోలింగ్‌లో 69.5 శాతం పోలింగ్, ఏప్రిల్ 18న జరిగిన రెండో విడత పోలింగ్‌లో 69.44 శాతం, మూడవ విడత పోలింగ్‌లో 67.99 శాతం పోలింగ్ నమోదయింది. మే 19 వరకు మరో మూడు విడత పోలింగ్ జరుగనుంది. మే 23వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. నాలుగో విడత ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల చైతన్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడా చూసినా సరే ఉదయం నుంచే వారు బారులు కట్టి కనిపిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి దేశవ్యాప్తంగా పలు పార్టీలు, నాయకులు మహిళా ఓటర్లను ఆకర్షించడంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. మహిళా ఓటర్లను ఆకట్టుకున్నట్లయితే వారు కచ్చితంగా అనుకున్న పార్టీకి వేస్తారని, మగవారిలాగా వారిలో ఊగిసలాట ధోరణి ఉండదని వారి నమ్మకం. పోలింగ్‌లో ఒక్క శాతం ఓటు పెరిగినా అభ్యర్థుల జాతకాలు తారుమరయ్యే అవకాశం ఉండడంతో మహిళా ఓటర్ల శాతంపైన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం పెరిగింది. అయితే ఓటింగ్ వయస్సు వచ్చినప్పటికీ కొంత మంది మహిళలు ఓటర్లుగా నమోదవడం లేదు. దేశవ్యాప్తంగా 45.10 కోట్ల మంది మహిళలకు ఓటు హక్కు వయస్సు రాగా, వారిలో 43 కోట్ల మంది మహిళలు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఓటర్లుగా నమోదు కాలేదు. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో సరాసరి 38 వేల మంది మహిళల ఓట్లు గల్లంతైనట్లే. పలు లోక్‌సభ సీట్లలో ఇంతకన్నా తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోవడం లేదా గెలవడం తెల్సిందే. ఓటు హక్కు కలిగిన మహిళలు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 33 శాతం పురుషులు ఓటేయగా, 29 శాతం మహిళలు ఓటేశారు. ఆ ఎన్నికల ద్వారానే ఇప్పటివరకు అత్యధికంగా 16వ లోక్‌సభకు అత్యధికంగా మహిళలు ఎన్నికయ్యారు. మొత్తం లోక్‌సభ ఎంపీల్లో వారి ప్రాతినిథ్యం 11.4 శాతానికి పెరిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 55.82 శాతం మంది మహిళలు ఓట్లు వేయగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారి శాతం 65.63 శాతం మహిళలు ఓట్లు వేశారు. ఆ ఎన్నికల్లో పురుషులు 67.17 శాతం మంది ఓట్లు వేశారు. అంటే పురుషులకన్నా రెండు శాతం కన్నా తక్కువ మంది మహిళలు ఓట్లువేశారు. ఈసారి కచ్చితంగా పురుషుల సంఖ్యను మించి మహిళలు ఓట్లు వేస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. -
ఆమే కింగ్ మేకర్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం ఎవరికి ప్రయోజనం చేకూర్చనుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గంలో పురుషులతో పో ల్చితే మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్సాహంగా పోలింగ్ పోలిం గ్ బూత్‌లకు వచ్చి ఓటేశారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకంగా మారిన ఈ మహిళలు ఎవరికి పట్టం గడతారనేదానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరి«ధిలో మొత్తం 15.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 7.37 లక్షల మంది పురుష ఓటర్లు కాగా, 8.15 లక్షల మంది మహిళా ఓటర్లు న్నారు. వాస్తవానికి పురుషుల కంటే మహిళ ఓటర్లు సుమారు 78 వేలు (సుమారు పది శాతం) అధికంగా ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్ రోజు 5.87 లక్ష ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 4.73 లక్షల మంది ఓట్లేయగా, వారికి 1.13 లక్షల మంది మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. మొత్తం 68.33 శాతం పోలింగ్ జరిగింది. 64.22 శాతం మంది పురుషులు ఓటేస్తే., మహిళలు 72.06 శాతం ఓటేశారు. అంటే సుమారు 7.64 శాతం మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంది. ఏకంగా 27,277 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓట్లేశారు. భారీగా పెరిగిన ఈ పోలింగ్ తమకే అనుకూలమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి, వితంతు పింఛన్లు, ఒంటరి మహిళలు.. ఇలా రకరకాల పింఛన్ల పొందుతున్న లబ్ధిదారులు తమకే పట్టం కడతారని టీఆర్ఎస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వీరికి ప్రతినెల రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఠంచనుగా అం దుతున్నాయి. ఈ పింఛను మొత్తాన్ని వచ్చే నెల నుంచి రూ.2,016కు పెంచుతామని ఇటీవల టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. వీటితో పాటు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను మహిళల నుద్దేశించి పకడ్బందీగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమ లు చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కల్వకుంట కవిత కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మహిళలతో మమేకమయ్యారు. దాదాపు అన్ని ప్రచార సభల్లోనూ మహిళ ల సందడే అధికంగా కనిపించింది. తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లోనూ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెరిగిన మహిళా ఓటింగ్ తమ కు అనుకూలమని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇటు బీజేపీ కూడా మహిళా ఓటర్లపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛనులో కేంద్ర సర్కారు వాటా అధికంగా ఉందనే అంశాన్ని ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో మహిళలకు వివరించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉపాధి హామీ, మరుగుదొడ్ల వంటి పథకాలను ప్రస్తావించి మహిళా ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తనను గెలిపిస్తే ఉచితంగా గృహాల నిర్మాణం వంటి పథకాలను అమలు చేయిస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలతో పోల్చితే కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే సాగినా.. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు తంటాలు పడింది. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదనే అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లి అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం ఆ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనని, అమ్మ రుణం తీర్చుకోవాలనే సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు అడుగులు వేశా రు. మరోవైపు కాంగ్రెస్ ఆ పార్టీ మహిళా అధ్యక్షులు నేరెళ్ల శారద, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి వంటివారిని ప్రచారంలో భాగస్వామ్యులను చేసింది. మొత్తం మీద ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేశారు. గెలుపు ఓటములను నిర్దేశించే ఈ మహిళా ఓటర్లు ఎవరి కి పట్టం కట్టబెడతారనే అంశంపై ఉత్కంఠ ఫలితాల వెల్లడి వరకు కొనసాగనుంది. -
ఓటర్ల నమోదులో వివక్ష
దేశంలో ఒక పక్క ఓటింగ్‌లో మహిళా చైతన్యం వెల్లువెత్తుతుండగా, మరో పక్క వారి ఓట్లు భారీగా గల్లంతవుతున్నాయి. ప్రముఖ సిఫాలజిస్ట్ ప్రణయ్‌రాయ్ తన తాజా పుస్తకం ‘వెర్డిక్ట్’లో ఈ విషయాన్ని బయటపెట్టారు. 1962లో మహిళా ఓటర్లలో 47 శాతం మందే ఓటేశారు. 2014కి వచ్చేసరికి వారి ఓటింగ్ శాతం 66కి పెరిగింది. 1962లో పురుషులకన్నా స్త్రీల ఓటింగ్ 15 శాతం తక్కువగా నమోదైంది. 2014 నాటికి ఈ వ్యత్యాసం 1.5 శాతానికి తగ్గింది. ఎన్నికలకు సంబంధించి మహిళల్లో చైతన్యం పెరిగిందనడానికి ఇదొక సంకేతం. అయితే మరోపక్క ఓటర్ల జాబితాలో నేడు 2.34 కోట్ల మంది స్త్రీలు అంతర్థానమయ్యారని ప్రణయ్‌రాయ్ అధ్యయనంలో తేలింది. జనాభా లెక్కలను, అందులో స్త్రీ పురుషుల ఓటర్ల శాతాన్ని పోల్చి ఆయన ఈ లెక్క తేల్చారు. దేశ పురుష జనాభాలో 97.2 శాతం ఓటర్లుగా నమోదయ్యారు. కానీ మహిళా ఓటర్ల విషయంలో ఇది 92.7 శాతమే. ఈ విధంగా 18 ఏళ్లు నిండిన 2.34 కోట్ల మంది స్త్రీలు తమ ఓటు హక్కు కోల్పోయారు. అంటే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓట్లన్నమాట! ఓటర్ల జాబితాల్లో మహిళలు మిస్ కావడం వెనుక సామాజిక, రాజకీయ కారణాలున్నాయని ప్రణయ్‌రాయ్ విశ్లేషించారు. ఉదాహరణకు అమెరికాలో లక్షలాదిమంది నల్లజాతి ఓటర్ల పేర్లు నమోదు కానీయకుండా చేస్తున్నారు. భారత్ వంటి సమాజాల్లో కేవలం స్త్రీలు కావడం వల్లే విద్య, వైద్యం, ఆహారం సహా రకరకాల సేవల విషయంలో వారి పట్ల వివక్ష కనబరుస్తున్నారు. దేశంలో జరిపిన పలు అధ్యయనాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. మహిళల పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయడంలోనూ ఈ విధమైన వివక్ష ఉంటున్నదని ప్రణయ్‌రాయ్ వివరిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం మహిళల ఓటింగ్ భారీగా పెరగడమనేది ‘జండర్’ అంశాలు రాజకీయ చర్చలో భాగమయ్యేందుకు దారితీసింది. పార్టీలు, నాయకులు స్త్రీల అభివృద్ధి కోణంపై దృష్టి పెట్టేందుకు దోహదపడింది. మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచించి ఓటేయడాన్ని, కుటుంబ ప్రభావం నుంచి కొంతమేరకు బయటపడటాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అంతర్థానమయిన మహిళా ఓటర్ల పేర్లు నమో దు చేయించేందుకు ఈసీ తక్షణమే చర్యలు చేపట్టాల్సి వుంది. ముస్లింలూ, దళితులూ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు వేర్వేరు పరిశోధనలు పేర్కొన్నాయి. నిజానికి మన ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేస్తున్నది ఈ వర్గాలేనని, గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిం, దళిత, మైనార్టీ, మహిళా ఓటర్ల ఓటింగ్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నదని ప్రొఫెసర్ జావేద్ ఆలం తన పరిశోధన గ్రంథం ‘హూ వాంట్స్ డెమోక్రసీ’లో వెల్లడించారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డిబేట్స్ ఇన్ డెవలప్మెంట్ పాలసీ వ్యవస్థాపకులు ఆబూసలే షరీఫ్ ప్రకారం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తది తర రాష్ట్రాల్లోని 50శాతం ముస్లిం కుటుంబాల్లో ఇంటికొక పేరన్నా ఓటర్ల జాబితా నుంచి మాయమైపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం కుటుంబాల్లో సగటున నలుగురు సభ్యులుంటే ముగ్గురికే ఓటున్నట్టు బయటపడింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40–50 ముస్లిం కుటుంబాలపై జరిపిన పరిశీలనలో ఇంటికొక్క ఓటు మాత్రమే నమోదైనట్లు తేలింది. జనగణన లెక్కల ప్రకారం కర్ణాటకలో దాదాపు 60 లక్షల ఓట్లు నమోదు కాలేదని షరీఫ్ పేర్కొన్నారు. ఈ విధంగా దేశంలో 3 కోట్ల ముస్లింలు, నాలుగు కోట్ల మంది దళితుల ఓట్లు మిస్ అయినట్టు సాఫ్ట్వేర్ నిపుణులు ఖలీద్ సైఫుల్లా చెబుతున్నారు. స్పెల్లింగ్ తప్పులు, ఉర్దూలో వయసు నమోదు, వివక్ష వంటివి ఇందుకు కారణాలుగా కనబడుతున్నాయని ఆయన అన్నారు. మన సమాజంలో మహిళలు, దళిత బహుజనులే అత్యధిక వివక్ష ఎదుర్కొంటున్నారనే సత్యం చివరికి ఓటర్ల జాబితాల్లో సైతం బయటపడింది. - బి.భాస్కర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, 9989692001 -
ఆమెదే ఆధిపత్యం
పాలమూరు: అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా ముందు వరుసలో ఉంటున్నారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో పురుషుల కంటే అధికంగా ఓటేసి తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. నాలుగు సెగ్మెంట్లలో.. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో పురుషుల కంటే అధిక సంఖ్యలో మహిళలు ఓటేశారు. పార్లమెంట్ పరిధిలో 15,05,190 మంది ఓటర్లు ఉండగా వీటి లో 9,82,890 మంది ఓటు వినియోగించుకున్నారు. అందులో మహిళలు 4,89,453, పురుషులు 4,93,435 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే మహిళలు పురుషుల కంటే కేవలం 3,982 ఓట్లు మాత్రం తగ్గాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే నాలుగింటిలో వారే ముందంజలో ఉన్నారు. దీంట్లో కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 64,158 మంది పురుషులు ఓటు వేయగా, 67,454మంది మహిళలు ఓటువేశారు. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో 63,702మంది పురుషులు ఓటు వేయగా, 65,680మంది మహిళలు ఓటు వేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 71, 572మంది పురుషులు ఓటు వేయగా, మహిళలు 71728 మంది ఓటు వేశారు. మక్తల్ నియోజకవర్గంలో 69,910మంది పురుషులు ఓటు వేయగా 71,608మంది మహిళలు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
1,86,17,091 మంది ఓటేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లకు గాను 1,86,17,091 (62.69 శాతం) మంది ఓటేశారు. 1,49,19,751 మంది పురుష ఓటర్లలో 93,73,320 (62.82శాతం) మంది, 1,47,76,024 మంది మహిళా ఓటర్లలో 92,42,193 (62.55శాతం) మంది, 1,504 మంది ఇతర (ట్రాన్స్‌జెండర్) ఓటర్లలో 232(15.43శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో పురుషుల కంటే మహిళల పోలింగ్ అధికంగా నమోదు కావడంతో ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మిగిలిన 14 లోక్‌సభ స్థానాల్లో పురుష ఓటర్లే స్వల్ప ఆధిక్యతను సాధించారు. రాష్ట్రస్థాయిలో సగటున స్త్రీ, పురుషుల ఓటింగ్ నిష్పత్తి సమానంగా నమోదు కావడం గమనార్హం. ఇందూరులో పోటెత్తిన మహిళా ఓటర్లు నిజామాబాద్ స్థానంలో మొత్తం 10,61,124 ఓట్లు పోలవ్వగా, అందులో 4,73,673 మంది పురుషులు, 5,87,447 మహిళలు, నలుగురు ఇతరులున్నారు. పురుషుల ఓటింగ్ 64.22 శాతం, మహిళల ఓటింగ్ 72.06 శాతం నమోదైంది. పురుషుల కంటే 1,13,774 మహిళా ఓట్లు అధికంగా పడ్డాయి. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి ధర్మవురి అరవింద్ పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసిన రైతన్నలు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో 5,58,352 (68.49%) మంది పురుషులు, 5,88,108 (70.38%) మంది మహిళలు ఓటేయడంతో ఇక్కడి ఫలితాలు సైతం ఆసక్తికరంగా మారాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. -
పర్చూరులో యువత, మహిళా ఓటర్లే కీలకం
సాక్షి, పర్చూరు (ప్రకాశం): నియోజకవర్గ ఓటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికలకు మొత్తం 2,14,392 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య 2019 ఎన్నికల నాటికి 2,29,742 పెరిగింది. అంటే 15,350 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓట్లలో మహిళలు, యువతే కీలకం కానున్నారు. కొత్తగా నమోదైన ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమోదుకు ఉత్సాహం చూపిన యువత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఓట్ల నమోదు చేర్పులు, మార్పులకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నాటికి పర్చూరు నియోజకవర్గ ఓటర్లు 2,19,427 మంది ఉండగా, అందులో పురుషులు 1,07,547 మంది, స్త్రీలు 1,11,870 మంది ఉన్నారు. దీనిలో మహిళా ఓటర్లే 4,323 మంది అధికంగా ఉన్నారు. అయితే చేర్పులు, మార్పుల విషయంలో ఫాం 6, ఫాం 7కు సంబంధించి వచ్చిన దరఖాస్తులు వివాదాస్పదమయ్యాయి. ఓటర్లు తమ ఓట్లు తామే తీసేయాలంటూ వచ్చిన అర్జీలపై పునర్విచారణ జరిగింది. దీంతోపాటు మళ్లీ నూతన ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి మార్చి 15వ తేదీ వరకూ చేర్పులకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నుంచి మార్చి 11 వరకు 7782 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు 3020 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10,802 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 10,315 మందికి ఓటు హక్కు లభించింది. దీనిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ప్రస్తుతం 2019లో పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2,29,742 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. అయితే వీరిలో పురుషుల కన్నా 5,194 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇతరుల కింద మార్టూరు మండలంలో ఇద్దరు, ఇంకొల్లు మండలంలో నలుగురు, చినగంజాం మండలంలో నలుగురు చొప్పున మొత్తం 10 మంది ఇతర ఓటర్లు అంటే థర్డ్ జండర్లు కూడా ఉన్నారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా ప్రస్తుత ఓటర్ల వివరాలు... మండలం మహిళా ఓటర్లు పురుష ఓటర్లు మొత్తం ఓటర్లు మార్టూరు 29,307 28,912 58,221 యద్దనపూడి 11,526 10,313 21,839 పర్చూరు 22,138 20,856 42,994 కారంచేడు 16,934 15,998 32,932 ఇంకొల్లు 21,133 19,987 41,124 చినగంజాం 16,425 16,203 32,632 మొత్తం ఓటర్లు 1,17,463 1,12,269 2,29,742 మండలాల వారీగా ఈ ఏడాది పెరిగిన ఓటర్లు మండలం పెరిగిన ఓటర్లు మార్టూరు 3751 యద్దనపూడి 788 పర్చూరు 1548 కారంచేడు 1145 ఇంకొల్లు 1604 చినగంజాం 1479 -
అతివలే అధికం.. వారే కీలకం
