మహారాష్ట్రలో ప్రతిష్టంభన.. ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు! | Political Suspense In Maharashtra Mahayuti | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ప్రతిష్టంభన.. ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు!

Nov 30 2024 2:46 PM | Updated on Nov 30 2024 3:49 PM

Political Suspense In Maharashtra Mahayuti

ముంబై: మహారాష్ట్ర మహాయుతి కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు? మంత్రుల స్థానాలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో, ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మురళీధర్‌ మోహోల్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. మరోవైపు.. మహాయుతి కూటమిలో శివనసే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, 24 గంటల్లో షిండే కీలక ప్రకచేస్తారనే చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో షిండే అనారోగ్యంతో ఉన్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు. కాగా, షిండే మాత్రం ఆయన స్వగ్రామం సతారాకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, షిండే ఎలాంటి ప్రకటన చేస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

షిండేకు భారీ షాక్? శివసేన నేత కీలక వ్యాఖ్యలు

మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన ఇలా ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ-132+ షిండే సేన-57+ అజిత్‌ పవార్‌-41+ ఇతరులు= 235. ప్రభుత్వం ఏర్పాటైతే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి, కూటమి నుంచి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు అనే ప్రతిపాదన ఇప్పటి వరకు వినిపిస్తోంది. ఇక​, కూటమి ప్రభుత్వం షిండే హోం మంత్రి పదవి అడిగారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇందుకు బీజేపీ ఒప్పకోలేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement