ఈ ఏడాది పుణే జిల్లాలో మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పింప్రి, న్యూస్‌లైన్: ఈ ఏడాది పుణే జిల్లాలో మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుణే లోక్‌సభ నియోజకవర్గంలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో మిహ ళా ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 51.96 శాతం మంది మహిళలు ఓటుహక్కును ఉపయోగించుకోగా, గతంలో 37.77 శాతం మాత్రమే వినియోగించుకున్నారు.
పుణే జిల్లాలో ప్రతి వెయ్యి మంది ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య... పురుష ఓటర్ల కంటే తక్కువ, ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఓటుహక్కుపై జనజాగృతి కూడా కల్పించింది. ఇందుకుగాను మహిళా సంఘాలు, స్వయం సేవాసంఘాల మద్దతుకూడా తీసుకుంది. వీటితోపాటు మహిళా పొదుపు సంఘాలద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఈసారి గతంతో పోలిస్తే 15 శాతం మంది మహిళా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. శిరూర్ లోక్‌సభ పరిధిలో 8,49,844 మహిళా ఓటర్లు ఉండగా, వీరిలో సుమారు 4,75,970 (55.60 శాతం) మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. బారామతి లోక్‌సభ పరిధిలో 8,52,229 మంది మహిళా ఓటర్లకుగాను 4,63,488 (54.79 శాతం) మంది, పుణే లోక్‌సభ పరిధిలో 8,85,660 మంది మహిళా ఓటర్లకుగాను 4,60,210 మంది (53.15 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.