సాక్షి, విశాఖపట్నం: అన్ని రంగాల్లో అతివలు ముందంజ వేస్తున్న కాలమిది. చట్టసభలకు ఎవరు వేళ్లేదీ నిర్ణయించే విషయానికి కూడా ఇది వర్తిస్తుంది. మిగిలిన ప్రాంతాల సంగతి అటుంచితే.. విశాఖ జిల్లాలో మాత్రం ఇది అక్షరసత్యమవుతోంది. జిల్లాలోని 15 నియోజకవర్గాలలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంగతే అధికంగా ఉంది. అయిదేళ్ల కిందటి పద్ధతిని కొనసాగించే విధంగా ఈసారి కూడా మగువలదే పైచేయిగాఉంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 35,78,458 మంది ఓటర్లున్నారు. వారిలో 17,75,630 మంది పురుషులు కాగా, 18,02,631 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ లెక్కన చూస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు జిల్లాలో 27,001 మంది అధికంగా ఉన్నారు. ఇక గత ఎన్నికలతో పోల్చినా వీరి సంఖ్య అధికంగానే కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లలో 16,70,307 మంది పురుషులుండగా, 16,76,105 మంది మహిళలున్నారు. 2014లోని సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాదికి మహిళా ఓటర్లు 1,26,526 మంది, పురుష ఓటర్లు 1,05,323 మంది పెరిగారు.కాగా గతఎన్నికల సమయానికి 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా, ఈసారి అదనంగా మరో నియోజకవర్గంలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్టుగా లెక్క తేలింది. కేవలం నాలుగు నియోజకవర్గాల పరిధిలోనే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు కాస్త అధికంగా ఉన్నారు. దీంతోఈసారి కూడా మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా పేర్కొనక తప్పదు. బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలు తలకిందులు చేసే సత్తా మళ్లీ వీరికే ఉందని స్పష్టమవుతోంది.పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కంటే అత్యధికంగా విశాఖ పశ్చిమలో ఉన్నారు. అదే విధంగా మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే పాడేరులో అత్యధికంగా ఉన్నారు. మహిళల కంటే పురుష ఓటర్లు అధికంగా నియోజకవర్గాలను పరిశీలిస్తే పెందుర్తి (799 మంది), విశాఖ పశ్చిమ(7328 మంది), విశాఖ దక్షిణం (187 మంది), గాజువాక (5773 మంది) తేలాయి. ఇక పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు భీమిలి (1671 మంది), విశాఖ తూర్పు (2865 మంది) విశాఖ ఉత్తరం (566 మంది), యలమంచలి (3585 మంది), పాయకరావుపేట (2389 మంది), అనకాపల్లి (4956 మంది), నర్సీపట్నం (5410 మంది), చోడవరం(5312 మంది), పాడేరు (6088 మంది), మాడుగుల (3632 మంది) అరకు (4604 మంది)లలో అధికంగా ఉన్నారు. ఓటుహక్కు వినియోగంలోనూ వారే 2014 ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే 15 నియోజకవర్గాల్లో 24,08,696 మంది (71.97) తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలే అధికం. నాటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 12,02,726 మంది కాగా, మహిళా ఓటర్లు 12,05,969 మంది. మొత్తం మహిళా ఓటర్లలో 71.95 శాతం మంది మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహిళలను అత్యధిక సంఖ్యలో చట్టసభలకు పంపాలన్న లక్ష్యం మేరకు ఈసారి వైఎస్సార్సీపీ మహిళలకు పెద్దపీట వేసిన సంగతి విదితమే. దీంతో గతంతో పోలిస్తే ఈసారి బరిలో నిలిచిన వారిలో మహిళా అభ్యర్థులు అధికంగానే ఉన్నారు. వైఎస్సార్సీపీ తరపున అనకాపల్లి, అరకు లోక్‌సభ స్థానాల నుంచి డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, అలాగే పాడేరు, విశాఖ తూర్పు నియోజకవర్గాల నుంచి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అక్కరమాని విజయనిర్మల బరిలో నిలిచారు. మహిళా అభ్యర్థులు అత్యధికంగా బరిలోకి దిగడంతో వారిని ఎలాగైనా చట్టసభలకు పంపాలన్న పట్టుదల మహిళల్లో కన్పిస్తోంది. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నూరు శాతం మహిళలు ఓట్లు వేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అంతేకాకుండా వైఎస్సార్సీపీ మహిళల కోసం ప్రకటించిన వైఎస్సార్ చేయూత (నాలుగు విడతల్లో ఉచితంగా రూ.75 వేలు పంపిణీ), డ్వాక్రా రుణమాఫీ (ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉందో ఆ మొత్తం నాలుగు విడతల్లో జమ చేయడం) వంటి హామీలు కూడా మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అంతా అనుకున్నట్టే జరిగితే చాలా మంది అభ్యర్థుల తలరాతలు మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఓటర్లు 35,78,458 -
32 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 175అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యపరిశీలిస్తే 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లోమహిళా ఓటర్లే కీలకం కానున్నారు.ఈ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో 2,000 నుంచి 10,000 వరకు మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధికంగా ఉన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మహిళా ఓటర్లు ఏ అభ్యర్థి పక్షాన, ఏ పార్టీ పక్షాన నిలిస్తే వారినే విజయం వరించనుంది. నియోజకవర్గాల వారీగా పురుషులకన్నా మహిళా ఓటర్లు ఎక్కువగాఉన్న స్థానాల వివరాలు.. నియోజకవర్గం పురుష మహిళా మహిళా ఓటర్లు ఓటర్లు ఓటర్లు ఎంత ఎక్కువ -
వారే నంబర్ 1
ఎలక్షన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల ఓటర్లతో పోలిస్తే.. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 11న ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3కోట్ల 69లక్షల 33వేల 91 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు కోటి 83లక్షల 24 వేల 588 మంది ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 86లక్షల 4వేల 742 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే.. 2లక్షల 80వేల 154 మంది మహిళా ఓటర్లు అధికం. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 40లక్షల 13వేల 770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 20లక్షల 18వేల 747 మంది కాగా.. పురుషులు 19లక్షల 94వేల 639 మంది ఉన్నారు. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళలు 24వేల 108 మంది అధికం. అత్యల్ప ఓటర్లు గల జిల్లాగా విజయనగరం నిలిచింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 17లక్షల 33వేల 667. వీరిలో మహిళలు 8లక్షల 75వేల 222 కాగా, పురుషులు 8లక్షల 58వేల 327. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళలు 16వేల 895 మంది అధికం. విశేషం ఏమంటే.. శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మహిళల కంటే పురుష ఓటర్లే అధికంగా నమోదయ్యారు. శ్రీకాకుళంలో 7,168 మంది, గుంటూరులో 64,454 మంది, అనంతపురంలో 21,168 మంది, చిత్తూరులో 17,924 చొప్పున పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధిక ఓటర్లు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నిలిచింది. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,70,495 మంది ఉన్నారు. వారిలో మహిళలు 1,37,018 కాగా, పురుషులు 1,33,434 మంది. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 3,584 మంది అధికం. ఈసారి కూడా భీమిలి రెండో స్థానంలో నిలిచింది. ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,64,520 ఉన్నారు. వారిలో మహిళలు 1,32,839, కాగా, పురుషులు 1,31,671 మంది. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళలు 1,168 మంది అధికం. రాష్ట్రంలోనే తక్కువ ఓటర్లున్న అసెంబ్లీ స్థానాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, కృష్ణా జిల్లా పెడన నిలిచాయి. నరసాపురంలో మొత్తం ఓటర్లు 1,59,144 కాగా, వారిలో మహిళలు 79,416 మంది, పురుషులు 79,727 మంది ఉన్నారు. ఇక్కడ మహిళల కంటే పురుషులు 311 మంది అధికం. ఆ తర్వాత పెడన నియోజకవర్గంలో 1,59,215 ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 79,472 కాగా, పురుషులు 79,736 మంది. మహిళలతో పోలిస్తే పురుష ఓటర్లు 264 మంది అధికంగా నమోదయ్యారు. గత ఎన్నికల్లో 20 మంది 2014లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 20 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాష్ట్రం మొత్తం మీద విజయనగరం జిల్లాలోనే అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు 9 ఉండగా అత్యధికంగా.. ఇదే జిల్లా నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండటం విశేషం. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన మొత్తం 20 మంది మహిళా ఎమ్మెల్యేల్లో నలుగురు ఎస్టీలు, ఐదుగురు చొప్పున ఎస్సీలు, బీసీలు ఉన్నారు. కాగా, అగ్రవర్ణాలకు చెందినవారు ఆరుగురు ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రెండో జిల్లా గుంటూరు నుంచి ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. -
ఆమే కీలకం
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట), కాకినాడ సిటీ : రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలకు ప్రతి అంశం కీలకమే. ఇక్కడ సామాజిక సమీకరణలతో పాటు, మహిళా ఓటర్ల తీర్పూ ముఖ్యమైనదే. జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఆయా రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఎందుకంటే జిల్లాలో పురుషుల ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య అధికం. ఇదీ లెక్క జిల్లాలో 19 నియోజకవర్గాల్లో.. ఎనిమిది నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల హవా కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 40 లక్షల 13,770 మంది ఓటర్లు ఉండగా అందులో అత్యధికంగా మహిళలు 20లక్షల 18,747 మంది, 19లక్షల 94,639 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళల ఓట్లు 24,108 అధికం. మిగిలినవి థర్డ్ జండర్ ఓట్లు 384 ఉన్నాయి. 2014లో 37లక్షల 73,322 మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారు. ఎనిమిది నియోజకవర్గాలు మినహా జిల్లా పిఠాపురం, కాకినాడరూరల్, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన 11 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అమలాపురం నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లు ఒక్కరే ఎక్కువ. తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ సిటీ, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు జిల్లాలో 19 నియోజకవర్గాలకు సంబంధించి 64 మండలాలు ఉండగా, 32 మంది జెడ్పీటీసీ సభ్యులు, 32 మంది ఎంపీపీలు, 1104 మంది ఎంపీటీసీ సభ్యులు పదవులు ఉండగా వాటిలో 552 మంది ఎంపీటీసీ సభ్యుల్లో మహిళలు పదవుల్లో కొనసాగుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున మహిళలు పదవుల్లో ఉన్నా నేటికీ వారిలో చాలా మంది మహిళలు పదవులను అనుభవించకుండా భర్తలు షాడోలుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన మహిళా ప్రతినిధులు నేటికీ తమ పదవులను స్వచ్ఛందంగా అనుభవించలేకపోతున్నారనేది నగ్నసత్యం. ఇకపై షాడో వ్యవస్థకు మంగళం పాడేలా మహిళలు వ్యవహరించేందుకు కార్యక్రమాలను చేపట్టాలని మహిళా లోకం స్పష్టం చేస్తుంది. మహిళల సంక్షేమానికే ఓటు మహిళ సంక్షేమానికి, సంరక్షణకు చర్యలు తీసుకునే వారికే మహిళలు ఓటు వేస్తామని ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. టీడీపీ హయాంలో మహిళలపై దురాగతాలు ఎక్కువయ్యాయని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాకు హామీ ఇచ్చి నమ్మకం కలిగించే పార్టీకే పట్టం కడతామని మహిళలు స్పష్టం చేస్తున్నారు. -
మహిళ మహిమ..
రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేసి అఖండ విజయం నమోదు చేసిన టీఆర్ఎస్ పార్టీ విజయం వెనుక జిల్లా మహిళల పాత్ర కీలకంగా ఉందనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. మిగిలిన గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కూడా పురుషులతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు పోలింగ్‌లో కూడా పురుషుల కన్నా అధికంగా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన కారణంగానే టీఆర్ఎస్ సునాయసంగా విజయం సాధించడంతోపాటు చాలాచోట్ల ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చేసిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిద్దిపేట మహిళా ఓటర్లు కారుకు.. కేసీఆర్‌కు జై కొట్టినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,55,453 ఓట్లు ఉన్నాయి. ఇందులో 4,25,463 ఓట్లు పురుషులవి ఉండగా.. వీరి కన్నా 3,982 ఓట్లు అధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సఖి పేరుతో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు, అధికారులు, అక్కడ సహాయ సహకారాలు అందించే సిబ్బంది కూడా మహిళలనే నియమించారు. ఇలా జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో మొత్తం 3827 ఓటర్లు ఉండగా.. ఇందులో 2801 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 66.5 శాతం అంటే 1850 మంది మహిళలు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓట్లలో 65శాతం ఓట్లు టీఆర్ఎస్కు పోల్ కావడం మహిళలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా ఉన్నారని స్పష్టం అవుతుంది. కాగా మహిళలు.. పురుషులకన్నా 1.5 శాతం ఎక్కువగా టీఆర్ఎస్కు వేయడం గమనార్హం. సంక్షేమ పథకాల ప్రభావం.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మహిళా ఓటర్లను అత్యధికంగా ఆకట్టుకున్నాయని, అదే అభ్యర్థులకు శ్రీరామ రక్షగా నిలిచి భారీ మెజార్టీకి దారులు సుగమనం చేసిందని జిల్లాలోని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా మహిళల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పథకాల పుణ్యమా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పెరిగాయి. వసతులు పెరిగాయి. దీని మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కూడా పెరిగాయి. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ లేనిదే ప్రసవం కానిరోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు అధికం కావడం విశేషం. దీంతో ప్రసూతి ఖర్చులు తగ్గాయి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి రూ.1,0116 అందచేసిన ప్రభుత్వం తీరును పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రుల భారం తగ్గింది. అది కూడా ఆడపిల్ల తల్లి పేరిట చెక్కులు పంపిణీ చేసిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అదేవిధంగా వృద్ధ మహిళలు, వితంతులు, ఒంటరి మహిళలతోపాటు, బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఇవ్వడంతో సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు కొట్టిందని మహిళలు చెబుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతోపాటు, దుబ్బాక, హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులు సోలిపేట రామలింగారెడ్డి, వొడితల సతీష్‌కుమార్‌లు ప్రతీ సభ, సమావేశం, రోడ్‌షోలతోపాటు, పది మంది మహిళలు ఎక్కడ కన్పిస్తే అక్కడ ఈ పథకాల గురించే వివరించిన తీరు మహిళా ఓటర్లపై ప్రభావితం చూపింది. పథకాలను ఆదరించారు మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికే పెద్దపీట వేసింది. మహిళా సాధికారత కోసం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆసరా, ఒంటరి మహిలా, బీడీ కార్మికుల పెన్షన్లు మహిళలకు అందాయి. గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని తీరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకోసమే మహిళలు టీఆర్‌కు పట్టం కట్టారు. – కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ, మెదక్ పథకాలకు ఆకర్షితులయ్యారు హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లే అధికం. ఇందులో అత్యధిక శాతం మంది టీఆర్ఎస్కు ఓటు వేశారు. కేసీఆర్ సీఎంగా ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయనే విశ్వాసం మహిళల్లో బలంగా ఉంది. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, పాలపై లీటర్‌కు రూ.4 సబ్సిడీ, సబ్సిడీతో బర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. నాకు భారీ మెజార్టీ రావడంలోనూ మహిళా ఓటర్లే కారణం. – వొడితెల సతీష్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్ నా మెజార్టీలో మహిళా ఓటర్లే కీలకం మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి.. ఆగ్రహిస్తే కూలిపోతాయి. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు మహిళలు టీఆర్ఎస్కు అండగా ఉన్నారు. గత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటులో కూడా మహిళల పాత్ర చాలా కీలకం. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లోనూ టీఆర్ఎస్కు మహిళలే అండగా నిలిచారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్కు మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. నా మెజారిటీలోనూ వారి ఓట్లే కీలకం. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక -
మహిళలకు ఎన్నికల్లో దక్కని ప్రాధాన్యం
ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి చెప్పే మాటలు బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చే సరికి ఎవరూ పాటించడం లేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా.. అవకాశాలు లేక మహిళలు అట్టడుగునే ఉంటున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో చూసుకుంటే.. మొత్తం ఓటర్లలో సగటున మహిళలే ఎక్కువగా నమోదయ్యారు. ఆ మేరకు రాజకీయంగా మాత్రం వారికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారగా, భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. మిగతా ఏ పార్టీలు కూడా పట్టించుకోలేదు. జిల్లాలో పురుషుల ఓటర్లతో పోల్చుకుంటే.. మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నప్పటికీ.. వారికి సముచిత స్థానం కల్పించడంలో పార్టీలు విఫలమయ్యాయన్న చర్చ సర్వత్రా సాగుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు కలిపి మొత్తం 61 మంది అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి, స్వతంత్రంగా బరిలో నిలిస్తే.. అందులో మహిళ ఒకరంటే ఒక్కరే ఉండటం ఆయా పార్టీల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మహిళలు సైతం స్వతంత్రంగానైనా బరిలో నిలిచే సాహసం చేయకపోవడం సమాజంలో మహిళలంటే వివక్ష దూరం కాలేదన్న వాదనకు తెరలేపుతోంది. శాసనకర్తలు మహిళలు ఉంటే ఆ వర్గానికి మరింత న్యాయం జరుగుతుందనేది అందరూ ఏకీభవించాల్సిన వాస్తవం. మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్న ప్రస్తుత ఆధునిక యుగంలో రాజకీయాల్లో మాత్రం వారికి అంతగా ప్రాధాన్యం లభించడం లేదనే చెప్పవచ్చు. ఇందుకు ప్రస్తుత శాసనసభ ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా.. ఒకే ఒక్క మహిళ శాసనసభ పోరులో నిలబడటం చూస్తుంటే పార్టీలు మహిళలను ఓట్లు వేసేవారిగానే తప్ప.. పాలనా యంత్రాంగాన్ని నడిపించే మహాశక్తిగా మాత్రం గుర్తించడం లేదని స్పష్టమవుతోంది. జిల్లాలో తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం మొత్తం ఓటర్లు 9,11,480 మంది ఉంటే.. పురుషులు 4,53,618 కాగా, మహిళ ఓటర్లు 4,57,808 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలు 5,190 మంది ఎక్కువగా ఉన్నారు. చొప్పదండి నుంచి 13 మంది బరిలో ఉండగా, మహిళా అభ్యర్థిగా బొడిగె శోభ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మానకొండూరులో 13, కరీంనగర్లో 25, హుజూరాబాద్‌లో 10 మంది అభ్యర్థులు ఉండగా, ప్రధాన పార్టీలు మహిళా ఓటర్లకు అనుగుణంగా అవకాశం కల్పించలేకపోయాయి. నాలుగు నియోజకవర్గాల్లో ఓటర్ల లెక్క ఇదీ.. కరీంనగర్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, కరీంనగర్ మినహా మిగతా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్లో 2,87,021 మంది ఓటర్లుంటే.. 1,43,956 మంది పురుషులు, 1,43,032 మంది మహిళలు ఉండగా, 33 మంది థర్డ్‌జెండర్స్ ఉన్నారు. చొప్పదండిలో 2,12,731 ఓట్లకు 1,04,482 పురుషులు, 1,08,246 మహిళలు, మానకొండూరులో 2,02,504 ఓట్లకు 1,00,588 పురుషులు, 1,01,915 మహిళలు, హుజూరాబాద్‌లో 2,09,224 మంది ఓటర్లలో 1,04,592 పురుషులు, 1,04,615 మంది మహిళా ఓటర్లున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించడంలో మహిళా ఓట్లే కీలకంగా మారనున్నాయి. వారు తలుచుకుంటే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపగలరు. ఇక ముందు జరిగే ఎన్నికల్లో తమకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని మహిళల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఎప్పుడు ఎన్నకలు వచ్చినా.. రాజకీయ పార్టీలు మహిళల జనాభా, ఓటర్లకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు కల్పించడం లేదన్న అసంతృప్తిని కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా ఇద్దరికే అవకాశం.. 1952 నుంచి ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి సుమారుగా సాధారణ, ఉప ఎన్నికలు కలుపుకుని 13 నుంచి 15 ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 2018 వరకు ఈ నియోజకవర్గాల్లో ఇద్దరికి మాత్రమే మూడు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలు అవకాశం కల్పించాయి. 2004లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గండ్ర నళినికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం దక్కింది. అదేవిధంగా ఎస్సీ రిజర్వుడు స్థానం చొప్పదండి నుంచి బొడిగె శోభకు 2014లో టీఆర్ఎస్ అవకాశం కల్పించగా, ఈసారి ఆమెకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శోభ బీజేపీలో చేరగా.. బీజేపీ అవకాశం కల్పించింది. ఓటర్ల విషయంలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నా.. ఎమ్మెల్యేలుగా ఎదిగేందుకు మాత్రం మహిళలకు అవకాశాలు తక్కువనేందుకు ఇవన్నీ నిదర్శనాలే. రానున్న రోజుల్లో జిల్లా నుంచి శాసనసభకు వెళ్లే మహిళల సంఖ్య పెరిగేలా అన్నీ పార్టీలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఓటర్ల లెక్క తేలింది
పెద్దపల్లిఅర్బన్: జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలనాయంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా తుది ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించింది. జిల్లా మొత్తం 6,12,859 మంది ఓటర్లతో కొత్త జాబితా ప్రచురణ చేస్తున్నారు. ఏడాది కాలంగా సుదీర్ఘ కసరత్తు చేసిన ఎన్నికల అధికారులు చివరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేశారు. అక్టోబర్ 9న చివరి జాబితా ప్రకటించాల్సి ఉండగా, ఓటు నమోదు చేసుకోవడానికి వీలుగా నవంబర్ 19 వరకు గడువును పొడగించారు. అంతేకాదు జిల్లాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. గత నెలతో పోలిస్తే ఏకంగా 11,523 ఓటర్లు పెరిగారు. అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. గత నెల 12న ప్రకటించిన జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 6,01,336 ఉంది. రామగుండంలో అత్యధికం.. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. రామగుండం నియోజకవర్గంలో 6,103 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఇందులో పురుష ఓటర్లు 3,149 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,951 మంది కొత్తగా జాబితాలో చేరారు. పెద్దపల్లిలో పురుషులు 1,044, మహిళా ఓటర్లు 1,250 మంది, మంథని లో పురుష ఓటర్లు 1,445 మంది, మహిళా ఓటర్లు 1,693 తుది జాబితాలో అవకాశం పొందారు. పురుషులే అత్యధికం.. కొత్త ఓటరు జాబితాలో పురుçష ఓటర్లు అత్యధికంగా ఓటుహక్కు పొంది ఆ«ధిక్యంలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3,03,748 మంది మహిళా ఓటర్లు ఉండగా, 3,09,049 పురుష ఓటర్లు నమోదయ్యారు. నియోజవర్గాలవారీగా చూస్తే రామగుండంలో 95,902 పురుషులు, 91,346 మహిళలు, మంథనిలో 1,02,434 మంది పురుషులు, 1,02,553 మంది మహిళలు, పెద్దపల్లిలో 1,10,713 మంది పురుషులు, 1,09,849 మంది మహిళా ఓటర్లు జాబితాలో ఉన్నారు. ఓటర్ల కోసం ప్రత్యేక శిబిరాలు.. 2014 ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో దాదాపు 60వేల పైచిలుకు ఓట్లు తక్కువగా నమోదయ్యాయి. దీంతో అధికారులు పెద్ద ఎత్తున ప్రత్యేక శిబిరాలను, అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేశారు. దీంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. పోలింగ్ బూతుల్లో బీఎల్వోలకు టార్గెట్లు నిర్దేశించి మరీ పనిచేయించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను నమోదు చేయించడం కలిసివచ్చింది. -
మహిళా ఓటర్లే కీలకం
వైరా: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో మహిళా ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేయగలిగేవిధంగా ఆధిక్యంలో ఉన్నారు. పురుషుల కంటే..వీరి ఓట్లే ఎక్కువగా ఉండడంతో..అభ్యర్థులు నారీమణులను అభ్యర్థించుకుంటూ..ఓట్లేయాలంటూ విన్నవించుకుంటున్నారు. రానున్న ఎన్నికల తరుణానికి ఇప్పటికే పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల రణరంగంలో పాలకులను ఎన్నుకునేందుకు ఓటర్లూ సిద్ధంగా ఉన్నారు. యువ ఓటర్లు తమ ఓటుహక్కును నమోదు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో ఓటర్ల నూతన జాబితాను అధికారులు ప్రకటించారు. గత సార్వత్రికం నాటికంటే ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. పాలకులను ఎన్నుకునే క్రమంలో మహిళలదే ప్రతిసారీ పైచేయిగా ఉంటోంది. నియోజకవర్గలో మొత్తం 1,73,672 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 86,876 మంది. మహిళా ఓటర్ల సంఖ్య 87,391. 515మంది ఎక్కువగా ఉన్నారు. కొణిజర్ల ఓటర్ల సంఖ్య అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 22,204 మంది ఉన్నారు. అనంతరం రెండో స్థానంలో వైరా ఉంది. ఇక్కడ 20,812 మంది ఓటర్లు ఉన్నారు. మూడో స్థానంలో కారేపల్లి, నాలుగో స్థానంలో ఏన్కూరు మండలాలు నిలిచాయి. 12,571 ఓటర్లతో జూలూరుపాడు అయిదో స్థానంలో నిలిచింది. పెరిగిన క్రమం ఇలా.. నియోజకవర్గాల పునర్వివిభజనలో భాగంగా 2009లో వైరా కొత్తగా ఏర్పడింది. ఐదు మండలాలతో కలిపి ఆవిర్భవించిన ఈ కేంద్రంలో తొలిసారిగా 2009లో 1,49,338 మంది ఓటర్లు ఉన్నారు. అప్పట్లో పురుష ఓటర్ల సంఖ్య 74,173గా ఉండగా మహిళా ఓటర్లు 75,165మంది ఉన్నారు. నాటి సార్వత్రిక తరుణంలోనూ మహిళా ఓటర్ల సంఖ్య 992 మంది ఎక్కువగా ఉన్నారు. 2009తో పోల్చితే ప్రస్తుతం ఉన్న ఓటర్లు 24,334 మంది అదనంగా నమోదయ్యారు. మొత్తంగా నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఓటర్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూనే ఉంది. కేవలం పదేళ్లలో 24 వేలకుపైగానే అదనంగా ఓటర్లుగా నమోదయ్యారు. మహిళల ఓట్ల సంఖ్యపెరుగుతుండటం విశేషం. -
శక్తి నీవే..అధికారం ఎండమావే!
మహిళలు.. ఆకాశంలో సగం సంగతేమో కానీ, రాజకీయాల్లో వారి పాత్ర నానాటికీ తగ్గిపోతోంది. ప్రభుత్వాలను ఎన్నుకునే నిర్ణయాధికారంలో సగం వాటా కలిగిన మహిళలకు చట్టసభలకు పోటీచేసే అకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. ఈ విషయంలో కొద్ది హెచ్చుతగ్గులతో అన్ని రాజకీయ పార్టీలదీ ఒకటే తీరు. ఆ విషయంలో అందరూ ఒక్కటే! వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలతో వ్యవహరించే రాజకీయ పార్టీలన్నీ మహిళకు పోటీచేసే అవకాశం ఇచ్చే విషయంలో మాత్రం ఒక్కతాటిపై నడుస్తున్నాయి. జనాభా ప్రకారం మహిళలకు సీట్లు కేటాయించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి 44 మంది మహిళలకు మాత్రమే టికెట్లు కేటాయించాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చివరి స్థానంలో ఉంది. ఈ పార్టీ తరఫున నలుగురు మహిళలకు టికెట్లు దక్కగా, ప్రజాకూటమి 14, భారతీయ జనతా పార్టీ 15, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 11 మందికి టికెట్లు కేటాయించాయి. 55 నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే ఎక్కువ మహిళలకు రాజ్యాధికారం ఇంకా అందనంత ఎత్తులోనే ఉంది. ఎప్పటికీ వారు ఎన్నుకునే వారిగానే ఉండిపోతున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాదాపు 55 సెగ్మెంట్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. బాల్కొండ, నిజామాబాద్, ఆర్మూరు, నిర్మల్ నియోజకవర్గాల్లో పురుçష ఓటర్ల కంటే పది శాతం ఎక్కువగా మహిళలు ఉన్నారు. కోరుట్ల, మెదక్, వేములవాడ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఖమ్మం, బోధన్, జగిత్యాల, భద్రాచలం, కామారెడ్డి సెగ్మెంట్లలో పురుషుల కంటే ఎనిమిది శాతం ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ముథోల్, నిజామాబాద్ అర్బన్, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, సిరిసిల్ల, అందోలు, నర్సాపూర్, హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, తాండూరు, కొడంగల్, నారాయణపేట, దేవరకద్ర, మక్తల్, గద్వాల, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, డోర్నకల్, నర్సంపేట, పరకాల, వరంగల్ తూర్పు, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. బిల్లుకు మోక్షం కలిగితేనే.. రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో మహిళలను లెక్కలోకి తీసుకోవట్లేదు. చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి.. చట్టసభల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ప్రాతినిధ్యం పెరుగుతుంది. అప్పుడు కచ్చితమైన సంఖ్యలో మహిళలు ప్రజాస్వామ్యంలో భాగస్వాములవుతారు. 30 శాతం రిజర్వేషన్ల బిల్లు ఏళ్ల తరబడి పార్లమెంట్‌లోనే మూలుగుతోంది. దీనికి ఆమోదం లభించే పరిస్థితీ కనిపించడంలేదు. ఈలోగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల అంశంపై డిమాండ్లు మొదలవుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో ఇక్కడ మహిళలు అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పరిపాలనలతో సత్తా చాటుతున్నారు. చట్టసభల్లో అవకాశం కోసం మాత్రం రాజకీయ పార్టీల కరుణ కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు గెలుపొందారు. వీరిలో స్వతంత్రంగా పోరాడి గెలిచిన వారే అధికం.. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన మహిళలు తొమ్మిది మందే.. అంటే అరవై ఏడేళ్ల కాలంలో రాష్ట్ర శాసనసభలో పెరిగిన మహిళల సంఖ్య ఒక్కటంటే..ఒక్కటే.. మహిళలకు టికెట్ల కేటాయింపులో అన్ని పార్టీలు కంటితుడుపుగానే వ్యవహరిస్తున్నాయి. నాడూ నేడూ అంతంతే.. - 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి 317 మంది మహిళలు పోటీ చేస్తే.. 27 మంది (తెలంగాణ– 9, ఆంధ్రప్రదేశ్– 18) గెలిచారు - 2009లో 300 మంది మహిళలు పోటీకి దిగగా, 33 మంది (కాంగ్రెస్– 21, టీడీపీ– 9, సీపీఐ– 1, ప్రజారాజ్యం–2) గెలుపొందారు - 2004లో 161 మంది పోటీచేస్తే 25 మంది విజయం సాధించారు (కాంగ్రెస్– 17, సమాజ్‌వాదీ పార్టీ– 1 (డీకే అరుణ), టీడీపీ– 5, టీఆర్ఎస్– 2) - 1999లో 157 మంది బరిలో నిలిస్తే 28 మంది గెలిచారు (టీడీపీ– 22, కాంగ్రెస్– 5, ఇండిపెండెంట్– 1) - 1994లో 127 మంది పోటీచేస్తే 8 మంది గెలుపొందారు (టీడీపీ– 6, కాంగ్రెస్– 1, సీపీఎం– 1) - 1989లో 70 మందికి టికెట్లు దక్కగా, 17 మంది పోటీలో నెగ్గారు (కాంగ్రెస్– 11, టీడీపీ– 6) - 1985లో 66 మంది బరిలో నిలబడితే పది మంది గెలుపొందారు (కాంగ్రెస్– 1, టీడీపీ– 9) - 1983లో 66 మంది పోటీకి నిలవగా, గెలిచింది పదకొండు మంది (టీడీపీ– 9, కాంగ్రెస్– 1, సీపీఎం– 1) - 1978లో 54 మందికి టికెట్లు ఇవ్వగా పదిమంది గెలిచారు (కాంగ్రెస్– 6, జనతా పార్టీ– 3, సీపీఎం– 1) - 1972లో ఒక్క మహిళ కూడా గెలవలేదు. 287 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 49 మంది మహిళలు పోటీ పడ్డారు - 1967లో 21 మంది నిలబడితే 11 మంది గెలిచారు (కాంగ్రెస్– 10, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా– 1) - 1962లో 24 మంది పోటీచేస్తే పది మంది విజయం సాధించారు (కాంగ్రెస్– 8, సీపీఐ– 2) - 1952లో హైదరాబాద్ స్టేట్ తొలి శాసనసభ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు (కాంగ్రెస్– 5, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్– 1, ఇండిపెండెంట్– 1, ఆల్ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్– 1) (ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలూ కలిపి 44 మంది మహిళలకు అవకాశం ఇచ్చాయి) అవకాశం ఇచ్చి చూస్తే.. మహిళలకు కాస్తో కూస్తో ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు మహిళా ఎమ్మెల్యేలకు అధికంగా మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సే. స్త్రీ, శిశు సంక్షేమం లాంటి శాఖలతోనే సరిపెట్టకుండా కీలకమైన హోంశాఖనూ కేటాయించింది. ఆ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. సబితా ఇంద్రారెడ్డి వైఎస్ హయాంలో ఆ శాఖను చేపట్టారు. తెలుగుదేశం పార్టీ.. ప్రతిభా భారతికి అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలను అప్పజెప్పింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పజెప్పింది. తొలి మహిళా ‘హోమ్’ ఇక్కడే.. తొలి మహిళా హోం మంత్రి రికార్డు మన తెలంగాణ పేరిటే ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. అదే ఏడాది జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన సబితా ఇంద్రారెడ్డి.. తీగల కృష్ణారెడ్డి (టీడీపీ)పై 7,833 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆమెకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు. కాగా, సబిత భర్త ఇంద్రారెడ్డి సైతం హోం మంత్రిగా పనిచేశారు. దంపతులిద్దరూ హోం మంత్రులుగా పని చేయడం దేశంలోనే రికార్డు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు మహిళలకు కేటాయించిన సీట్లు వైఎస్ కేబినెట్లో ఆరుగురు మహిళలు అప్పటికీ ఇప్పటికీ ఇదే రికార్డు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు మహిళలకు కల్పిస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన కేబినెట్లో ఆరుగురు మహిళలకు చోటిచ్చిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా పగ్గాలు చేపట్టిన వైఎస్.. తన కేబినెట్లో జి.అరుణకుమారి, గీతారెడ్డి, ఎన్.రాజ్యలక్ష్మి, సబితా ఇంద్రారెడ్డిని చేర్చుకున్నారు. రెండోసారి 2009లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన.. మరోసారి కేబినెట్లో మహిళలకు పెద్దపీట వేశారు. ఈసారి ఏకంగా ఆరుగురికి చోటు కల్పించారు. వీరిలో సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సబితారెడ్డి, అరుణకుమారి, కొండా సురేఖ, డీకే అరుణ ఉన్నారు. అరుణకుమారి మినహా మిగిలిన వారంతా తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. కాగా, నాడు వైఎస్ కేబినెట్లో పనిచేసిన మంత్రులంతా ఈసారీ తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. 2009లో వైఎస్ ఆకస్మిక మరణం తరువాత.. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2014లో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సబితారెడ్డి, కొండా సురేఖ, డీకే అరుణ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. దేశంలోనే తొలి మహిళా ప్రతిపక్ష నేత ఆమె అసలుపేరు రుక్మిణి. విప్లవ భావాలకు నెలవైన పాత నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో 1920లో జన్మించారు. పదకొండేళ్లకే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డిని వివాహమాడిన రుక్మిణి.. తన పేరు కమలాదేవిగా మార్చుకున్నారు. వివాహానంతరం హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేసిన ఆమె.. భర్తతో పాటు ఉద్యమాల్లోనూ పాల్గొనే వారు. 