జిల్లాలో మహిళా ఓటర్లతో పోల్చితే 2117 ఎక్కువ
నక్కలగుట్ట : జిల్లాలో మహిళా ఓటర్లతో పోల్చితే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనంతరం ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. జిల్లాలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 2,117 అధికంగా నమోదయ్యారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 25,65,394 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో జనవ రి ఒకటి నాటికి జిల్లాలో 12,83,654 మంది పురుష ఓటర్లు నమోదు కాగా, 12,81,543 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. జిల్లాలో ఓటర్ల నమోదు 62 శాతం అధికంగా నమోదైంది. జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 25,65,394 మంది ఓటర్లు నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
వరంగల్ జిల్లాలో సాధారణ ఎన్నికల్లో నమోదైన 25,49,688 ఓటర్లకు అదనంగా కొత్తగా 19,550 మంది ఓటర్లు నమోదయ్యారు. ఫారం 6 ద్వారా కొత్తగా 30,463 మంది ఓటర్ల నమోదుకు దరఖాస్తులు చేసుకోగా, అందులో 19,550 మంది ఓట్ల నమోదును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. 10,913 దరఖాస్తులను తిరస్కరించింది. ఫారం 7 ద్వారా తమ ఓట్లను తొలగించాలని కొత్తగా దరఖాస్తులు చేసుకున్న 1860 మంది ఓటర్ల అభ్యర్థనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. జిల్లాలో కొత్తగా 15,706 మంది ఓటర్లను నమోదు చేసుకున్న ఎన్నికల సంఘం, ఓటర్ల తిరస్కరణ నిబంంధన 21 ప్రకారం జిల్లాలో 3844 మంది ఓటర్లను ఓటర్ల జాబితాలో నుంచి తొలగించింది. సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య జిల్లా లో 0.62 శాతంగా నమోదయ్యింది.
వరంగల్ జిల్లాలో పురుష ఓటర్లే అధికం
Published Tue, Jan 20 2015 1:00 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement
Advertisement