sting oparation
-
‘50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా’
ముంబై : మరికొద్ది రోజుల్లో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూరుస్తానంటూ ఓ హ్యాకర్.. ఓ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం కూటమికి చెందిన ఓ ఎంపీతో మంతనాలు జరిపినట్లు చెప్పడం గమనార్హం. సదరు మీడియా ప్రతినిధి..ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని పలు మార్లు ఆరోపించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాతో వీడియో కాల్ మాట్లాడారు. తాను ఓ ఎంపీకి వ్యక్తిగత సహాయకుడినంటూ (పీఏ) పరిచయం చేసుకున్నారు. ఆ వీడియో కాల్లో ఎంపీకి పీఏగా పనిచేస్తున్న ప్రతినిధి.. మీతో ఓ ప్రముఖ వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నారు. మీరు మాట్లాడుతారా? అని అడగ్గా.. ఒక్క నిమిషం తర్వాత మరో మీడియా ప్రతినిధి తాను మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తనకు లబ్ధి చేకూరేలా ఈవీఎం హ్యాక్ చేయాలని కోరారు. మధ్యలో సయ్యద్ ఘజా కలగజేసుకుని నియోజవర్గం వివరాల గురించి ఆరాతీశారు. నేను ఈవీఎం హ్యాక్ చేస్తా. అందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈవీఎం హ్యాక్ చేసినందుకు తనకు సుమారు రూ. 52-53 కోట్లు చెల్లించాలి. ప్రాంతాలను స్కాన్ చేయడం,యాప్స్‌ను ఉపయోగించి ఈవీఎం సిగ్నల్స్‌ను మారుస్తానని చెప్పడం వీడియో సంభాషణల్లో వెలుగులోకి వచ్చాయి. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ సయ్యద్ షుజాతో చెప్పడం కలకలం రేపుతుంది.మరి ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మహరాష్ట్ర అధికార,ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి. 👉చదవండి : బీజేపీపై అజిత్ పవార్ తిరుగుబావుటా? -
ఇద్దరు జర్నలిస్టుల దారుణహత్య
భిండ్/ఆరా: మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులు దారుణహత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఇసుకమాఫియాపై వరుస స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి, వారితో పోలీసుల లాలూచీని బయటపెట్టిన టీవీ జర్నలిస్ట్ సందీప్ శర్మను సోమవారం లారీతో ఢీకొట్టించి చంపించారు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగాగాయపడ్డ శర్మ చికిత్స పొందుతూ మరణించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. శర్మ బైక్‌ను లారీ ఢీకొడుతున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఇసుక మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శర్మ మధ్యప్రదేశ్ మానవహక్కుల కమిషన్, డీజీపీ, భిండ్ జిల్లా ఎస్పీలకు లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. భిండ్‌లోని సబ్ డివిజినల్ పోలీస్ అధికారి(ఎస్డీపీవో) ఇసుక మాఫియాతో కుమ్మక్కైన విషయాన్ని శర్మ స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టారు. ప్రమాదస్థలికి సమీపంలోనే పోలీస్‌స్టేషన్ ఉన్నప్పటికీ అక్కడకు చేరుకోవడానికి పోలీసులు 20 నిమిషాలు తీసుకున్నారనీ, ఇందులో కుట్ర దాగిఉందని సందీప్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. సందీప్ హత్యపై సత్వర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బిహార్‌లో మాజీ సర్పంచ్ చేతిలో.. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ నవీన్ నిశ్చల్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతుండగా వెనకనుంచి ఓ ఎస్యూవీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌తో పాటు ఆయన స్నేహితుడు అక్కడికక్కడే చనిపోయారు. తమ కుమారుడ్ని మాజీ సర్పంచ్ అహ్మద్ అలీనే చంపించాడని నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రమాదం అనంతరం ఎస్యూవీ వాహనాన్ని స్థానికులు వెంబడించడంతో నిందితులు కారును వదిలేసి పరారయ్యారు. దీంతో ఆగ్రహోద్రులైన ప్రజలు ఆ ఎస్యూవీ వాహనానికి నిప్పంటించడంతో పాటు మాజీ సర్పంచ్ అలీ ఇంటిపై దాడికి దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనం అలీ పేరుపై ఉందని పోలీసులు తెలిపారు. -
ఎథిక్స్ కమిటీకి ‘స్టింగ్’ వ్యవహారం
- టీఎంసీ ఎంపీల 'లంచం' కేసు - లోక్‌సభ స్పీకర్ ప్రకటన - అభ్యంతరం చెప్పిన తృణమూల్ ఎంపీ న్యూఢిల్లీ: కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లంచం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని స్పీకర్, ఎల్.కె.అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. 2005లో కూడా ఎథిక్స్ కమిటీ లంచం వ్యవహారంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్‌రాయ్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. అద్వానీ నాయకత్వంలో దర్యాప్తు జరిగితే పూర్తి పా రదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సౌగత్ రాయ్ అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు. జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఎం స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తృణమూల్, కేంద్ర సర్కారు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపించింది. ఈ అంశంపై సీపీఎం సభ్యులు బుధవారం రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. తృణమూల్ ఎంపీల వ్యవహారంపై రెండు నోటీసులు వచ్చాయని జీరో అవర్ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే వాటిని చైర్మన్ తిరస్కరించారని వెల్లడిం చారు. కానీ ఈ అంశంపై మాట్లాడేందుకు కురియన్, తృణమూల్ ఎంపీ డెరిక్, సీపీఎం సభ్యుడు సీతా రాం ఏచూరీని అనుమతించారు. తమ పార్టీ ఎంపీలపై వచ్చిన ఆరోపణలను డెరిక్ తోసిపుచ్చారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వ్యక్తి జర్నలిస్టో కాదో ముందు నిర్ధారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలు విశ్వసించదగ్గవి కావని అన్నారు. కాగా, ఈ వీడియోలపై విచారణ జరిపించాల్సిన అవసరముందని సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. అదే సమయంలో సీపీఎం సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి, తృణమూల్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏచూరి ఆరోపించారు. మాపై కుట్రచేస్తున్నారు..: మమత ప్రతిపక్ష పార్టీలు కుట్రతోనే తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ దుష్టకూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు స్టింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని ఆరోపించారు. కాల్చీనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ, మీడియాలోని ఓవర్గం, విపక్ష పార్టీలు చేతులు కలిపి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అన్నారు.