1946–48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేశారు. 1952 ఎన్నికల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికైన ఆమె.. ఆపై వరుసగా మూడుసార్లు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆలేరు నుంచి ఎన్నికయ్యారు. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా పని చేసిన ఆమె, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లినప్పుడు, దేశంలోనే తొలి ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. టీఆర్ఎస్ 4 2014 ఎన్నికల్లో 9 మంది మహిళలకు పోటీచేసే అవకాశం ఇచ్చింది. వీరిలో ఆరుగురు గెలిచారు. ఇప్పుడు 4 సీట్లే కేటాయించింది. ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), గొంగడి సునీత (ఆలేరు), రేఖానాయక్ (ఖానాపూర్–ఎస్టీ), కోవా లక్ష్మి (ఆసిఫాబాద్–ఎస్టీ). బీఎల్ఎఫ్ 11 సీపీఎం నేతృత్వంలో ఏర్పడిన ఈ ప్రజాసంఘాల కూటమి 11 స్థానాల్లో మహిళలకు పోటీచేసే అవకాశమిచ్చింది. మక్కా నాగలక్ష్మి (పాలకుర్తి), నూర్జహాన్ (నిజామాబాద్ రూరల్) షెహనాజ్ (బోధన్), పటేల్ వనజ (భూపాలపల్లి), అలివేలుమంగ (నిర్మల్), పి.విజయలక్ష్మి (అందోలు), సౌజన్య (నాగార్జునసాగర్), నారాయణమ్మ (నారాయణపేట), బి.హైమావతి (పాలేరు), ఎం.భారతి (సత్తుపల్లి), ఇందూరి సులోచన (జగిత్యాల). బీజేపీ 15 119 స్థానాల్లో పోటీలో ఉన్న బీజేపీ.. మహిళలకు 15 సీట్లిచ్చింది. అరుణతార (జుక్కల్–ఎస్సీ), బొడిగె శోభ (చొప్పదండి–ఎస్సీ), ఆకుల విజయ (గజ్వేల్), బల్మూరి వనిత (రామగుండం), చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి), రజని (అలంపూర్–ఎస్సీ), శారద (ఖమ్మం), ఎ.సువర్ణరెడ్డి (నిర్మల్), పి.రమాదేవి (ముథోల్), షాహెజాదీ (చాంద్రాయణగుట్ట), కె.నివేదిత (నాగార్జునసాగర్), ఎం.నాగస్రవంతి (ఇల్లందు–ఎస్టీ), రేష్మారాథోడ్ (వైరా–ఎస్టీ), జి.పద్మజారెడ్డి(మహబూబ్‌నగర్), కుంజా సత్యవతి (భద్రచాలం–ఎస్టీ). ప్రజా కూటమి 14 కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కూటమి.. మహిళలకు 14 సీట్లిచ్చాయి. వంద సీట్లలో పోటీలో ఉన్న కాంగ్రెస్.. 11 టికెట్లు టికెట్లిచ్చింది. డీకే అరుణ (గద్వాల), పీ.సబితారెడ్డి (మహేశ్వరం), వీ.సునీతారెడ్డి (నర్సాపూర్), జె.గీతారెడ్డి (జహీరాబాద్–ఎస్సీ), కొండా సురేఖ (పరకాల), ఎన్.పద్మావతి (కోదాడ), డి.అనసూయ (ములుగు–ఎస్టీ), ఆకుల లలిత (ఆర్మూరు), ఎస్.ఇందిర (స్టేషన్‌ఘన్‌పూర్–ఎస్సీ), జి.సుజాత (ఆదిలాబాద్), బి.హరిప్రియనాయక్ (ఇ ల్లందు–ఎస్టీ). టీడీపీ– నందమూరి సుహాసిని (కూకట్పల్లి). సీపీఐ– బానోతు విజయబాయి (వైరా). టీజేఎస్– ఎం.భవానీరెడ్డి (సిద్దిపేట). ..:: పిన్నింటి గోపాల్ -
'ప్రగతి' ప్రదాత ఆమే 'నిర్ణేత'
ఆడది వంటింటి కుందేలనే సామెత ఎప్పుడో పాతదైపోయింది. ఆకాశంలో.. అవకాశంలోనూ సగమని నిరూపిస్తూ అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. అయితే అతివలు తక్కువగా రాణిస్తున్న, వీరి ప్రభావం కొంతమేర మాత్రమే కనిపిస్తున్న ఏకైక రంగం రాజకీయమే. పురుషాధిక్య రాజకీయ రంగంలో చోటుకోసం మహిళ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. వీరికి పట్టు చిక్కడం లేదు. ఆడవారికి 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండూ అటకెక్కింది. ఇంత జరుగుతుంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏదైనా సాధించగలిగే సత్తా ఉందా? అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వమే. ఎందుకంటే వరల్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనలో అవాక్కయ్యే వాస్తవాలు వెల్లడయ్యాయి. మహిళా ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాలు.. పురుషులతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ పరిశోధనలో స్పష్టమైంది. భాగస్వామ్యం పెరుగుతోంది అసలు రాజకీయ నాయకురాళ్లు దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యానికి సమర్థులేనా? అనే అంశంపై జరిపిన పరిశోధనలో.. మహిళల సామర్థ్యంపై ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు ఎమ్మెల్యేలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిపై జరిపిన పరిశోధనలు సరికొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ‘ప్రభుత్వ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే అంశాల్లో మహిళా రాజకీయ నేతల భాగస్వామ్యం మెల్లిగా పెరుగుతోందని మా సర్వేలో తేలింది’ అని పరిశోధకులు తెలిపారు. అభివృద్ధిలో ముందంజ 1992 నుంచి 2012 వరకు దేశవ్యాప్తంగా 4,265 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. దీంట్లో.. మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 4.5% నుంచి 8% పెరిగినట్లు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళా రాజకీయ నేతలకు నేరచరిత తక్కువగా ఉంటోంది. మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పురుష ఎమ్మెల్యేల కన్నా 15.25% అభివృద్ధి ఎక్కువగా జరిగినట్లు వెల్లడైంది. ఈ స్థానాల్లో జీడీపీలోనూ 1.85% ఎక్కువ వృద్ధి కనిపించింది. పనిపైనే శ్రద్ధ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే.. పురుషులపై కేసులు మహిళలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పురుష ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటం, ఆస్తులు సంపాదించుకోవడం వంటి కార్యక్రమాలపైనే ఆసక్తి చూపుతున్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ మహిళా నేతలున్న నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయి. ఇద్దరూ నిధులు తీసుకురావడంలో సమానమైన ఆసక్తులే కనబరుస్తున్నప్పటికీ.. పని పూర్తిచేయడంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికితోడు అనవసర ఖర్చుల్లేకుండా.. ప్రతిపాదిత మొత్తంలోనే ప్రాజెక్టులు పూర్తిచేస్తున్న ఘనత కూడా మహిళలకే దక్కుతోంది. స్ఫూర్తితో ముందుకు పనిలో సాధించిన విజయంతో స్ఫూర్తిని ముందుకు పోవడంలోనూ మహిళలో ముందువరుసలో ఉన్నారు. పనిని విభజన చేసుకుని పూర్తి చేయడంలోనూ వీరిదే పైచేయి. అవకాశవాదంగా వ్యవహరించడంలో మహిళల శాతం తక్కువే. ప్రస్తుత భారతదేశంలో 4,118 ఎమ్మెల్యేలుండగా.. మహిళల సంఖ్య 9% మాత్రమే. 2018 జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభాలో మహిళల సంఖ్య 48.5%. ఆ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యమూ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే. 2013 ఎన్నికల్లో వసుంధరా రాజేని గద్దెనెక్కించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈ సారి కూడా మహిళలనే ఆమె నమ్ముకున్నారు. మరి మహిళా ఓటర్లు రాజేను మళ్లీ సీఎం చేస్తారా? వాస్తవానికి ఒకప్పుడు రాజస్తాన్‌లో మహిళలు ఓటరు జాబితాలో కూడా పేరు ఇవ్వడానికి ముందుకురాలేదు. కానీ వసుంధర రాజే ప్రచార శైలి కారణంగా మహిళల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘మన రాష్ట్రంలో రెండే కులాలు ఉన్నాయి. ఒకటి పురుషులు, రెండు మహిళలు. మహిళా సాధికారత కోసం మేము ఎన్నో పథకాలు తెచ్చాం. ఇక మనం ఎవరి ఎదుట చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు’ అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఎన్నికల ర్యాలీల్లో పదే పదే మహిళా ఓటర్లను ఉద్దేశించి చెబుతున్నారు. వసుంధరా రాజేలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఎనలేని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, మధ్య మధ్యలో జోకులు వేస్తూ, తన సంభాషణా చాతుర్యంతో ఓటర్లను కట్టిపడేస్తుంటారు. ఎన్నికల సభల్లో ఆమె మాట్లాడుతూ ఉంటే మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఆమె ఎన్నికల ర్యాలీలకు మహిళలు పోటెత్తుతున్నారు. రాజే పట్ల ఎనలేని ఆరాధనాభావం కనబరుస్తున్నారు. అయితే అన్ని రంగాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర కేవలం మహిళల అండదండలతో అధికారాన్ని సంపాదించుకోగలరా అన్నది ప్రశ్నే. మరోవైపు కాంగ్రెస్ కూడా మహిళలే తమ తురుపు ముక్కలంటూ ప్రసంగాలు చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళల్ని అందలం ఎక్కిస్తామని, మరో అయిదేళ్లలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సగం వాటిల్లో మహిళల్నే ముఖ్యమంత్రుల్ని చేస్తామంటూ హామీలైతే గుప్పిస్తున్నారు. కానీ సీట్లు విషయానికొచ్చేసరికి మొండిచేయి ఇస్తు్తన్నారు. వెనుకబాటులో మొదటి స్థానం బడికి వెళ్లాల్సిన చిన్నారుల కాళ్లకి మెట్టెలు కనిపిస్తాయి. బంగారం లాంటి బాల్యం నాలుగ్గోడల మధ్య నలిగిపోతుంటుంది. బాల్యవివాహాల్లో ఇప్పటికీ రాజస్థానే టాప్. మహిళలపై అకృత్యాల్లో మూడో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నలుగురి మధ్యలోకొచ్చి మాట్లాడరు. ఓటరు జాబితాలో పేరు ఇవ్వడానికీ ఇష్టపడరు. ఓటు వెయ్యడానికి వచ్చినా తండ్రి, భర్త, కొడుకు ఎవరికి వెయ్యమంటే వారికే. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత కేవలం 52%. చదువులేకపోవడం, చిన్నప్పుడే సంసార భారాన్ని మోయాల్సి రావడం వల్ల మహిళల్లో చైతన్యం తక్కువ. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలతో వేలి చుక్కే వజ్రాయుధం అన్న సంగతి గ్రహిస్తున్నారు. 2013లో మొదటిసారిగా అత్యధికంగా మహిళలు ఓటు వినియోగించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జలోర్ జిల్లా దాదల్ గ్రామంలో 2013లో మొదటి సారిగా మహిళలు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు. చట్టసభల్లో ఎక్కువే రాజస్థాన్ మహిళల్లో వెనుకబాటు కనిపించినా చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రం ముందువరసలోనే ఉంది. బీహార్ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రాజస్థానే. మొత్తం 200 స్థానాలున్న అసెంబ్లీలో 2008లో తొలిసారి 29 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ 23 మందికి టిక్కెట్లు ఇస్తే, బీజేపీ 32 మందికి ఇచ్చింది. ఇక 2013లో కాంగ్రెస్ 24 మందికి ఇస్తే, బీజేపీ 26 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 27 మంది మహిళలు ఎన్నికైతే అందులో బీజేపీ నుంచే 23 మంది ఎన్నికయ్యారు. రాజేతో పాటు నలుగురు మంత్రులుగా ఉన్నారు. రాజే పథకాలు అమ్మాయి పుట్టినప్పటి నుంచి యుక్తవయసు వచ్చే వరకు, పెళ్లి నుంచి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేంతవరకు వసుంధర రాజే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం దగ్గర్నుంచి, నిరుపేద మహిళలకు ఉచితంగా మొబైల్ ఫోన్ల వరకు పలు పథకాలు మహిళల మనసుని దోచుకున్నాయి. రాజశ్రీ యోజన , జనని సురక్ష యోజన, మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరేలా భామాషా యోజన, ‘ఈ– సఖి’ పేరుతో డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమం, మహిళలకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ, ఇలా మహిళలకు అండగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అంతకు ముందు అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నప్పుడు కూడా జనని శిశు సురక్ష యాత్ర, శుభలక్ష్మి యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, రాజే తన పథకాలతో మహిళా ఓటర్లను పూర్తిగా తనవైపు తిప్పుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి మద్దతుతో ఈ సారి రాజే గట్టెక్కుతారా వేచి చూడాల్సిందే. రాజస్థాన్ మొత్తం ఓటర్లు 4.74 కోట్లు మహిళా ఓటర్లు 2.27 కోట్లు - 1972లో వెయ్యి మంది పురుషులకు 723 మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటే 2013 నాటికి వెయ్యి మంది పురుషులకు 899 మంది మహిళలు ఓటు వేశారు. - 2008లో 65% మంది మహిళా ఓటర్లు మాత్రమే ఓటు వినియోగించుకుంటే 2013 వచ్చేసరికి అది 10% పెరిగింది. గత ఎన్నికల్లో 75% మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. (భారత్‌లో మహిళా ఓటర్ల వినియోగం సగటున 65%) మహిళా ఓటర్లు పెరగడం వెనక.. - పెరుగుతున్న అక్షరాస్యత - రాజకీయ వార్తలపై ఆసక్తి పెరగడం - రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరగడం - స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం లాభమెవరికి? మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంతో మొదట వీరంతా కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహిళాధ్యక్షులున్న పార్టీకే ఆడవారి ఓట్లు ఎక్కువగా పడ్డాయి. కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, యూపీలో మాయావతి, తమిళనాట జయలలిత, పశ్చిమబెంగాల్లో మమత ఈ వర్గం ఓట్లను సంపాదించుకోగలిగారు. అయితే రాను రానూ వీరిలో వస్తున్న మార్పు కారణంగా ఈ ఓటు బీజేపీవైపు మళ్లుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సరిసమానమైన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్‌నీతి – సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 30% మహిళలు బీజేపీ వైపు ఉంటారన్న సీఎస్డీఎస్ అంచనా వేసింది. మహిళల క్యూ పెరుగుతోంది దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్ శాతం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) అనే సంస్థ చేసిన పరిశోధనలో మహిళల ఓటింగ్ శాతానికి సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ 65.5% కాగా.. పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సీఎం అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు మిజోరంలో కాంగ్రెస్, మిజోనేషనల్‌ఫ్రంట్ తరఫున సీఎం అభ్యర్థులుగా పోటీ పడుతున్న లాల్ థన్వాలా, జోరామ్తంగపై పెండింగ్ క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలు వీరిద్దరే కావడం గమనార్హం. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను గౌహతి హైకోర్టు అందించింది. ఈ కేసులు నిరూపితమైతే ఈ ఇద్దరు జైలు శిక్ష అనుభవించక తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నామినేషన్ పేపర్లలో కొన్ని స్థిరాస్తులను దాచిపెట్టి చూపించారని లాల్ థన్వాలాపై కేసు ఉంది. తనపై ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు థన్వాలా తాజా నామినేషన్ పేపర్లలో వెల్లడించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడనుంది. ప్రతిపక్ష నేత జోరామ్తంగపై రెండు పెండింగ్ కేసులున్నాయి. కుట్ర, విధ్వంసం, సాక్ష్యాల విధ్వంసం, అనైతికంగా అధిక ఆస్తులుండడం తదితరనేరాలు ఈకేసుల్లో పోలీసులు ఈయనపై ఆరోపించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు దాదాపు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఎన్నికలపై 12 లక్షల ట్వీట్లు ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గత వారం రోజుల్లో 12 లక్షల ట్వీట్లు రికార్డయ్యాయని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ట్వీట్లలో వినియోగించేందుకు ఒక ప్రత్యేక ఎమోజీని సైతం అందుబాటులోకి తెచ్చామని ట్విట్టర్ తెలిపింది. ప్రజల్లో ప్రముఖంగా చర్చకు వచ్చే అంశాలకు ప్రాచుర్యం కల్పించే చర్యలు చేపట్టామని తెలిపింది. డిసెంబర్ 23 వరకు ప్రజలు AssemblyElections2018 emoji పేరిట ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ట్వీట్లు చేయవచ్చని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్స్ కేటాయించామని ట్విట్టర్ తెలిపింది. వసుంధరా రాజే.. ఫస్ట్ దేశంలోనే వరుసగా అత్యధిక కాలం మహిళా సీఎంగా పనిచేసిన రికార్డును రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఆమె...సోమవారానికి 3,639 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. ఈమె 2,735 రోజులు మహిళా సీఎంగా పనిచేశారు. ఇంకా కొనసాగుతున్నారు. వివిధ దశల్లో ఎక్కువ రోజులు పనిచేసిన సీఎంగా షీలాదీక్షిత్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈమె మొత్తం వివిధ కాలాల్లో 5504 రోజులు సీఎంగా పనిచేశారు. వీధినాటకాలు..ఇంద్రజాల ప్రదర్శనలు.. సోషల్ మీడియాతో ప్రతి ఓటర్ను చేరవచ్చని ప్రతి పార్టీ భావిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ కొత్తపంథా అవలంబిస్తోంది. నవీన సాంకేతికత ఆధారంగా పనిచేసే సోషల్ మీడియాతో పాటు సాంప్రదాయ రూపాలైన వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనలతో ఓటర్లను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రచారం చేయనుంది. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసుకు పలు డ్రామా గ్రూపులను, ఇంద్రజాలికులను పిలిపించి వారిలో సరైనవారిని ఎంచుకొంది. ఇలా ఎంపికైన వారు ఇకమీదట రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పయనమై బీజేపీ ప్రభుత్వం చేపట్టినఅభివృద్ధి పనులను ప్రజలకు వీధినాటకాల రూపంలో వివరించనున్నారు. ఎంతో వడపోత అనంతరం తాను ఎంపికయ్యానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తానని ఒక కళాకారుడు చెప్పాడు. ఈ విధంగా సాంప్రదాయ కళారూపాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడం గతంలో కూడా చేశామని బీజేపీ ప్రతినిధి చెప్పారు. వీధినాటకాల కళాకారులతో పాటు ఆరుగురు ఐంద్రజాలికులను కూడా పార్టీ ప్రచారం నిమిత్తం ఎంచుకున్నట్లు చెప్పారు. 2013 ఎన్నికల్లో కూడా చౌహాన్ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు ఇదే తరహాలో మ్యాజిక్ ప్రదర్శకులను ఎంచుకున్నామని, గుజరాత్ గత ఎన్నికల్లో సైతం ఇలా కళారూపాలతో ప్రదర్శనలు జరిపామని పార్టీ వర్గాలు చెప్పాయి. వీటి ద్వారా మరింత ప్రభావంతంగా ప్రజల్లోకి వెళ్తామన్నాయి. -
మహిళా ఓటర్లు ఎక్కువ అయినా..
అక్కడ మహిళల సంఖ్య ఎక్కువే. వారికి ఆత్మవిశ్వాసమూ ఎక్కువే. స్కూటర్ల మీద రయ్ రయ్‌మని వెళ్లిపోతుంటారు. చదువుల్లో మగవారినే మించిపోయారు. పారిశ్రామిక రంగంలో పురుషులతో పోటీ పడుతున్నారు. కానీ.. రాజకీయాలకు వచ్చేసరికి వారికి చోటే లేదు. అదేమంటే రాజకీయం అన్నది మగాళ్లు చేసే పని. ఆడవాళ్లకు చేతకాదు అన్న బూజుపట్టిన అభిప్రాయాలే వినిపిస్తూ ఉంటాయి. అదే మిజోరం.. మిజోరంలో వాస్తవానికి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,051 మంది మహిళలు ఉన్నారు. వారిలో చైతన్యం ఎక్కువే. ఎన్నికలొస్తే గంటల తరబడి పోలింగ్ బూతుల దగ్గర బారులతీరు నిల్చొని మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. కానీ అసెంబ్లీకి పోటీ అంటే అందని ద్రాక్షే. ఇప్పటి వరకు కేవలం నలుగురంటే నలుగురు మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారీ మొండి చెయ్యే ! ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మహిళలకు సీటు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. 2003లో చివరి సారిగా మిజో నేషనల్ ఫ్రంట్ మహిళకి టిక్కెట్ ఇస్తే, కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం ఒక్క మహిళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జోర్‌మాతాంగా మహిళలకు టిక్కెట్లు ఇవ్వకపోవడాన్ని అడ్డంగా సమర్థించుకుంటున్నారు. మహిళలకు గెలిచే సత్తా ఉంటే తప్పకుండా ఇస్తాం. కానీ ఎన్నికల్లో నెగ్గుకొచ్చే మహిళామణులెవరూ కనిపించడం లేదు అని అంటున్నారు. గత ఏడాదే ఏర్పాటైన మరో రాజకీయ పార్టీ జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జడ్పీఎం) ఇద్దరు మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం పార్టీలే కాదు అక్కడ సమాజంలో కూడా ఇంకా మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని కొత్తగానే చూస్తున్నారు. 2003లో అయిదుగురు మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు.. 2008 నాటికి వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కానీ అందరూ స్వతంత్ర అభ్యర్థులగానే బరిలోకి దిగారు. ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. సాధారణంగా మహిళలు ఎక్కువగా ఉండడం సామాజిక పురోగతిని సూచిస్తుంది. కానీ రాజకీయాలు వచ్చేసరికి అదే సంకుచిత ధోరణే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విపక్షాల నుంచి మరో వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మద్య నిషేధాన్ని ఎత్తివేయడంతో ఎందరో మగవాళ్లు చీప్ లిక్కర్ తాగి చనిపోతున్నారని, అందుకే మహిళల సంఖ్య పెరిగిపోతోందని దానివల్ల ఓటింగ్‌లో వారు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారన్న విచిత్ర వాదన ఒకటి తెరపైకి తెచ్చారు. ఇటీవల కాలంలో నమోదైన మరణాల సంఖ్యలో 80–85 శాతం మంది మగవారేనంటూ ఎంఎన్ఎఫ్ నేత జోర్‌మాతాంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మరోవైపు మిజోరంలో యువతులు తమకి రాజకీయాలపై ఆసక్తి లేదని అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో విద్యార్థినుల్ని ప్రశ్నిస్తే కెరీర్వైపే తమ దృష్టి ఉందని అంటున్నారు. ‘‘మిజోరం మహిళలు విద్యావంతులు. మగవారిలో కంటే చిత్తశుద్ధి ఎక్కువే. కానీ ఎందుకో తెలీదు వారికి రాజకీయాలంటే ఆసక్తి లేదు‘అని క్రిస్టీ అనే విద్యార్థిని వెల్లడించారు. కొంతమందిలో ఆసక్తి లేకపోతే లేకపోవచ్చు కానీ కొందరు మహిళల్లో రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహం ఉంది. మరి అలాంటి ఉత్సాహవంతులనైనా పార్టీలు ప్రోత్సహిస్తాయా ? వేచి చూడాల్సిందే. ఆ నలుగురు.. 1. థాన్మావి. 1978లో తొలిసారిగా అసెంబ్లీకి. 2. కె. థాన్సియామి. అయిజ్వాల్ (పశ్చిమ) నుంచి 1984లో ఎన్నిక 3. లాల్హింపూయి హమర్, 1987లో ఎమ్ఎన్ఎఫ్ తరపున ఎన్నిక. 4. 20 ఏళ్ల తర్వాత 2014 ఉప ఎన్నికల్లో వన్లలంపూయీ చ్వాంగ్తూ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
ఆమే నిర్ణయాత్మక 'శక్తి'
ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా, ప్రజల స్వరం గట్టిగా వినబడాలన్నా ఓటు హక్కు మన చేతిలో ఉన్న వజ్రాయుధం. ఈ విషయాన్ని మహిళలు బాగా తెలుసుకున్నారు. ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం రానురాను పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ, వివిధ రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) లోక్‌నీతి అనే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తుంది. ప్రీపోల్ సర్వేలు, పోస్ట్‌పోల్ సర్వేలు నిర్వహిస్తూ జనం నాడిని తెలియజేస్తూ ఉంటుంది. ఆ సంస్థ కొన్నేళ్లలో నిర్వహించిన వివిధ సర్వేలు, తాజాగా నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రీపోల్ సర్వే ఫలితాలను సమీక్షిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో 65.5% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే ఎన్నికల్లో పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం చాలా తగ్గింది. దేశంలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 3 కోట్ల కంటే ఎక్కువే. అయినా పోలింగ్ బూత్లకి తరలి వెళ్లడంలో మహిళలు ముందంజలో ఉన్నారు. 1970వ దశకంలో ఓటు హక్కు వినియోగించుకున్న పురుషులు 61% ఉంటే, 2014కి వచ్చేసరికి 67% మాత్రమే. అదే మహిళా ఓటర్ల విషయానికొస్తే 1971లో 49% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటే 2014 వచ్చేసరికి ఏకంగా 65.5 శాతానికి చేరుకుంది. ఏ పార్టీకి లాభం? గతంలో జరిగిన ఎన్నికలను పరి శీలిస్తే.. బీజేపీ కంటే కాంగ్రెస్ వైపు మహిళా ఓటర్ల మొగ్గు ఎక్కువగా ఉంది. 2 నుంచి 3 శాతం మహిళా ఓట్లు బీజేపీకి తక్కువగా వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పురుషులు, మహిళల ఓట్ల శాతం సమానం గా ఉంది. కాంగ్రెస్‌కి పోలైన ఓట్లలో 19% పురుషులైతే, మహిళలు కూడా 19% మంది ఓటేశారు. అదే బీజేపీకి పురుషులు 33% మంది ఓటు వేస్తే, మహిళలు 29% మాత్రమే ఓటేశారు. ఇక వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీది ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పడిన ఓట్లలో 15% పురుషులు ఉంటే, 5% మాత్రమే మహిళలు ఉన్నారు. గుజరాత్లో మాత్రం బీజేపీకి మెరుగైన పరిస్థితులే ఉన్నాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆ పార్టీని ఆదరిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న రాజకీయ పార్టీ లకే మహిళలు బ్రహ్మరథం పట్టారు. కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ(పీడీపీ), యూపీలో మాయావతి (బీఎస్పీ), తమిళనాట జయలలిత(ఏఐఏడీంకే), పశ్చిమబెంగాల్లో మమతా బెనర్టీ (తృణమూల్ కాంగ్రెస్)లకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళలు ఏకంగా 10% ఎక్కువగా జయలలితకు ఓట్లు వేయడం విశేషం. 2019లో బీజేపీ వైపే మహిళా ఓటర్లు? 2014 నుంచి ఇప్పటికీ పరిస్థితులు మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సమాన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్‌నీతి–సీఎస్డీఎస్ ఈ ఏడాది నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 30 శాతం మహిళలు బీజేపీ వైపు ఉంటారని సీఎస్డీఎస్ అంచనా వేసింది. ఈసారి ఎన్నికల్లో హరియాణా, ఒరిస్సా, పశ్చిమబెంగాల్లో మహిళా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ‘ఉజ్వల యోజన’పేరిట మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, బేటీ బచావో–బేటీ పఢావో లాంటి పథకాల కారణంగానే మహిళలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల సంఘం మహిళా ఓటర్ల నమోదును పెంచడానికి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో మహిళా ఓటర్లు నమోదు భారీగా ఉంటుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే మహిళలు ఎటువైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీదే విజయమన్న అభిప్రాయం నెలకొంది. బీజేపీకి మహిళా ఓటర్లు ప్రతికూలంగా ఉన్న రాష్ట్రాలు... అస్సాం, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ బీజేపీకి మహిళల మద్దతు ఉన్న రాష్ట్రాలు.. ఢిల్లీ, మధ్యప్రదేశ్ మహిళా ఓటర్లు జై కొడుతున్న సీఎంలు.. కె.చంద్రశేఖర రావు(తెలంగాణ) నితీశ్ కుమార్(బిహార్) శివరాజ్‌సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్) నవీన్ పట్నాయక్(ఒడిశా) -
భవిష్యత్‌ను నిర్ణయించేది మహిళా ఓటర్లే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో మహిళా ఓటర్ల పాత్ర చరిత్రాత్మక దశకు చేరుకుంది. 1990వ దశకంలో ఎన్నికల్లో ఓటేసిన పురుషులకంటే మహిళల సంఖ్య పది శాతానికి పైగా తక్కువగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఓటేసిన మహిళల సంఖ్య 65.5 శాతానికి చేరుకుంది. అదే ఎన్నికల్లో 67 శాతం పురుషులు ఓటేశారు. అంటే పురుషులతో పోలిస్తే ఓటేసిన మహిళల సంఖ్య ఒకటిన్నర శాతం మాత్రమే తక్కువ. ఏకంగా దేశంలోని 87 లోక్‌సభ నియోజక వర్గాల్లో పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రిజిస్టర్ చేసుకున్న పురుషుల ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్లే కంటే ఎక్కువే. అయినప్పటికీ రిజిస్టర్ చేసుకున్న మహిళల్లోనే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. అంటే ఓ ప్రభుత్వాన్ని, ఓ రాజకీయ పార్టీ భవిష్యత్తును శాసించే దశకు వారు చేరుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను కూడా మహిళలే శాశిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1994 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్ సరళి చూస్తే పురుషులకన్నా మహిళలే కాంగ్రెస్‌వైపు ఎక్కువ మొగ్గు చూపారు. కాంగ్రెస్ కన్నా బీజేపీకి రెండు, మూడు శాతం తక్కువ మంది మహిళలు ఓట్లు వేశారు. అంతర్జాతీయంగా కూడా మహిళా ఓటర్ల ప్రభావం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికులకన్నా డెమోక్రట్లకే ఎక్కువ మంది మహిళలు ఓటేశారు. 2016 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి ఓటేసిన వారిలో 56 శాతం మంది మహిళలు ఉండగా, 44 శాతం మంది మహిళలు ఉన్నారు. బ్రిటన్ ఎన్నికల్లో కూడా లేబర్ పార్టీకన్నా కన్జర్వేటివ్ పార్టీకే మహిళల ఓట్లు ఎక్కువ పడ్డాయి. దేశంలో లోక్‌నీతి జరిపిన జాతీయ ఎన్నికల అధ్యయనం ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి ఒకే రీతిన అంటే, 19 శాతం పురుషులు, 19 శాతం పురుషులు ఓట్లు వేశారు. అదే బీజేపీకి 33 శాతం మంది పురుషులు ఓటేయగా, 29 శాతం మంది మహిళలు ఓటేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్‌కు స్త్రీ, పురుషులు సమానంగా వేయగా, ప్రతి చోటా బీజేపీకి పురుషులకన్నా స్త్రీలు తక్కువ సంఖ్యలో ఓటేశారు. కొన్ని రాష్ట్రాల్లో స్త్రీ, పురుషుల ఓటింగ్ సరళిలో కూడా ఎంతో వ్యత్యాసం కనిపించింది. అస్సాం రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు కాంగ్రెస్‌కు ఓటేయగా, ఎక్కువ మంది పురుషులు బీజేపీకి ఓటేశారు. కర్ణాటకలో కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీని కోరుకోగా పురుషులు బీజేపీ పార్టీని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలనే స్త్రీ, పురుషులు కోరుకున్నారు. ఈ రెండు పార్టీలకే మహిళలు కూడా ఎక్కువ ఓటేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు 15 శాతం మంది పురుషులు ఓటేయగా, ఐదు శాతం మంది మహిళలు మాత్రమే ఓటేశారు. గుజరాత్లో మాత్రం స్త్రీ, పురుషులు దాదాపు సమానంగా బీజేపీకే ఓటేశారు. తెలంగాణలో కే. చంద్రశేఖర రావు, బీహార్‌లో నితీష్ కుమార్, మధ్యప్రదేశ్లోలో శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌లు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులోని అన్నాడిఎంకే (జయలలిత) పార్టీలు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించాయి. అలాగే 2014 అనంతరం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల సరళిని లోక్‌నీతి సంస్థ పరిశీలించగా మహిళా ఓటర్లే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెల్సింది. మహిళా నాయకత్వంలోని అన్ని పార్టీలకు పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. 2017, నవంబర్‌లో ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ జరిపిన అధ్యయనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పురుషులకన్నా స్త్రీల మద్దతు కాస్త తగ్గింది. మతమరమైన అంశాలను మోదీ సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారన్నదే వారి అభియోగం. కానీ 2018 మే నెలలో లోక్‌నీతి జరిపిన అధ్యయనంలో 2014 ఎన్నికలతోపోలిస్తే బీజేపీకి మహిళల మద్దతు కొద్దిగా పెరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నమాట. -
పంచాయతీల్లో మహిళా ఓటర్లే ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొత్తం 1,37,15,150 మంది ఓటర్లుండగా.. వీరిలో 68,49,146 మంది పురుషులు, 68,65,144 మంది మహిళలు, 860 మంది ఇతరులు (ట్రాన్స్ జెండర్) ఉన్నారు. పురుషుల కంటే 15,998 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇతరుల కేటగిరీ ఓటర్లు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 81 మంది ఉండగా.. వరంగల్ అర్బన్ జిల్లాలో తక్కువగా ముగ్గురే ఉన్నారు. ఇతరుల కేటగిరీ ఓటర్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉండడం వల్ల పంచాయతీలలో ఈ సంఖ్య తక్కువగా ఉందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది ఓటర్లున్నారు. అలాగే గ్రామ పంచా యతీలు, వార్డుల సంఖ్య విషయంలోనూ ఈ జిల్లానే అగ్రస్థానంలో ఉంది. మొత్తంగా 844 గ్రామపంచాయతీల్లో 7,340 వార్డులుండగా.. 8,50,664 మంది ఓటర్లు నల్లగొండ జిల్లాలో ఉన్నారు. ఇక మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో తక్కువ పంచాయతీలుండటంతో ఓటర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మొత్తంగా 61 పంచాయతీల్లో 596 వార్డులుండగా.. 1,26,011 మంది ఓటర్లున్నారు. -
మా ఓటు మా ఇష్టం..!
గ్రామీణ ప్రాంతాల్లో ఫలానా పార్టీకి, అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఇంట్లోని మగవారు ఇచ్చే సూచనలు,సలహాలకు అనుగుణంగా ఆడవారు నడుచుకుంటారనేది సాధారణంగా అందరి అభిప్రాయం. కానీ ,కర్ణాటకలోని మహిళలు మాత్రం ఈ సూత్రం తమకు వర్తించదంటున్నారు. ఎన్నికలపుడు పురుషులు చెప్పినట్టుగా నడుచుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఓటు వేయడానికి ముందే కులం, మతం, అభ్యర్థులు, పార్టీలు వంటి కీలకాంశాలపై చర్చిస్తున్నారు. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా లోకం చైతన్యం వెల్లివిరుస్తోంది. –బంట్వాల్‌లోని ఓ చిన్నగ్రామంలో మహిళలు .. పీజీ వరకు అమ్మాయిలకు ఉచిత విద్య కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం..దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఏకరువు పెట్టారు. ‘ఇలాంటవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మాకందరికి అందాలి. అది జరగకపోతే ప్రతీ ఎన్నికల్లో ఓటు వేసి ఏమి ప్రయోజనం’ ఈ గ్రామ యువతి వారిజ వేసిన ప్రశ్న. –బళ్లారిలోని మోకా గ్రామంలో విరుపాక్షమ్మ అనే వృద్ధురాలు తాను ఎవరికి ఓటు వేయాలన్నది ఇప్పటికే నిర్ణయించినట్టు చెప్పారు. ‘నా కొడుకు బీజేపీకి ఓటేయాలని చెబుతున్నా, నేను మాత్రం హస్తానికే ఓటేస్తాను ’ అంటూ చెయ్యేత్తి హస్తం గుర్తు మాదిరిగా చూపారు. -హుబ్బళ్ళి నగరానికి చెందిన రైల్వే ఉద్యోగి సుధ హిరేమథ్ మాత్రం ‘అల్పసంఖ్యాక మతం హోదా కల్పిస్తామంటూ మా కులాన్ని (లింగాయత్) కాంగ్రెస్ చీల్చింది. ఇది నాకు అసంతృప్తి కలిగించింది. దీని ఆధారంగానే ఓటేస్తా’నని వెల్లడించింది. -మూడబిద్రేలోని విద్యాగిరిలో మహిళా టీచర్ల బృందం స్థానిక రాజకీయాలు, బరిలో నిలిచిన అభ్యర్థులు, ఎన్నికల అంశాలపై వాడివేడి చర్చలో మునిగితేలారు. ‘ ప్రధానిగా నరేంద్రమోదీని మీడియా తరచుగా ముందుకు తీసుకొస్తున్నందున, సహజంగానే అది కీలకంగా మారుతుంది. అయితే అన్ని కులాలు, మతాల వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య వైపే నా మొగ్గు ’ అని కె.పూర్ణశ్రీ పేర్కొన్నారు. అయితే ధర్మస్థలానికి చెందిన రమ్య అనే సహచర ఉపాధ్యాయిని తాను మోదీకే ఓటేస్తానంటూ స్పష్టంచేసింది. –మొలకల్మొర్రులోని రారిబొరనహతిలోని గిరిజన మహిళలు మాత్రం అక్కడ ప్రచారానికి వచ్చిన ఓ అభ్యర్థి అనుయాయులను ఉద్ధేశించి తెలుగులో ‘ వారికి కాదు (మగవారు) మాకు ఇవ్వండి’ అంటూ అక్కడ నెలకొన్న పరిస్థితిని ఎత్తిచూపారు. పురుషులకే అన్ని ఇస్తున్నారు. వారికే ఏమైనా ముట్టజెబుతున్నారు. మరి మా సంగతేంటి ? ’ అంటూ హŸలాల్కేరే నియోజకవర్గంలోని సకమ్మ ప్రశ్నించింది. –మొల్కల్మురు పట్టణానికి చెందిన ధనమ్మ ‘ నా ఓటు లెక్కలోకి వచ్చేదని తెలుసు. మహిళలకు సహాయపడి, మా పిల్లలు జీవితంలోకి పైకి వచ్చేందుకు సహకరించే వారికే ఓటువేస్తాను. పలానా వారికి వేయాలని ఎవరో చెబితే దానిని పాటించేందుకు సిద్ధంగా లేను’ అని నొక్కిచెప్పింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘ఆమె’దే పైచేయి!
రాష్ట్ర ఓటర్ల జాబితాలోమహిళలే అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 61 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభా 7.93 కోట్లు ఉండగా, అందులో 5.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలోని అతి పెద్ద నియోజకవర్గంగా షోళింగనల్లూరు, చిన్న నియోజకవర్గంగా కీల్ వేలూరు జాబితాలోకి ఎక్కాయి. సాక్షి, చెన్నై : రాష్ట్ర ఓటర్ల జాబితాలో మహిళలదే పైచేయిగా ఉంది. రాష్ట్రంలో ఏటా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. జనవరి నాటికి 18 ఏళ్లు దాటిన వారందరి పేర్లు తొలి విడతలో, తదుపరి ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ చివరి నాటికి మరో విడతగా కొత్త ఓటర్ల నమోదు సాగుతోంది. ఆ మేరకు ఈ ఏడాది జనవరి నాటికి నమోదైన వివరాలను అదే నెల ఓటర్స్ డే సందర్భంగా ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.92 కోట్లుగా ప్రకటించారు. పురుషులు 2.93 కోట్లు, స్త్రీలు 2.99 కోట్లు, ఇతరులు 5,040గా వివరించారు. తాజాగా అక్టోబర్ మూడో తేదీ నాటికి సిద్ధం చేసిన మరో జాబితాను మంగళవారం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. ఆయా జిల్లాల్లోని ఓటర్ల వివరాలతో కూడిన జాబితాలను కలెక్టర్లు విడుదల చేశారు. జనవరి నమోదుతో తరహాలో మళ్లీ మహిళల హవా సాగడంతో పాటుగా సంఖ్య మూడు కోట్లు దాటడం విశేషం. పురుష ఓటర్ల కన్నా, స్త్రీల ఓటర్లు రాష్ట్రంలో మరోమారు ఆధిక్యతను చాటుకున్నారు. ఈసారి ఏకంగా 61 లక్షల మూడు వేల 776 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడం గమనార్హం. కొత్త జాబితా విడుదల రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల నమోదు, కొత్త జాబితా తయారీ పర్వం గత కొద్ది రోజులుగా సాగుతూ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని నేతృత్వంలోని అన్ని పనులు ముగియడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తమ తమ పరిధిలోని జాబితాలను ఉదయాన్నే ప్రకటించారు. నియోజకర్గాల వారీగా ఆయా జిల్లాల్లో జాబితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్త ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని విడుదల చేశారు. అందులోని వివరాల మేరకు రాష్ట్రంలో ఏడు కోట్ల 93 లక్షల 78 వేల 485 మంది జనాభా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ జనాభాలో ఐదు కోట్ల 95 లక్షల 88 వేల 002 మంది ఓటర్లు ఉన్నట్టు వివరించారు. వీరిలో పురుషులు 2,94,84,492, స్త్రీలు 3,00,98,268 మంది ఉన్నట్టు ప్రకటించారు. ఇతరులు 5,242 మంది ఉన్నారు. ఇక, రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గంగా షోళింగనల్లూరు జాబితాలోకి ఎక్కింది. ఇక్కడ∙ 6,24,405 మంది ఓటర్లు ఉన్నారు. లక్షా 68 వేల 275 మంది ఓటర్లతో కీల్ వేలూరు అతి చిన్న నియోజకవర్గ జాబితాలోకి ఎక్కింది. 18 నుంచి 19 సంవత్సరాల్లోపు ఓటర్లు 5,50,556, 20 నుంచి 29 సంవత్సరాల్లోపు ఓటర్లు 1,22,05,888 ఉన్నారు. 80 సంవత్సరాలకు పైబడ్డ వారు 10,60,361 మంది ఓటర్లుగా ఉన్నారు. రాజధాని నగరం చెన్నైలోని 16 నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాను కార్పొరేషన్ కమిషనర్ కార్తికేయన్ విడుదల చేశారు. ఇందులో 40 లక్షల 73 వేల 703 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20 లక్షల 13 వేల 168, స్త్రీలు 20 లక్షల 59 వేల 557, ఇతరులు 978 మంది ఉన్నారు. -
నజరానాల వాన!
ఓట్ల కోసం భారీగా నగదు, బహుమతులు పంపిణీ లిక్కర్‌కే లక్షలు వెచ్చించిన అభ్యర్థులు సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల్లో భారీగా నగదు, నజరానాల పంపిణీతో రాజకీయ పార్టీ లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి వీధి, బూత్ పరిధిలో ఇదే తంతు. వివిధ పార్టీల ఏజెంట్లు మూడో కంటికి తెలియకుండా ఓటర్లను, మహిళా గ్రూపులను నేరుగా కలుసుకొని నగదు పంపిణీ చేశారు. మరి కొందరు వారి అకౌంట్ నెంబర్లకు నేరుగా నిధులు బదిలీ చేశారు. మురికివాడల్లో స్థానిక బస్తీ లీడర్ల చేతుల మీదుగా ఓటుకు కనిష్టంగా రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పురుష ఓటర్లకు విందు వినోదాలు సరేసరి. అపార్ట్మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాలు ఈ పార్టీలకు వేదికగా మారాయి. మహిళా ఓటర్లను మెప్పిం చేందుకు చీరలు, గాజు లు, వెండి కుంకుమ భరిణెలు, డిన్నర్సెట్లు, మిక్సీ లు, వంట పాత్రలు, గృహోపకరణాలు పంపిణీ చేశా రు. యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు క్యారమ్స్, చెస్ బోర్డులు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. స్థానికంగా ఎక్కడికిక్కడే నివాసం ఉండే తమ పార్టీ నేతలతో ఈ కార్యక్రమాలను చేపట్టడం విశేషం. లిక్కర్‌కు రూ.లక్షలు ప్రధాన పార్టీల అభ్యర్థులు మద్యం కొనుగోలుకు రూ. లక్ష ల్లో ఖర్చు చేశారు. ఒక్కో అభ్యర్థి గత పది రోజు లుగా మద్యం కొనుగోలుకే రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించి నట్లు అనధికారిక అం చనా. నగర శివార్లలో ఒక్కో డివిజన్‌కు సుమారు రూ.కోటి విలువైన మద్యాన్ని అభ్యర్థులు మందుబాబులకు పంపిణీ చేయడం గమనార్హం. వీరంతా ఇంతగా కష్టపడినా వారు ఆశించిన స్థాయిలోఓట్లు పడతాయా అన్నదే ఇప్పు డు మిలియన్ డాలర్ల ప్రశ్న. బస్తీ నేతలకు తాయిలాలు.. కొందరు అభ్యర్థులు కుల సంఘాలు, బస్తీల్లోని చోటా మోటా నేతలను పిలిపించుకొని ఏకమొత్తంగా డబ్బులిచ్చినట్లు సమాచారం. డబ్బు తీసుకునేందుకు ఇష్టపడని కాలనీలకు మాత్రం అక్కడున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు అయ్యే మొత్తాన్ని భరిం చేలా హామీ ఇచ్చి ఒప్పందం చేసుకొన్నట్లు వినికిడి. మినీ వాటర్ ట్యాంకులు, బోర్లు నిర్మించేలా మరి కొం దరు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. చిన్న, మధ్యతరగతి వర్గాల వారున్న ప్రాంతంలో మద్యం, మాంసంతో కూడిన విందులు ఏర్పాటు చే సి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు యత్నించారు. మరికొం దరు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వర కూ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళల లీడర్లను కలిసి ఓట్ల లెక్కన కొంతమొత్తం చెల్లించినట్టు సమాచారం. నేరుగా తీసుకోని గ్రూపులకు వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. మరి కొందరు అభ్యర్థులు కిరాణా దుకాణాలు, వైన్ షాపుల్లో కొంత డబ్బు డిపాజిట్ చేసి పక్కాగా ఓటు వేస్తామని చెప్పిన వారికి కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న చిన్న స్లిప్ రాసి ఇచ్చారు. వీటి ఆధారంగా పంపిణీలు జరిగిపోయాయి. -
సీట్లు ఓకే.. ఓట్లేవి..?
గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు. ‘ఆకాశంలో సగం..ఎన్నికల్లోనూ సగం..’ అంటూ అంతా మురిసిపోయారు. అన్ని వర్గాలూ హర్షం వ్యక్తం చేశాయి. పోటాపోటీగా మహిళా అభ్యర్థులూ ఎన్నికల రంగంలోకి దూకారు. ఇంత వరకు బాగానే ఉంది...ఓట్ల శాతం విషయానికొస్తే మాత్రం పురుషులదే ఆధిక్యం కన్పిస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 930 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నట్లు లెక్కలు తేల్చాయి. - సాక్షి , సిటీబ్యూరో * 150 డివిజన్లలోనూ పురుషాధిక్యం * గ్రేటర్లో ఐదేళ్లలో..మరింత తగ్గిన మహిళా ఓటర్లు * 930-1000కి చేరిన స్త్రీ, పురుష ఓటరు నిష్పత్తి మహా నగరంలో మహిళా ఓటర్ల సంఖ్య మరింతగా పడిపోయింది. తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో వెయ్యి మంది పురుషులకు కేవలం 930 మంది మహిళా ఓటర్లే నమోదయ్యారు. 2011 జ నాభా లెక్కలతో పోలిస్తే కారణాలు ఏవైనా మహిళా ఓటర్ల సంఖ్య తగ్గటం ఆందోళన చెందే అంశమే. మహానగర పాలక మండలి(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 50 శాతం స్థానాలు(75 డివిజన్లు) తొలిసారిగా మహిళలకు కేటాయించిన సంతోషం అలా ఉంచితే, 2011 జ నాభా లెక్కల్లో 954-1000 స్త్రీ పురుష నిష్పత్తి ఉండగా, తాజా ఓటర్ల జాబితాకు వచ్చే సరికి మరో 24 మంది మహిళలు తగ్గిపోయారు. మొత్తంగా చూస్తే పురుషులు - స్త్రీ ఓటర్ల మధ్య నగరంలో సుమారు ఆరున్నర శాతం అంతరం ఉండగా, కొన్ని డివిజన్లలో అయితే ఆ సంఖ్య పది శాతాన్ని దాటిపోయింది. శివారులో మరీ అధ్వానం మహిళా ఓటర్ల పరిస్థితి శివారు ప్రాంతాల్లో ఘోరంగా పడిపోయింది. ముఖ్యంగా సుభాష్‌నగర్‌లో మహిళల కంటే పురుషులు 14 వేల పైచిలుకు ఎక్కవగా నమోదయ్యారు. మైలార్‌దేవ్‌పల్లి, కొండాపూర్‌లలో 11 వేల చొప్పున, సూరారంలో 8 వేలు తక్కువగా ఉన్నారు. ఇంకా బేగంబజార్, భోలక్‌పూర్, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, ఫతేనగర్లలోనూ స్త్రీ- పురుష ఓటర్ల మధ్య అంతరం భారీగా నమోదయింది. నగరం మొత్తంగా చూస్తే మొత్తం ఓటర్లు 74,23,980 మంది ఉండగా వీరిలో పురుషులు 53.46 శాతం, మహిళలు 46.5 శాతం మంది ఉన్నారు. 1063 మంది ఓటర్లు ఇతరుల కేటగిరీలో ఉన్నారు. వాస్తవంగా జనాభా పరంగా కూడా మహిళల శాతం తక్కువగా ఉంటోంది. ఇదే పరిస్థితి ఓటర్లలోనూ కన్పిస్తోంది. వివక్షపై అంతా స్పందించాలి రాజధానిలో స్త్రీ-పురుషుల నిష్పత్తి మధ్య అంతరం భారీగా పెరగటం ఆందోళన కలిగించే అంశం. ఆడపిల్ల అంటే భారమన్న అభిప్రాయంతో ఇంకా అబార్షన్లు జరుగుతున్న ఘటనలు అనేకం. ఈ పరిస్థితిపై సభ్య సమాజం అంతా స్పందించాలి. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం సమాజానికి ఎంతైనా ఉంది. - అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు వచ్చే పాలకవర్గం ప్రతిన బూనాలి మహానగరంలో ఆడపిల్లల సంఖ్యను పురుషులతో సమానంగా పెంచేందుకు వచ్చే జీహెచ్ఎంసీ పాలకవర్గం ప్రతినబూనాలి. ‘ఆడపిల్ల అవనికి భారం కాదు..అందం’ అన్న నినాదం జీహెచ్ఎంసీ తొలి సమావేశంలోనే మారుమోగాలి. ఆ వెంటనే కార్యాచరణ మొదలు కావాలి. ఈ విషయంలో పౌరులు సైతం స్పందించాలి. - డాక్టర్ పద్మజారెడ్డి, నాట్యగురువు -
సౌదీ ఎన్నికల్లో తొలిసారి మహిళలు
మహిళా ఓటర్లకు మొదటిసారి అవకాశం ఎన్నికల బరిలో 900 మంది మహిళలు రియాద్: సౌదీ అరేబియాలో చారిత్రక ఘట్టం. ఈ ఇస్లామిక్ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలను ఓటు వేసేందుకు అనుమతించారు.మహిళలు ఎన్నికల్లో పోటీచేసేందుకూ తొలిసారి అవకాశం కల్పించారు. పెరుగుతున్న లింగవివక్షను నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. శనివారం జరిగిన మునిసిపల్ కౌన్సిల్స్ ఎన్నికల్లో 900 మందికిపైగా మహిళా అభ్యర్థులు పోటీలో పాల్గొనగా, 6 వేల మంది పురుషులు బరిలో ఉన్నారు. రాచరిక పాలన ఉన్న సౌదీలో ప్రజలు ఓటేసి ఎన్నుకునేది ఒక్క ఈ మునిసిపల్ కౌన్సిల్స్నే. మహిళలను డ్రైవింగ్కుకూడా అనుమతించని సౌదీలో వారు కచ్చితంగా తల నుంచి పాదం వరకు పూర్తిగా కప్పివుంచే దుస్తులే ధరించాలి. ఇంతటి ఆంక్షలున్న సౌదీలో జరిగిన ఈ చారిత్రక ఎన్నికల్లో పోటీచేసేందుకు మహిళలు ఎన్నో ఆటంకాలను అధిగమించారు. మహిళా అభ్యర్థులు ప్రచారంలో బహిరంగ ప్రదేశాల్లో మగ ఓటరును నేరుగా కలవకూడదనే ఆంక్షలుండటంతో ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారా ప్రచారం చేశారు. రియాద్ శివార్లలోని దిరియా నుంచి బరిలోకి దిగిన అల్జజి అల్-హొసేనీ ఇంటర్నెట్ ద్వారా 12 రోజులు ప్రచారం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అధికారులు తమకు ఎన్నో ఆటంకాలు కల్పించారని, ఈ విధానంపై అవగాహన కల్పించలేదని మహిళా ఓటర్లు వాపోయారు. వేర్వేరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా, నమోదిత ఓటర్లలో పది శాతంకన్నా తక్కువ మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అతి కొద్దిమంది మహిళలు ఎన్నికల్లో గెలవచ్చని అంచనా వేస్తున్నారు. -
పురుషుల కన్నా మహిళలే అధికంగా..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహిళా ఓటర్లు.. పురుష ఓటర్ల కన్నా క్రియాశీలకంగా మారారు. 5 దశల ఎన్నికలలో భాగంగా ఈ నెల 13, 17వ తేదీలలో జరిగిన తొలి రెండుదశల పోలింగ్‌లో ఈ విషయం వెల్లడైంది. దీనిపై ఎలక్షన్ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ.. పోలింగ్ సమయంలో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారని, పురుషుల కంటే ఎక్కువగా మహిళలు పోలింగ్‌లో ఆసక్తిగా పాల్గొన్నారన్నారు. రెండవ దశ ఎన్నికలలో మొత్తం 54.8 శాతం పోలింగ్ నమోదవగా అందులో మహిళా ఓటర్ల శాతం 57.5 కాగా పురుష ఓటర్లు 52 శాతం. అలాగే అక్టోబర్ 13న జరిగిన మొదటి దశ ఎన్నికలలో సైతం మహిళా ఓటర్లు 59.5 శాతం పాల్లొనగా పురుష ఓటర్లు కేవలం 54.5 శాతం మంది పాల్గొన్నారు. ఈ తాజా పరిణామాలతో రాజకీయ నేతల చూపు మహిళా ఓటర్లపై పడింది. దీంతో మిగిలి ఉన్న మూడు దశల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కుల ఓటుబ్యాంకు, యువతరాన్ని ఆకర్శించే ప్రచార కార్యక్రమాల కన్నా.. మహిళలను ఆకర్శించే పనిలో పడ్డారు. పోలింగ్ సరళిని గమనిస్తున్న విశ్లేషకులు.. గత నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాల ఫలితంగానే మహిళలు క్రియాశీలకంగా ఓటింగ్లొ పాల్గొంటున్నారని అంచనా వేస్తున్నారు. పంచాయితీ రాజ్ ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు పోలీసు, ఉపాధ్యాయ నియామకాలలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించడం వంటి చర్యలు మహిళా చైతన్యానికి కారణాలుగా అంచనా వేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో బాలికా విద్య మెరుగు పడడం వంటి కారణాలు ప్రస్తుతం మహిళా ఓటింగ్ పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. -
22,16,697 జిల్లాలోని ఓటర్ల సంఖ్య
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. మహిళా ఓటర్లతో పోలిస్తే పురుష ఓటర్లు పెరిగారు. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా సవరణ చేపట్టి తుది ఓటర్ల జాబితాను వెలువరించారు. నవంబర్, 2014 ఓటర్ల జాబితాను అనుసరించి జిల్లాలో 22,10,253 మంది ఓటర్లు ఉన్నారు. కాగా సవరణల అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,16,697కు చేరుకుంది. జిల్లాలో మొత్తం 31,97,684 మంది జనాభా ఉండగా వీరిలో22,16,697 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. జిల్లాలో ఓటర్ల సవరణల కోసం మొత్తం 24,418 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,935 దరఖాస్తులను వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. పరిగణలోకి తీసుకున్న 12,483 దరఖాస్తులను పరిశీలించగా వీటిలో 6039 మంది ఓటర్లను తిరస్కరించటం జరిగింది. దీంతో కొత్తగా 6444 మంది ఓటర్లు పేర్లు తుది జాబితాలో చేర్చటం జరిగింది. సవరించిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే జిల్లాలో ఓటర్లు 6444 మంది పెరిగారు. తుది జాబితాను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 0.29 శాతం మేర ఓటర్లు పెరిగారు. కాగా సవరణ జాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య పెరిగింది. 2014 ఓటర్ల జాబితాలో జిల్లాలో 11,16,844 మంది పురుష ఓటర్లు ఉండగా తాజాగా పురుష ఓటర్ల సంఖ్య 11,20,163కు చేరుకుంది. 3319 మేర పురుష ఓటర్లు పెరిగారు. మహిళా ఓటర్లు గత ఓటర్ల జాబితాలో 10,93,289 మంది ఉండగా తాజా జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య 10,96,412కు చేరుకుంది. ఇతర ఓటర్లు 122 మంది ఉన్నారు. కొత్త ఓటరు జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారు పురుషులు 1950 మంది, మహిళలు 1377 మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. -
వరంగల్ జిల్లాలో పురుష ఓటర్లే అధికం
జిల్లాలో మహిళా ఓటర్లతో పోల్చితే 2117 ఎక్కువ నక్కలగుట్ట : జిల్లాలో మహిళా ఓటర్లతో పోల్చితే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనంతరం ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. జిల్లాలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 2,117 అధికంగా నమోదయ్యారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 25,65,394 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో జనవ రి ఒకటి నాటికి జిల్లాలో 12,83,654 మంది పురుష ఓటర్లు నమోదు కాగా, 12,81,543 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. జిల్లాలో ఓటర్ల నమోదు 62 శాతం అధికంగా నమోదైంది. జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 25,65,394 మంది ఓటర్లు నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వరంగల్ జిల్లాలో సాధారణ ఎన్నికల్లో నమోదైన 25,49,688 ఓటర్లకు అదనంగా కొత్తగా 19,550 మంది ఓటర్లు నమోదయ్యారు. ఫారం 6 ద్వారా కొత్తగా 30,463 మంది ఓటర్ల నమోదుకు దరఖాస్తులు చేసుకోగా, అందులో 19,550 మంది ఓట్ల నమోదును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. 10,913 దరఖాస్తులను తిరస్కరించింది. ఫారం 7 ద్వారా తమ ఓట్లను తొలగించాలని కొత్తగా దరఖాస్తులు చేసుకున్న 1860 మంది ఓటర్ల అభ్యర్థనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. జిల్లాలో కొత్తగా 15,706 మంది ఓటర్లను నమోదు చేసుకున్న ఎన్నికల సంఘం, ఓటర్ల తిరస్కరణ నిబంంధన 21 ప్రకారం జిల్లాలో 3844 మంది ఓటర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించింది. సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య జిల్లా లో 0.62 శాతంగా నమోదయ్యింది. -
ఢిల్లీ 6:మహిళల కోసం ఆరు ‘కట్టడాలు’
సౌకర్యం ఇది మామూలు విషయమే కానీ, ఎంతో మంచి విషయం! నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ వాళ్లు, ఢిల్లీ పౌరుల సహకారంతో మహిళల కోసం ఆరు ‘కట్టడాలను’ ఏర్పాటు చేయబోతున్నారు. వాటిల్లో ఒక కట్టడం ఇటీవలే కాశ్మీరీ గేట్ మార్కెట్ ప్రాంతంలో పూర్తయి, వారం క్రితమే మహిళలకు అందుబాటులోకి వచ్చింది కూడా. మహిళలకు కట్టడం అనగానే మనకు తాజ్‌మహల్ గుర్తుకు రావచ్చు. ఒక విధంగా ఈ ఆరు కట్టడాలూ మహిళల గౌరవార్థం, అంతకన్నా కూడా వారి అవసరార్థం నిర్మిస్తున్నవే. ఢిల్లీ ప్రభుత్వ ‘భాగీదారి’ (ప్రజల భాగస్వామ్య పథకం) కింద ‘మై ఢిల్లీ ఐ కేర్’ ప్రాజెక్టు పేరుతో ఫెడరేషన్ నిర్మిస్తున్న ఈ కట్టడాలు... వాష్ రూమ్‌లు! ఇటీవలి ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేసేందుకు మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇలాంటి సందర్భంలోనైనా, ఇలాంటి చోటనైనా మహిళలకు వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు. మహిళా సంక్షేమం కోసం పెద్దపెద్ద పథకాలు ప్రకటించే నాయకులు మహిళలకు అత్యవసరమైన పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణంలో, వాటి నిర్వహణల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారో... ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే! ‘‘ఇవి మాకెంతో ఉపయోగపడతాయి. మగవాళ్లలా మేము ఢిల్లీ వీధులను బహిరంగ మూత్రశాలలుగా మార్చకపోవచ్చు. అంతమాత్రాన మాకు వాష్‌రూమ్‌ల అవసరం లేదని కాదు కదా. ఇది ఎంతో చిన్న విషయంగా మీకు అనిపించవచ్చు. మహిళలకు మాత్రం అత్యవసరమైనది’’ అని కాశ్మీరీ గేట్ వాష్‌రూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా రాగిణి (22) అనే సేల్స్ ఉమన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నార్త్ ఢిల్లీ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని మరో ఐదు ప్రాంతాలలో మహిళల వాష్‌రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. హనుమాన్ మందిర్ రోడ్, కమలానగర్ మార్కెట్, రోషనార బాగ్ సింగ్ సభ గేట్, రోషనార బాగ్ క్లబ్ గేట్ 2, హిందూరావ్ ఆసుపత్రిలోని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మెడికల్ కాలేజీ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నిర్మాణం పూర్తయిన దశలో ఉన్న ఈ ఐదు వాష్‌రూమ్‌లు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఈ వాష్‌రూమ్‌లు మహిళలకు అందుబాటులో ఉంటాయి. భద్రతగా అక్కడ మహిళా సిబ్బంది ఒకరు ఉంటారు. ‘‘ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. వాష్‌రూమ్ పరిశుభ్రతతో పాటు, భద్రతా సిబ్బంది ఏర్పాటుకు కాస్త పెద్ద మొత్తంలోనే డబ్బు అవసరమౌతుంది. అందుకే ఢిల్లీ పౌరుల చేయూతను మేము అర్థించాం. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో ఇంతదూరం రాగలిగాం’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ భాసిన్ అన్నారు. ‘‘గత ఆరేళ్లుగా దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లు తమ బడ్జెట్లో ‘మహిళా టాయ్‌లెట్’ల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాయి. ఢిల్లీ అయితే అంతకు ముందు నుంచే ఈ ప్రాజెక్టు కోసం మల్లగుల్లాలు పడుతోంది. చివరికి ఎలాగైతేనే అందరి సహకారంతో ఆరు వాష్‌రూమ్‌లను నిర్మించగలిగాం’’ అని అశోక్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ఢిల్లీలో మగవాళ్ల కోసం మొత్తం 3,712 పబ్లిక్ టాయ్లెట్లు ఉండగా, మహిళలకు ఉన్నవి కేవలం 269 మాత్రమే! ఎప్పుడూ రద్దీగా ఉండే చాందినీ చౌక్, కరోల్‌బాగ్ మార్కెట్ ప్రాంతాల్లో అయితే మహిళలకు వాష్‌రూమ్‌ల కొరత మరింత తీవ్రంగా ఉంది. ‘‘మాకిది ప్రధాన సమస్య. వాష్‌రూమ్‌లో అందుబాటులు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి శుభ్రంగా ఉండవు. పైగా వాటి దరిదాపుల్లో మాదకద్రవ్యాలకు బానిసలైనవారు తూలుతూ, వాగుతూ కనిపిస్తారు’’ అని చాందినీ చౌక్ దుకాణదారు అరుణిమా కపూర్ అనడంలో... ఇకనైనా మాకు ఈ ఇబ్బందులు తొలగితే మంచిదే కదా అనే ఆశాభావం కనిపిస్తుంది. నార్త్ ఢిల్లీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్లా ప్రతి రాష్ర్టంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తే అరుణిమ లాంటి మహిళల అసౌకర్యాలు తొలగినట్లే! -
ఆమె కీలకం..!
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఓటింగ్ సరళి చర్చనీయాంశంగా మారింది. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉండడం ప్రాధాన్యం సంతరించుకుం ది. దాదాపుగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో మహిళల ఓట్లే కీలకంగా నిలిచాయి. పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొ న్న వీరి తీర్పు కీలకం కానుంది. 2009 సార్వత్రిక ఎన్నిక ల తరహా పోకడలు ఈసారీ స్పష్టంగా కనిపించాయి. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలు, 26 మండలాల పరిధిలో 34,755 మహిళా సంఘాలున్నాయి. వీటిలో సుమారు 3,47,550 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతీ ఎన్నికల్లో గెలుపు ఓటములపై తమదైన ముద్రను వేస్తున్నారు. జిల్లాలోని చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉంది. జిల్లా మొత్తమ్మీద పురుషుల ఓటింగ్ 72.49 శాతం కాగా, మహిళల ఓటింగ్ 72.16 శాతంగా నమోదయింది. నెల్లిమర్ల మహిళలు పోలింగ్‌లో ఫస్ట్ నెల్లిమర్ల నియోజకవర్గం మహిళలు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. జి ల్లా పోలింగ్ శాతం కంటే అధికంగా ఓటు వేశారు. తొమ్మిది నియోజక వర్గాల లోని మొత్తం పోలింగ్ శాతం 79.57 నమోదు కాగా, దానిలో మహిళా ఓటర్ల శాతం 72.16. అయితే నెల్లిమర్ల నియోజ కవర్గంలో అత్యధికంగా 89.32 శాతం మహిళలు ఓటు వేశారు. -
నారీ.. చైతన్య భేరి
సీమాంధ్రలో ఓటు వేసిన వారిలో మహిళలే అధికం 97 స్థానాల్లో మహిళల పోలింగ్ అధికం గ్రామీణ ప్రాంతాల్లో భారీ పోలింగ్.. 85 శాతం దాటిన ఓటింగ్ ఆసక్తి చూపని పట్టణ ఓటర్లు.. 60 శాతం లోపే పోలింగ్ ప్రకాశం జిల్లా దర్శిలో అత్యధికంగా 90.96 శాతం పోలింగ్ నెల్లూరు నగర నియోజకవర్గంలో 56.38 శాతం అతి తక్కువ ఓట్లు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నిలక పోలింగ్‌లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. 13 జిల్లాల్లో బుధవారం జరిగిన పోలింగ్‌లో పురుషులకంటే మహిళలే ఎక్కువ మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మరోపక్క ఓటు హక్కు వినియోగం విషయంలో పట్టణ ఓటర్లలో స్తబ్దత నెలకొనగా, గ్రామీణ ఓటర్లు పోటెత్తారు. పట్టణ, నగర ప్రాంతాల్లోని నియోజకవర్గాలకంటే గ్రామీణ స్థానాల్లో పోలింగ్ శాతం చాలా అధికంగా ఉంది. ఓటు విలువపై గ్రామీణ, మహిళా ఓటర్లలో పెరిగిన చైతన్యానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. సీమాంధ్రలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, పోలైన ఓట్లలో 97 నియోజకవర్గాల్లో మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. మిగిలిన 78 నియోజకవర్గాల్లో మాత్రం పురుషుల ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలో మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో మహిళల ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో మినహా మిగిలిన అన్ని స్థానాల్లో మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీమాంధ్రలో అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గంగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి రికార్డు సృష్టించింది. ఇక్కడ 1,05,643 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డ వైఎస్సార్ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లోనూ మహిళలే ఎక్కువగా ఓట్లేశారు. ఈసారి పల్లె జనం ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనడంతో గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో సగటున 78.37 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ సుమారు 85 శాతం జరిగిందని అంచనా. అనేక పట్టణ, నగర నియోజకవర్గాల్లో మాత్రం సరాసరి పోలింగ్ 62 శాతం లోపే ఉంది. సీమాంధ్రలోని 22 పట్టణ, నగర నియోజకవర్గాలను పరిశీలిస్తే నాలుగు చోట్ల మాత్రమే 70 శాతం మించి పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాల్లోని పల్లెల్లో భారీగా పోలింగ్ జరగడంవల్లే ఈ మేరకైనా ఓట్లు పోలయ్యా. పల్లెలు లేని అనేక నగర నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. పూర్తి నగర, పట్టణ ఓటర్లే ఉన్న విశాఖ ఉత్తర, విశాఖ పడమర స్థానాల్లో పోలింగ్ 60 శాతం లోపే ఉంది. అలాగే విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ లాంటి నియోజకవర్గాల్లో 64 నుంచి 65 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 59.83 శాతం పోలింగ్ జరగ్గా, ఇదే జిల్లాలోని ఎలమంచిలిలో 85.40 శాతం నమోదైంది. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమంలో 64.99 శాతం పోలింగ్ జరగ్గా, ఇదే జిల్లాలోని జగ్గయ్యపేటలో 88.99 శాతం, పామర్రులో 87.77 శాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీలో 67.05 శాతం ఓటింగ్ జరగ్గా, ఇదే జిల్లాలోని రామచంద్రాపురంలో 87.48 శాతం, మండపేటలో 86.97 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లా దర్శిలో అత్యధికంగా 90.96 శాతం పోలింగ్ నమోదైంది. ఇది సీమాంధ్రలో అత్యధిక పోలింగ్ జరిగిన నియోజవర్గంగా రికార్డు సృష్టించింది. నెల్లూరు జిల్లా నెల్లూరు నగర నియోజకవర్గంలో 56.38 శాతం అత్యల్ప పోలింగ్ నమోదుకాగా, ఇదే జిల్లాలోని గ్రామీణ స్థానమైన సర్వేపల్లిలో 84.90 శాతం ఓట్లు పోలయ్యాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య పోలింగ్ శాతం ఎంత తేడా ఉందో ఈ గణాంకాలనుబట్టే అర్థమవుతోంది. -
లేచింది మహిళాలోకం..!
అక్షరాస్యతలో వెనుకబడినా.. ఓటింగ్‌లో ముందున్నారు 30కి పైగా అసెంబ్లీ సీట్లలోపోటెత్తిన మిహళలు పురుషుల కంటే వారి ఓట్లే అధికం కరీంనగర్, నిజామాబాద్, మెదక్,ఖమ్మం జిల్లాల్లో అత్యధికం హైదరాబాద్‌లో అతివల ఓటింగ్ తక్కువ సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో తామే ముందుంటామని మహిళా ఓటర్లు నిరూపించారు. అదీ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పురుషుల కంటే అధికంగా ఓట్లు వేశారు. ఒకటి అరా కాదు. పోలైన ఓట్లలో పురుషులకు, మహిళా ఓటర్లకు వ్యత్యాసం ఏకంగా వేల సంఖ్యలో ఉంది. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో మహిళలు ఓట్ల వేయడానికి పోటెత్తారు. మహిళా ప్రభంజనంతో ఎవరి జాతకాలు మారవుతాయోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. 30 కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు రాజకీయ నాయకుల భవితవ్యం తేల్చబోతున్నారు. అందులో ప్రధానంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేసులో ఉన్న డి.శ్రీనివాస్ పోటీ చేసిన నిజామాబాద్ (గ్రామీణ) నియోజకవర్గంలో ఏకంగా 23 వేల ఓట్ల తేడా ఉండడం గమనార్హం. మహిళల ఓట్లు అధికంగా పడడం నిశ్శబ్ద ఓటింగ్‌కు నిదర్శనం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నియోజకవర్గంలో పురుషుల ఓట్లు 71,926 పోలవగా, మహిళలు 94,788 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి డి.శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ల మధ్య ప్రధాన పోటీ ఉంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోనూ ఇదే పరిస్థితి. పోలైన ఓట్లలో పురుషులవి 61,674 కాగా, మహిళలవి 85,554 కావడం గమనార్హం. ఇక్కడ దాదాపు 24 వేల ఓట్ల వ్యత్యాసం ఉంది. అలాగే కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, హుస్నాబాద్, ఖానాపూర్, ముథోల్, నిర్మల్, బోథ్, ములుగు, కోదాడ, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, కోడంగల్, కార్వాన్, భద్రాచలం, పాలేరు. మధిర, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్లలో వేల సంఖ్యలో పురుష, మహిళా ఓట్ల మధ్య వ్యత్యాసం ఉంది. పధానమైన ఈ నియోజకవర్గాల్లో మహిళలు ఎటువైపు మొగ్గుచూపారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి వడ్డీలేని రుణాలు వర్తింప చేస్తామన్న హామీ బాగా పనిచేసిందని ఆ పార్టీ నాయకులు చెబుతుంటే, మహిళలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పురుషుల ఓట్లు 6,20,913 పోలవగా, మహిళా ఓట్లు 7,04,128 పోలయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే పురుషులతో పోలిస్తే 84 వేల మంది మహిళలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 9,97,737 పురుషుల ఓట్లు పోలవగా, మహిళల ఓట్లు 10,42,821 పోలయ్యాయి. తెలంగాణ మొత్తంలో ఓటింగ్ తక్కువగా నమోదైన జిల్లా హైదరాబాదేననే సంగతి తెలిసిందే. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళా ఓట్ల శాతం తక్కువగా ఉంది. -
ఓటింగ్‌లో మహిళలదే పైచేయి
పింప్రి, న్యూస్‌లైన్: ఈ ఏడాది పుణే జిల్లాలో మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుణే లోక్‌సభ నియోజకవర్గంలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో మిహ ళా ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 51.96 శాతం మంది మహిళలు ఓటుహక్కును ఉపయోగించుకోగా, గతంలో 37.77 శాతం మాత్రమే వినియోగించుకున్నారు. పుణే జిల్లాలో ప్రతి వెయ్యి మంది ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య... పురుష ఓటర్ల కంటే తక్కువ, ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఓటుహక్కుపై జనజాగృతి కూడా కల్పించింది. ఇందుకుగాను మహిళా సంఘాలు, స్వయం సేవాసంఘాల మద్దతుకూడా తీసుకుంది. వీటితోపాటు మహిళా పొదుపు సంఘాలద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈసారి గతంతో పోలిస్తే 15 శాతం మంది మహిళా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. శిరూర్ లోక్‌సభ పరిధిలో 8,49,844 మహిళా ఓటర్లు ఉండగా, వీరిలో సుమారు 4,75,970 (55.60 శాతం) మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. బారామతి లోక్‌సభ పరిధిలో 8,52,229 మంది మహిళా ఓటర్లకుగాను 4,63,488 (54.79 శాతం) మంది, పుణే లోక్‌సభ పరిధిలో 8,85,660 మంది మహిళా ఓటర్లకుగాను 4,60,210 మంది (53.15 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది. -
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్లే అధికం
సవరించిన తుది ఓటర్ల జాబితా విడుదల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈనెల 16 వరకూ సవరించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో కార్యాలయం గురువారం ప్రకటించింది. దీని ప్రకారం ఈ 13 జిల్లాల్లో మొత్తం 3,65,62,986 మంది ఓటర్ల ఉన్నారు. వీరిలో 1,83,88,867 మంది మహిళలు, 1,81,70,961 మంది పురుషులు, 3,158 మంది ఇతరులు (హిజ్రాలు) ఉన్నారు. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. పురుషులతో పోల్చితే గుంటూరు జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య 52,130 ఎక్కువగా ఉంది. అనంతపురం జిల్లాలో మాత్రం మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య 35,984 అధికంగా ఉంది. -
తొలిపోరు నేడే
సాక్షి, నెల్లూరు : ప్రచార, ప్రలోభాల పర్వం ముగిసింది. తొలివిడత పరిషత్ సమరానికి తెరలేచింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో జరుగుతున్న తొలివిడత పరిషత్ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. 21 మండలాలకు చెందిన జెడ్పీటీసీ స్థానాలతోపాటు ఆ మండలాల పరిధిలోని 267 ఎంపీటీసీ స్థానాలకుగాను తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 258 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 698 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 911 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,04,671 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3,47,992 మంది పురుషులు కాగా, 3,56,669 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 10 మంది ఉన్నారు. తొలి విడత ఎన్నికల కోసం 1,740 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఐదు వేల మందికిపైగా అధికారులు పోలింగ్ నిర్వహణలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 148 అతి సమస్యాత్మక, 158 సమస్యాత్మక, 11 తీవ్రవాదుల అలికిడి ఉన్న పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 47 చోట్ల వెబ్‌కెమెరాలు, 152 చోట్ల వీడియోగ్రాఫర్లను నియమించారు. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిదశ పోలింగ్... జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, మర్రి పాడు, సంగం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 21 మంది పోటీలో ఉండగా టీడీపీకి సంబంధించి 21 మంది బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం ఆరు చోట్ల మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు రెండు చోట్ల, బీఎస్పీ అభ్యర్థులు నాలుగు చోట్ల, సీపీఎం రెండు చోట్ల, ఇండిపెండెంట్లు 17 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 73 మంది జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎంపీటీసీలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ తరపున 255 మంది పోటీలో ఉండగా, టీడీపీ తరపున 243 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, బీఎస్పీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఐదుగురు పోటీలో ఉండగా, సీపీఎం నుంచి 27 మంది, 111 మంది ఇండిపెండెంట్లు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 698 మంది పోటీలో ఉన్నారు. బ్యాలెట్ వివరాలు... జెడ్పీటీసీకి సంబంధించి మొదటి విడత ఎన్నికల్లో 7,85,350 బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయగా, ఎంపీటీసీకి సంబంధించి 7,63,300 బ్యాలెట్ పేపర్లను తొలివిడత ముద్రించి సిద్ధంగా ఉంచారు. -
తొలి విడత సమరం
జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ 182 సమస్యాత్మక,140 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 225 మంది వీడియోగ్రాఫర్ల ఏర్పాటు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తొలి విడత ప్రాదేశిక పోరులో ఓటర్ల నిర్ణయం ఆదివారం వెలువడనుంది. సుదీర్ఘకాలం తరువాత జరగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఓటర్లు ఎక్కువగా ఉంటే క్యూలో ఉన్నవారందరికీ స్లిప్పులు అందజేస్తారు. వారిని మాత్రమే ఓటేయడానికి అనుమతిస్తారు. గత నెల రోజులుగా ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్ బాక్సుల్లోకి చేరనున్నాయి. పోలింగ్ కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తొలి దశలో 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీలకు 88 మంది, ఎంపీటీసీలకు 912 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 9,65,504 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 4,75,395 మంది పురుషులు, 4,90,108 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 1177 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2397 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 1295 మంది పీవో, 3883 మంది ఏపీవో, 1295 మంది ఓపీవో మొత్తంగా 6,473 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత విశాఖ,అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో పోలింగ్ జరిగే 22 మండలాల్లో 182 సమస్యాత్మక, 140 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని 395 పోలింగ్ కేంద్రాలకు ఒక్కోదానికి నలుగురు,అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోని 366 పోలింగ్ కేంద్రాలకు ఒక్కోదానికి ఐదుగురు చొప్పున పోలీసు బందోబస్తు ఏర్పాటు చే స్తున్నారు. ఈ ఎన్నికలకు విశాఖ పోలీస్ కమిషనర్ పరిధిలో 1200, రూరల్ ఎస్పీ పరిధిలో 3100 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 225 కేంద్రాల్లో పోలింగ్‌ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్‌ను నియమించారు. 68 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపర్చాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. విశాఖ డివిజన్ కు శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లోను, అనకాపల్లి డివిజన్‌కు ఏఎంఏఎల్ కళాశాలలోను, నర్సీపట్నం డివిజన్‌కు డాన్‌బాస్కో స్కూల్లోను స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. -
మహిళలే ‘కీ’లకం
నల్లగొండ, న్యూస్‌లైన్: ఈనెల 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వారు ఎటు మొగ్గు చూపుతారో ఆ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారనుంది. పురుష, స్త్రీ ఓటర్ల నిష్పత్తిని చూస్తే ఈ విషయం అవగతమవుతోంది. ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 2 0,77, 581 మంది ఉండగా వీరిలో పురుషులు 10,45,068, మహిళలు 10,32,493 మంది ఉన్నారు. ఇతరులు 20 మంది ఉన్నారు. అత్యధికం.. అత్యల్పం జిల్లాలోని 59 మండలాలకుగాను మేళ్లచెర్వు మండలంలో అత్యధికంగా 54,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చౌటుప్పల్(49,605), గరిడేపల్లి(38,576), నేరేడుచర్ల(48,978) మండలాలు ఉన్నాయి. అత్యల్పంగా హుజూర్నగర్ మండలంలో 18,513, తుర్కపల్లిలో 23,505 మంది ఉన్నారు. 18 మండలాల్లో ప్రభావితం జిల్లాలో 18 మండలాల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా మండలాల్లో అన్ని రాజకీయ పార్టీలకు మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ స్థానాల్లో మహిళలకు రిజర్వ్ అయిన వాటితో పాటు జనరల్ మహిళ, జనరల్ స్థానాలు ఉన్నాయి. జనరల్ మహిళల స్థానాల్లో ప్రధాన పార్టీల నాయకుల సతీమణులు ఎంపీపీ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్ల మద్దతు పొందితే తప్ప.. లేకుంటే వారి గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుస్తోంది. జెడ్పీటీసీ స్థానాల్లో.. మేళ్లచెర్వు, మఠంపల్లి, నాంపల్లి, పీఏ పల్లి జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు, చిలుకూరు ఎస్టీ జనరల్, గరిడేపల్లి, మునగాల, నడిగూడెం, పెన్‌పహాడ్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 9 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. అయితే జనరల్ స్థానాల్లో పురుషులు పోటీ చేస్తుండటంతో ఆ మండలాల్లో మహిళా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంపీపీ స్థానాల్లో పోటాపోటీ చిలుకూరు ఎంపీపీ స్థానం జనరల్‌కు రిజర్వ్ కాగా, కేతేపల్లి, మునగాల, నడిగూడెం, నాంపల్లి, వేములపల్లి స్థానాలు జనరల్ మహిళ, మేళ్లచెర్వు, పెన్‌పహాడ్ ఎస్టీ జనరల్, సూర్యాపేట, పీఏపల్లి బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 8 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. ఎస్టీ, బీసీ జనరల్ స్థానాలను మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో మహిళా అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగానే ఉండనుంది. వీరిలో మహిళా ఓటర్లను ఆకర్షించిన వారికే గెలుపు సునాయసం కానుంది. -
పడతులే ప్రధానం
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని మునిసిపాలిటీల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యత. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో 145 వార్డులు/డివిజన్లలో అందలం ఎక్కేదీ అతివలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించటంతో వారికి సమన్యాయం జరగనుంది. జిల్లాలో భీమవరం మినహా ఏలూరు కార్పొరేషన్, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం, తణుకు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 17 వేల 234 మంది అధికంగా ఉన్నారు. గతేడాది జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 442 సర్పంచ్, 4,842 మంది వార్డు సభ్యుల పదవులను మహిళలు అలంకరించారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. -
ఢిల్లీ భవితపై మహిళా ఓటర్ల ముద్ర
న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికల్లో ఈసారి మహిళలు అధికసంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బుధవారంనాటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా మహిళలు ఓటు వేశారు. భద్రత లేమి, నిత్యావసరాల పెరుగుదల వంటి సమస్యలతో తల్లడిల్లుతున్న మహిళలు దక్షిణ ఢిల్లీలోని ఆర్.కె.పురం, మాలవీయనగర్, ఛత్తర్పూర్, తుగ్లఖాబాద్ వంటి నియోజకవర్గాల్లో అధికసంఖ్యలో ఈసారి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు ఓటును ఆయుధంగా వాడుకున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న మహిళలు తమ ఓటుతో స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలమనే ధీమాను వ్యక్తం చేశారు. ఆర్కేపురంలో 800 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల వరకే మహిళలు 50 శాతానికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని స్థానిక పోలింగ్ అధికారి సంజయ్ కిషోర్ తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అభ్యర్థిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తర్పూర్ నియోజకవర్గంలోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 35 వేల మంది ఓటర్లు ఉండగా ఉదయం 11 గంటల వరకు 4,200 మంది ఓటేసినట్లు ఎన్నికల అధికారి రమేష్ రాజ్పుట్ చెప్పాడు. తుగ్లకాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 వేల ఓటర్లు ఉన్న ఇందిరా క్యాంప్ మురికివాడల్లో స్థానిక సమస్యలే ఓటర్ల భవితవ్యాన్ని ప్రభావితం చేయనున్నాయి. ‘ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వానం. చాలా తక్కువ మరుగుదొడ్లు ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి మార్పును కోరుతున్నాం. మా సమస్యలు పట్టించుకునేవారినే ఎన్నుకోవాలనుకుంటున్నాం..’ అని 48 ఏళ్ల క్యాంప్ నివాసి లాల్ సింగ్ చెప్పాడు. మాలవీయనగర్‌లో కొత్తపార్టీ హవా కనిపిస్తోంది. ‘ఇక్కడ వాహనాల పార్కింగ్ చాలా పెద్ద సమస్య. రక్షణ, ధరలు, కరెంటుతో పాటు పార్కింగ్ సమస్యను పరిష్కరించే వారికే ఈసారి మా మద్దతు..’ అని అవ్నీత్ కౌర్ తెలిపారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఆప్ నాయకుడు కేజ్రీవాల్ పోటీపడుతున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలోనూ మొదటిసారి ఓటుహక్కు పొందిన మహిళా ఓటర్లు అధికసంఖ్యలో ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. అయితే జంగ్‌పురా,బాదర్పూర్, సంగం విహార్ వంటి ప్రాంతాల్లో మాత్రం మిహ ళా ఓట్ల శాతం తగ్గిందని చెప్పవచ్చు. -
మహిళలదే పైచేయి
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో రాజకీయ నాయకుల భవిష్యత్తును మహిళా ఓటర్లే నిర్ణయించ నున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు వేసే ఓట్ల పైనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 16,18,712మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 7,99,382 మంది కాగా మహిళా ఓటర్లు 8,19,225 మంది, ఇతరులు 105 మంది ఉన్నారు. గడిచిన 10 నెలల్లో జిల్లావ్యాప్తంగా కొత్తగా 44292మంది ఓటర్లుగా చేరారు. నియోజకవర్గాల వారీగా అధికారులు సోమవారం ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు. దీని ప్రకారం ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో సరి చూసుకోవచ్చు. డిసెంబర్ 10 వరకూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా జరుగుతుంది.1-1-2014 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం ఫారం-6లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిరక్షరాస్యులైన వారు తల్లిదండ్రులతో అఫిడవిట్ అందజేస్తే సరిపోతుంది. అలాగే మరణించిన, శాశ్వతంగా వలస పోయిన వారి పేర్లు తొలగించడానికి తగిన ఆధారాలతో ఫారం-7 అందజేయాలి. ఫారం-8లో పేరు మార్పు,చేర్పుల కోసం తప్పులు సవరించడానికి దరఖాస్తులు అందజేయాలి. ఫారం 8ఎ లో ఓటు ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్‌కు మార్చడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈనెల 24,డిసెంబర్ 1,8వ తేదీల్లో వార్డులు,గ్రామాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. ఆ సమయంలో నేరుగా పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి దరఖాస్తులు అందజేయవచ్చు. తొలగింపుల కోసం 27,590 దరఖాస్తులు అందినట్ల అధికారులు చెబుతున్నారు. -
తగ్గిపోతున్న మహిళా ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు జనాభా నిష్పత్తిలో మహిళలు తగ్గిపోయి పురుషులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుండగా ఇప్పుడు ఓటర్లలో కూడా మహిళలు తగ్గిపోవడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా మెజారిటీ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని, మహిళా ఓటర్లు తగ్గిపోయారని, ఓటర్‌గా నమోదుకు మహిళలు ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఓటర్ల జాబితా సవరణ అనంతరం ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది జాబితాలో పురుష ఓటర్లు 2.90 కోట్ల మంది ఉండగా మహిళలు 2.92 కోట్ల మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కన్నా రెండు లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన ఇంటింటి తనిఖీల అనంతరం మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురుష ఓటర్లు 2.99 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 2.95 కోట్ల మందే ఉన్నారని తేలింది. ఇంటింటి తనిఖీల్లో భాగంగా... మృతి చెందిన, ఒకటి కంటే ఎక్కువచోట్ల నమోదైన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్లు.. ఇలా మొత్తం 20.36 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. ఇదే ఇంటింటి సర్వేలో కొత్తగా 33.10 లక్షల మంది ఓటర్లను జాబితాలో చేర్చుకున్నారు. హిజ్రా ఓటర్ల తగ్గుదల: హిజ్రా ఓటర్ల సంఖ్య కూడా తగ్గింది. గత ఏడాది ఓటర్ల జాబితా సవరణ అనంతరం ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన జాబితాలో ఈ ఓటర్లు 3,964 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,547 మందికి తగ్గిపోయింది.